అద్భుత ప్రసంగాలతో అదరగొట్టిన అందాల భామలు
మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ అందాల భామలు టీ హబ్ లో సందడి చేశారు.హెడ్ టు హెడ్ ఛాలెంజ్ పేరిట సుందరీమణులు అద్భుత ప్రసంగాలతో అదరగొట్టారు.;
మిస్ వరల్డ్ 2025 హెడ్ టు హెడ్ ఛాలెంజ్ పోటీలు మంగళవారం టి-హబ్‌లో ప్రారంభమయ్యాయి.72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హెడ్ టు హెడ్ ఛాలెంజ్ తెలంగాణ వ్యవస్థాపక కేంద్రమైన టి-హబ్‌లో ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లో (YouTube)లో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కీలక కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది.
మిస్ వరల్డ్ పోటీదారులు తమ ఆలోచనలను వ్యక్తీకరించడానికి ఉపయోగపడింది.దేశాల వారీగా సుందరీమణులను గ్రూపులుగా విభజించి పోటీలు ఏర్పాటు చేశారు.మంగళవారం అమెరికా, కరేబియన్, ఆఫ్రికా అందాల భామలు అద్భుత ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. తాము చేపట్టబోయే ఛారిటబుల్ ప్రాజెక్ట్‌లు,కమ్యూనిటీ-ఆధారిత సేవలను అందాల భామలు వివరించి చెప్పారు.
అత్యంత ఆకర్షణీయమైన ప్రసంగాలతో యువతులు తదుపరి రౌండ్‌కు చేరుకుంటారు. ఇది మిస్ వరల్డ్ కిరీటం కోసం ప్రయాణంలో కీలకమైన అడుగు.ఈ పోటీలో అత్యంత ముఖ్యమైన, ప్రభావవంతమైన దశల్లో ఒకటిగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ను పరిగణించనున్నారు.అందాలభామల తెలివితేటలు, కరుణ, ప్రపంచవ్యాప్త అవగాహనపై అంచనా వేయనున్నారు.బుధవారం యూరప్, ఆసియా,ఓషియానియా ఖండాల బ్యూటీలు పాల్గొననున్నారు.