ఖోఖో ఆడుతూ కుప్పకూలిన విద్యర్థి..
గుండెపోటు.. ప్రస్తుతం భారత్‌లో అన్ని వయసుల వారిని హడలెత్తిస్తోంది. చిన్న పిల్లలు సైతం గెండెపోటుతో మరణిస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.;
గుండెపోటు.. ప్రస్తుతం భారత్‌లో అన్ని వయసుల వారిని హడలెత్తిస్తోంది. చిన్న పిల్లలు సైతం గెండెపోటుతో మరణిస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉన్నట్టుండి వస్తున్న ఈ గుండె పోటుకు కారణం ఏంటో తెలియక వైద్యులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇంతలోనే గురువారం తాజాగా ఇటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా నార్పూర్ జడ్పీ పాఠశాలలో ఖోఖో ఆడుతూ తొమ్మిదో తరగతి విద్యార్థి కుప్పకూలిపోయా. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ ఘటనతో తోటి విద్యార్థులు కన్నీమున్నీరయ్యారు. కొద్దిసేపటి వరకు తమతో ఉత్సాహంగా కలిసి ఆడిన తమ స్నేహితుడు ఇక లేడన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఇందులో ఖోఖో కూడా నిర్వహించారు. ఈ ఆటలో అందరితో పాటు బన్నీ కూడా పాల్గొన్నాడు. అంతా సాఫీగా సాగుతుండగా ఒక్కసారిగా బన్నీ కుప్పకూలిపోయాడు. తోలి విద్యార్థులు వెళ్లి చూసే సరికి బన్నీకి స్పృహలేదు. విషయం తెలిసిన పాఠశాల సిబ్బంది బన్నీని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బన్నీని పరిశీలించిన వైద్యులు.. బాలుడికి గుండెపోటు వచ్చిందని, అప్పటికే మరణించాడని స్పష్టం చేశారు. అంతేకాకుండా బన్నీకి గతంలో కూడా ఒకసారి గుండెపోటు వచ్చిందని, కాగా అతడికి స్టంట్ కూడా వేసినట్లు వైద్యులు చెప్పారు.