అయ్యప్ప భక్తులకు ఇకపై తీపి పాయసం, పప్పడ్..
రెండ్రోజుల్లో అమల్లోకి..
By : The Federal
Update: 2025-11-25 13:51 GMT
కేరళ(Kerala)లో శబరిమళ(Sabarimala) అయ్యప్ప భక్తులకు అన్నదానం(Annadanam)లో వడ్డించే ఆహార పదార్థాలను మార్చనున్నారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) మంగళవారం నిర్ణయం తీసుకుంది.
‘‘గతంలో పులావ్, సాంబార్ వడ్డించేవాళ్లం. కాని ఇప్పుడు తీపి పాయసం, పప్పడ్ ఇవ్వాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇది బుధవారం లేదా గురువారం నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మార్పు గురించి ఇప్పటికే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చాం.’’ అని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కే జయకుమార్ చెప్పారు.
శబరిమల మాస్టర్ ప్లాన్‌పై, వచ్చే ఏడాది వార్షిక తీర్థయాత్రకు సన్నాహాల గురించి చర్చించేందుకు డిసెంబర్ 18న సమీక్షా సమావేశం ఏర్పాటు చేశామని జయకుమార్ తెలిపారు.