RajBhavan AT HOME | రాజ్‌భవన్‌లో ఎట్ హోం సందడి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. సీఎం డాక్టర్ డి నాగేశ్వరరెడ్డిని సన్మానించారు.;
By : Shaik Saleem
Update: 2025-01-26 15:31 GMT
రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఇచ్చిన ‘తేనీటి విందు’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
- ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్, కేంద్ర బొగ్గు, గనుల మంత్రి జి కిషన్ రెడ్డి; కన్హా శాంతివనం వ్యవస్థాపకులు కమలేష్ డి పటేల్,రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, మిలటరీ అధికారులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పలువురు రాష్ట్ర ప్రముఖులు హాజరయ్యారు.
- ఈ కార్యక్రమంలో ‘గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024’ కు ఎంపికైన సభ్యులకు గవర్నరు అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అతిథులను కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఎట్ హోం కార్యక్రమానికి వచ్చిన అతిథులను గవర్నర్ అప్యాయంగా పలకరించారు.
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని @tg_governor శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన “ఎట్ హోమ్” కార్యక్రమానికి ముఖ్యమంత్రి @revanth_anumula గారు హాజరయ్యారు.
— Telangana CMO (@TelanganaCMO) January 26, 2025
ముఖ్యమంత్రి గారితో పాటు కేంద్ర మంత్రి @kishanreddybjp గారు, శాసనమండలి చైర్మన్ @Gutha_Sukender గారు,… pic.twitter.com/7dmg7LRAbp