డీఎంకే వ్యతిరేక కూటమి మరింత బల‌పడుతుందా?

2026 ఎన్నికలకు ముందు తమిళనాట అనూహ్య మార్పులు?;

Update: 2025-09-05 11:35 GMT
కేఏ సెంగొట్టయన్
Click the Play button to listen to article

అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగొట్టయన్ (KA Sengottaiyan) వ్యాఖ్యలపై తమిళనాడు(Tamil Nadu)లోని వివిధ పార్టీల నేతలు స్పందించారు. ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. పార్టీని వీడిన, బహిష్కరణకు గురైన నాయకులు, కార్యకర్తలను తిరిగి వెనక్కు తీసుకురావాలని సెంగొట్టయన్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి(Palaniswami)కి 10 రోజుల అల్టిమేటం జారీ చేశారు. ఐక్యంగా ఉంటేనే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో డీఎంకేను గద్దె దించాలని కోరుకుంటున్న తమిళనాడు బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, వీకే శశికళ, మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్)..AIADMK మాజీ మంత్రి సెంగొట్టియన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.


‘మంచిదే కదా’..

"ఐక్యంగా ఉండటం మంచి విషయం. ఈ ప్రయత్నానికి EPS (ఎడప్పాడి కె పళనిస్వామి) నాయకత్వం వహించాలి. అవసరమైతే మేం ఆయనతో చర్చిస్తాము." అని పేర్కొన్నారు నాగేంద్రన్.


‘అలా కోరుకోవడం సహజం’

“ఐక్యత గురించి మాట్లాడిన సెంగోట్టయన్‌ను వ్యతిరేకిగా చూడకూడదు. విడిపోయిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని కోరుకోవడం సహేతుకమే. అందులో తప్పేంటి? నిజానికి. అది EPS నాయకత్వాన్ని బలం కూడా. విడిపోయిన వారిని తిరిగి తీసుకురావాలనేది బీజేపీ కోరిక. అలా చేస్తే తనకు ఎదురయ్యే పరిణామాల గురించి ఎడప్పాడి పళనిస్వామి ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడే మా మధ్య అభిప్రాయ భేదం ఉంది.” అని RSS సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి అన్నారు.


‘కార్యకర్తలు భావాలను బయటపెట్టారు’

‘‘సెంగోట్టియన్ వ్యాఖ్యలు అన్నాడీఎంకే కార్యకర్తల భావాలను ప్రతిబింబిస్తున్నాయి. అన్నాడీఎంకే రక్తం ఆయన సిరల్లో ప్రవహిస్తుందని నిరూపించుకున్నారు. ఐక్య అన్నాడీఎంకే మాత్రమే తమిళనాడులో రాజకీయ మార్పు తీసుకురాగలదు” అని శశికళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


‘కలిసి ఉంటేనే ఓడించగలం’

మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం కూడా సెంగోట్టయన్ వ్యాఖ్యలను సమర్థించారు. "అన్నాడీఎంకే అభివృద్ధికి సెంగొట్టయన్ ఎంతో శ్రమించారు. ఐక్యత కోసం ఆయన పిలుపు నివ్వడం అభినందనీయం. కలిసి ఉంటేనే విజయం సాధించగలం. మనవాళ్లంతా విడిపోవడం పార్టీకి పెద్దదెబ్బ. ఐక్యత కోసం పనిచేసే వారికి నా మద్దతు ఉంటుంది. సెంగోట్టయన్ దార్శనికతకు నా పూర్తి సహకారం అందిస్తా." అని అన్నారు.


‘చర్చలు జరుగుతున్నాయి’

ఇటీవలే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్), ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌తో చర్చలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై వెల్లడించారు. "2026లో తమిళనాడుకు ఒక ప్రభావవంతమైన ప్రభుత్వాన్ని అందించడమే NDA లక్ష్యం. ఈ మిషన్‌లలో TTV దినకరన్, OPS ఇద్దరూ భాగం కావాలని నేను కోరుకుంటున్నా" అని అన్నారు.

సెంగోట్టియన్ వ్యాఖ్యలు డీఎంకేయేతర కూటమికి పూర్తిమద్దతుగా ఉన్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి. 

Tags:    

Similar News