హైదరాబాద్ నుంచి 90 విమాన సర్వీసుల రద్దు

ఆపరేషన్ సింధూర్, భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.;

Update: 2025-05-09 00:37 GMT
హైదరాబాద్ నుంచి పలు విమాన సర్వీసుల రద్దు

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉత్తర భారతదేశంలోని పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయడంతో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పలు విమాన యాన సంస్థలు ప్రకటించాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు విమానాశ్రయాలను మే 10వతేదీ వరకు మూసివేయడంతో దేశ వ్యాప్తంగా విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపించింది.

- హైదరాబాద్ నుంచి శ్రీనగర్, జమ్మూ, లేహ్, అమృత్ సర్, చంఢీఘడ్ నగరాల మధ్య నడిచే 90కి పైగా విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా, ఇండిగో ,స్పైస్‌జెట్‌ విమాన యాన సంస్థలు ప్రకటించాయి. శుక్ర, శనివారాల్లో విమాన సర్వీసులను రద్దు చేశామని శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారి ఒకరు చెప్పారు.


ఉత్తరాది నగరాలకు విమాన సర్వీసుల రద్దు
ఎయిర్ ఇండియా అమృత్‌సర్‌కు 10, లేహ్‌కు 14, శ్రీనగర్‌కు 11 విమానాలు, జమ్మూకు 4-5 విమానాలు నడిపేంది. ఆపరేషన్ సింధూర్, పాక్ తో యుద్ధం కారణంగా ఆయా విమాన సర్వీసులను రద్దు చేశామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు 12 ఎయిర్ ఇండియా విమానాలను కూడా రద్దు చేశారు.
- ఇండిగో విమాన యాన సంస్థ శ్రీనగర్‌కు నడిపే 10, అమృత్‌సర్‌కు 11, లేహ్‌కు 11, జమ్మూకు 7 విమాన సర్వీసులను రద్దు చేశాయి. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు మరియు బయలుదేరే విమానాలను మే 10వతేదీ వరకు ఉదయం 5.29 గంటల వరకు రద్దు చేసినట్లు విమాన యాన అధికార వర్గాలు తెలిపాయి.

రీషెడ్యూల్ చేసుకోండి
విమాన టికెట్లు తీసుకున్న ప్రయాణికులు విమానాల రద్దుతో 20 రోజుల తర్వాత రీషెడ్యూల్ చేసుకోవాలని విమానయాన సంస్థ అధికారులు సూచించారు. భారత్- పాక్ యుద్ధం కారణంగా వేసవికాలంలో ఉత్తరాది రాస్ట్రాల్లో పర్యటించాలనుకునే పర్యాటకులు తమ యాత్రలను రద్దు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్, గురువారం రాత్రి జరిగిన భారత్, పాక్ సైనిక దాడుల ఫలితం హైదరాబాద్ విమానాశ్రయాలపై పడింది. బుధవారం సాయంత్రం నాటికి ఇండిగో 16 విమానాలను రద్దు చేసింది. గురువారం నాటికి రద్దు చేసిన విమానాల సంఖ్య పెరిగింది.


Tags:    

Similar News