IMD HYDERABAD | 99 ఏళ్ల హైదరాబాద్ వాతావరణ కేంద్రం సేవలెన్నో...

హైదరాబాద్లో వాతావరణ అబ్జర్వేటరీని ఏర్పాటు చేసి 234 ఏళ్లు అయింది.బేగంపేటకు ఈ కేంద్రాన్ని మార్చి 99 ఏళ్లు అయింది.హైదరాబాద్ ఐఎండీ కేంద్రం సేవలపై ప్రత్యేక కథనం...;

Update: 2025-01-08 14:25 GMT

హైదరాబాద్ నగరంలో భారత వాతావరణశాఖ (IMD HYDERABAD) కేంద్రం ఆవిర్భవించి 150 ఏళ్లు గడచిన సందర్భంగా వేడుకలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు.1875 జనవరి 15వతేదీన స్థాపించిన

ఐఎండీ 150వ వేడుక జరుపుకుంటోంది.ఐఎండీ వేడుకలు నిర్వహిస్తుండటం తమకెంతో సంతోషంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెడ్ సైంటిస్ట్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
- ఈ వేడుక సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్త్వత్వ పోటీలు, క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మొక్కలు నాటడంతోపాటు సెమినార్ నిర్వహించారు.
- హైదరాబాద్ నగరంలో వాతావరణ అబ్జర్వేటరీని ఏర్పాటు చేసి 234 ఏళ్లు అయింది.బేగంపేటకు ఈ కేంద్రాన్ని విమానాశ్రయానికి మార్చి 99 ఏళ్లు అయింది(99 years old). ఈ అబ్జర్వేటరీ కేంద్రాన్ని 1973వ సంవత్సరంలో వాతావరణ కేంద్రంగా అప్ గ్రేడ్ చేశారు.

నిజామియా అబ్జర్వేటరీ
హైదరాబాద్‌ నగరంలో పాత అబ్జర్వేటరీ 1891వ సంవత్సరం నవంబర్ 10వ తేదీన శిఖరం పైభాగంలో ఉన్న నిజామియా అబ్జర్వేటరీ భవనంలో ప్రారంభించారు.తర్వాత ఈ కేంద్రాన్ని 1926వ సంవత్సరంలో పాత బేగంపేట విమానాశ్రయానికి మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ సేవలను విస్తరించడానికి 1973వ సంవత్సరంలో అబ్జర్వేటరీని వాతావరణ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేశారు.హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్ పోర్ట్ కాలనీలో వాతావరణ కేంద్రంలో వాతావరణ సూచనలు, డాప్లర్ వెదర్ రాడార్, ఆగ్రో మెట్రాలజీ, ఏవియేషన్, ఫ్లడ్ మెట్రాలజీ, అబ్జర్వేషనల్ నెట్ వర్క్ సేవలు అందిస్తున్నారు.

డాప్లర్ వెదర్ రాడార్
అత్యాధునిక S-బ్యాండ్ డాప్లర్ వెదర్ రాడార్ హైదరాబాద్ నగరం చుట్టూ 250 కిలోమీటర్ల దూరం వరకు ప్రభావవంతంగా వాతావరణ నిఘా వేస్తుంది. ఈ రాడార్ లొకేషన్, మేఘాల తీవ్రత,మేఘాల నుంచి ఆశించిన వర్షపాతం, క్షితిజ సమాంతర గాలులను వర్ణించే వాల్యూమ్ స్కాన్ నుంచి వచ్చిన చిత్రాలను రూపొందిస్తుంది.ప్రతీ 10 నిమిషాలకు స్వయంచాలకంగా వెబ్‌సైట్‌లో వాతావరణ విశ్లేషణ కోసం రాడార్ పనిచేస్తుంది.రాడార్ సూచనలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్,విపత్తు ప్రతిస్పందన బృందానికి అందిస్తోంది.

