బీజేపీది భారత్ టీమ్: బండి సంజయ్

ఇండియా గెలవాలంటే బిజేపి కి ఓటు వేయండి. పాకిస్థాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి. పొలిటికల్ మ్యాచ్ లో కూడా గెలివే అవకాశం ఇవ్వండి అని బండి సంజయ్ అన్నారు.;

Update: 2025-02-25 05:42 GMT

తెలంగాణలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడీ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల చర్చ నడుస్తోంది. ప్రతి పార్టీ నుంచి బడాబడా నేతలు సైతం ప్రచార రంగంలోకి దిగి తమ పార్టీ అభ్యర్థులకే ఓటేయాలని కోరుతున్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనున్న క్రమంలో ప్రతి పార్టీ తమ అభ్యర్థినే గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీది భారత్‌టీం అని వారిది పాకిస్థాన్ టీమ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలని కోరారు. భారత్ అంటే జోష్.. బీజేపీ అంటే జోష్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు.

‘‘మాది భారత్ టీం...వారిది పాకిస్తాన్ టీం. ఇండియా గెలవాలంటే బిజేపి కి ఓటు వేయండి. పొలిటికల్ మ్యాచ్ లో కూడా గెలివే అవకాశం మాకు ఇవ్వండి. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయలేదు. మూడు‌సభలలొ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మాకు వచ్చిన నష్టం లేదని ముఖ్యమంత్రే అన్నారు. కులగణన కి మేము వ్యతిరేకం కాదు. 42% బిసిలకి రిజర్వేషన్లు ఇస్తామంటే మేము స్వాగతిస్తాం. కాని బిసిలలో ముస్లీం లకి రిజర్వేషన్ లు ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మా బిసిలకి ఇచ్చేది 32% మాత్రమే. గుజరాత్, మధ్యప్రదేశ్‌లతో అభివృద్ధిలో పోటీ పడుతారా?’’ అని ప్రశ్నించారు.

‘‘ఫోన్ ట్యాపింగ్ కేసు మీకు సాధ్యం కాకపోతే సీబీఐకి అప్పజెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసు చేసిందే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కెసిఅర్ కి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు. ప్రభాకర్ రావు,శ్రవణ్ లు‌ పారిపోయింది మీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే గదా. ఫార్ములా ఈ కేసులో అర్గనైజర్ నే అక్యుజుడ్ గా చేర్చలేదు. కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డారు అన్న కేసులలో కేసీఆర్‌కి నొటిసులు ఇవ్వలేదు. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం ప్రభుత్వం చెయ్యడం లేదు. జన్వాడ ఫాంహౌస్ ఎందుకు కూల్చడం లేదు..ఇది హైడ్రాలో లేదా? లిక్కర్ స్కాంలో కెసిఅర్ కూతురు ని అరెస్టు చేసింది మేము‌ కాదా’’ అని నిలదీశారు.

‘‘ఢిల్లీ నాయకత్వానికి ముడుపులు ముట్టాయి కాబట్టే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులు పట్టించుకోవడం లేదు. పదేండ్లలలో పదికొట్ల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మోదీది. వరి వేస్తే ఉరి అన్న కెసిఅర్ ని రాజకీయ సమాధి చేసారు. వరి వేయవద్దని కాంగ్రెస్ నాయకులు రైతులని బెదిరిస్తున్నారు. కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ యాబై శాతం నాశనం చేస్తే, కాంగ్రెస్ యాభై శాతం నాశనం చేస్తుంది. కృష్ణా జలాలని పక్కా రాష్ట్రం దోచుకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌కి ఏటీఎం లా మారింది. నిన్నటి సభలో మోదీ పెద్ద బిసి, నన్ను చిన్న బిసి అని బీసీలని‌ అవమాన పరిచారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి కేంద్రం ఐదు డిఏలు ఇస్తుంది...రాష్ట్ర ‌ప్రభుత్వం ఎన్ని డిఏలు ఇస్తుంది?’’ అని ప్రశ్నలు గుప్పించారు.

Tags:    

Similar News