మలక్‌పేటలో యువతిపై పోకిరీల వీరంగం

హైదరాబాద్‌లో మద్యం తాగిన పోకిరీలు ఓ యువతిని వేధించిన ఘటన సంచలనం రేపింది. తనకు కాబోయే భార్యతో ఓ యువకుడు కారులో ఉండగా పోకిరీలు వీరంగం సృష్టించారు.;

Update: 2025-03-20 12:28 GMT

హయత్ నగర్ ప్రాంతాానికి చెందిన వంశీ కృష్ణకు సైదాబాద్ ప్రాంతానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లాడనున్న యువతిని కలిసేందుకు వంశీకృష్ణ మార్చి 18వతేదీ రాత్రి గంటలకు మలక్ పేట ప్రాంతంలోని హిల్స్ గ్రౌండ్ వద్దకు కారు వచ్చాడు. కాబోయే భార్యతో కలిసి కారులో కూర్చొని మాట్లాడుకుంటుండగా, పీకల దాకా మద్యం తాగిన పోకిరీలు రంగంలోకి దిగారు. కారులో ఉన్న యువతిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం రేపింది.


యువతిని వేధించిన పోకిరీలు
పోకిరీలు కారు అద్దాలు తీయాలని బెదిరించడంతోపాటు యువతిని బయటకు లాగేందుకు యత్నించారు. మందుబాబులు కారులో నుంచి యువతిని బయటకు లాగే ప్రయత్నం చేశారు.దీంతోపాటు యువతి ఉన్న కారును పోకిరీలు వెంబడించి మరీ వేదించారు. కారును ధ్వంసం చేయడమే కాకుండా కారు బానెట్ పై కూర్చొని వీరంగం సృష్టించారు.

వెంటాడిన మందుబాబులు
కారులో ఉన్న యువతి కోసం పోకిరీలు కిలోమీటర్ దూరం వరకు కారు బానెట్ పై ఉండి ప్రయాణించారు. ఎలాగైనా కాబోయే భార్యను కాపాడాలని వంశీక‌ృష్ణ తీవ్ర ప్రయత్నం చేశారు.తనకు కాబోయే భార్యను కాపాడుకునేందుకు వంశీకృష్ణ కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. దీంతో కారుపైకి ఎక్కిన ఓ పోకిరి దూకి పారిపోయాడు. మరో మందుబాబు కారు అద్దంపై కూర్చొని ఉండటం దారి కనిపించక పోయినా తనకు కాబోయే భార్యను కాపాడుకునేందుకు కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో కారు రెండు ద్విచక్రవాహనాలను ఢీకొని ఆగి పోయింది. ద్విచక్రవాహనాల వారు వంశీకృష్ణను కొట్టి పోలీసులకు అప్పగించారు.

యశోదా ఆసుపత్రికి తరలింపు
ఈ ఘటనలో గాయపడిన వంశీకృష్ణను పోలీసులు మలక్ పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. వంశీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని మలక్ పేట పోలీసులు చెప్పారు. తాము ముందుగా యాక్సిడెంట్ కేసు అని భావించామని, తర్వాత వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని మలక్ పేట ఇన్ స్పెక్టరు పి నరేష్ చెప్పారు.

కేసు నమోదు చేశాం : మలక్ పేట ఇన్ స్పెక్టర్ పి నరేష్
పీకల దాకా మద్యం తాగి కారులో కాబోయే భర్తతో ఉన్న యువతిని వేధించడమే కాకుండా వారిని వెంటాడిన గుర్తుతెలియని పోకిరీలపై తాము న్యూసెన్స్, వేధింపుల కేసు నమోదు చేశామని మలక్ పేట ఇన్ స్పెక్టరు పి నరేష్ ‘ ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాము మలక్ పేట ప్రాంతంలోని హిల్స్ గ్రౌండ్ వద్ద సీసీ టీవీ ఫుటేజ్ ను సేకరించామని, ఈ ఘటనలో ఇద్దరు పోకిరీలున్నట్లు తేలిందని ఆయన పేర్కొన్నారు. పోకిరీల కోసం తాము ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని మలక్ పేట ఇన్ స్పెక్టరు పి నరేష్ వివరించారు.


Tags:    

Similar News