రైతులకు సలహాలు
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు వాతావరణ సేవలను విస్తరించేందుకు 1987వ సంవత్సరంలో వ్యవసాయ వాతావరణ సలహా యూనిట్‌ను ఏర్పాటు చేశారు.ఈ విభాగం ప్రతీ మంగళవారం, శుక్రవారం జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, జిల్లా, బ్లాక్ స్థాయి వ్యవసాయ వాతావరణ,వ్యవసాయ బులెటిన్‌లను విడుదల చేస్తుంది.వ్యవసాయంలో వివిధ దశల్లో వివిధ పంటలకు భారీ వర్షపాతం అలర్ట్ లు జారీ చేస్తుంది.

క్లైమాటోలాజికల్ విభాగం
హైదరాబాద్‌లోని క్లైమాటోలాజికల్ విభాగం గత వాతావరణ డేటాను పరిశీలిస్తుంది.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రెండింటిలోనూ వివిధ వాతావరణ సమాచారంపై డేటాబేస్‌ను అందిస్తుంది.ఐఎండీ వ్యవసాయ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, జీహెచ్ఎంసీతో సమావేశాలు నిర్వహిస్తుంది.ఐఎండీ కేంద్రం వాతావరణ సూచనలు,ఏజెన్సీలకు హెచ్చరికలను జారీ చేస్తుంది.

వాతావరణ అంచనాలు, హెచ్చరికలు
హైదరాబాద్ వాతావరణ అంచనా, హెచ్చరికలు రోజుకు నాలుగు సార్లు జారీ చేస్తుంది ఇందులో భారీ వర్షపాతం, ఉరుములు, తుపాన్లు, ఆకస్మిక వరదల హెచ్చరికలు ఉంటాయి. పట్టణ వరదలు. రాబోయే 7 రోజులు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల వాతావరణంపై హెచ్చరికలను జారీ చేస్తుంది. వేసవి, చలికాలంలో హీట్ వేవ్, కోల్డ్ వేవ్ హెచ్చరికలు ఇస్తుంది.హైదరాబాద్ సిటీలో జోన్ల వారీగా వాతావరణ అంచనా, హెచ్చరికలు జారీ చేస్తుంది.తెలంగాణ రాష్ట్రం,చుట్టుపక్కల జాతీయ రహదారుల కోసం ఐఎండీ సూచనలు జారీ చేస్తుందని వాతావరణ కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఏవియేషన్ సర్వీసులు
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏటీసీ అన్ని విమానయాన సంస్థలకు వాతావరణ సమాచారం అందిస్తుంది.ఈ కేంద్రం గాలులు, ఉష్ణోగ్రతలు,వాతావరణం, ఏరోడ్రోమ్ హెచ్చరికలను జారీ చేస్తుంది.

వరదలపై వాతావరణ శాస్త్రవేత్తల అలర్ట్
హైదరాబాద్‌లోని వరద వాతావరణ కార్యాలయం వరద సీజన్‌లో జూన్ నుంచి అక్టోబర్ వరకు గోదావరి,కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలకు ఐదు రోజుల బులెటిన్‌లను విడుదల చేస్తుంది. వర్షపాతం సూచన, భారీ వర్షపాతం హెచ్చరికలతో పాటు వరద విపత్తులపై అలర్టులు జారీ చేస్తుంది.

హైదరాబాద్ వాతావరణ పరిస్థితులపై యాప్‌లు
హైదరాబాద్ వాతావరణ సమాచారం (Weather Information) కోసం మౌసమ్ యాప్, పిడుగులు పడే అలర్ట్ కోసం దామిని యాప్, రైతులకు వాతావరణఅప్ డేట్స్ కోసం మేఘదూత్ యాప్ ను ఐఎండీ విడుదల చేసింది. మెట్రోలాజికల్ సెంటర్ సమాచారాన్ని సోషల్ మీడియాలైన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టరులో, ఐఎండీ హైదరాబాద్ సమాచారం ఫేస్ బుక్ లో, యూట్యూబ్ లో ఎప్పటికప్పుడు అందిస్తున్నామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెడ్ సైంటిస్ట్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


Tags:    

Similar News