రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కనుబరుగవడం ఖాయం: మహేష్ కుమార్
రాష్ట్రంలో బంగారం లాంటి భూములను దోచుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని, చరిత్రను మరిచి మాట్లాడటం సరికాదని అన్నారు.;
హెచ్‌సీయూ భూముల వివాదం తీవ్ర రాజకీయ రగడకు దారితీస్తోంది. ఈ వివాదంపై అధికార ప్రతిపక్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఈరోజు ఇదే వివాదంపై తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రేవంత్ చెప్పిన మాటలు నమ్మి ఎవరూ ఆ భూములను కొనద్దొని, కొంటె నష్టపోతారని హెచ్చరించారు. మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఆ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటామని అన్నారు. కాగా కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ సెటైర్లు వేశారు. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని చురకలంటించారు. భూములను కాపాడలని బీఆర్ఎస్ నేతలు అంటుంటే దెయ్యాలు వేదాలు వల్లెవేస్తున్నట్లు ఉందన్ని విమర్శలు చేస్తారు. రాష్ట్రంలో బంగారం లాంటి భూములను దోచుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని, చరిత్రను మరిచి మాట్లాడటం సరికాదని అన్నారు.
‘‘గతంలో చంద్రబాబు నాయుడు ఐఎంజీ భారత్‌కు అప్పనంగా భూములు కట్టబెట్టారు. అప్పుడే మా నేత వైఎస్ఆర్.. ఈ భూమి కేటాయింపులను రద్దు చేసి వాటిని కాపాడారు. రాష్ట్రంలోని బంగారం లాంటి భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై విచారణ జరగాలి. రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనత కేటీఆర్‌ది. మళ్ళీ అధికారంలోకి వస్తామని వాళ్లు పగటికలలు కనడం మానుకోవాలి. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీనే కనిపించకుండా పోతుంది’’ అని విమర్శలు గుప్పించారు.
అనంతరం ఆయన తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కూడా కీలక అప్‌డేట్ ఇచ్చారు. క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్ అనేది తమ చేతుల్లో ఉన్న అంశం కాదని, ఈ విషయంలో తుది నిర్ణయం ఏఐసీసీదేనని చెప్పారు. అయితే మంత్రివర్గ విస్తరణ చేస్తే అందులో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన చెప్పారు. ‘‘మంత్రి వర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రాంతాలు, కులాల వారీగా చూడాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ విస్తరణలో మైనారిటీకి అవకాశం ఉంటుంది’’అని మహేష్ చెప్పుకొచ్చారు.