వయనాడ్‌లో చిక్కుకుపోయిన బెంగాల్ వలస కార్మికులు

కేరళలోని వయనాడ్ జిల్లాలో చిక్కుకుపోయిన తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీల జాడ కోసం ఇతర రాష్ట్రాలు అన్వేషణ మొదలుపెట్టాయి.

Update: 2024-08-03 08:26 GMT

పశ్చిమ బెంగాల్ కార్మిక మంత్రి మోలోయ్ ఘటక్

కేరళలోని వయనాడ్ జిల్లాలో చిక్కుకుపోయిన తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీల జాడ కోసం ఇతర రాష్ట్రాలు అన్వేషణ మొదలుపెట్టాయి. కొండ చెరియలు విరిగిపడిన దుర్ఘటనలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కొంతమంది కనిపించకుండా పోయారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి వెళ్లిన వలస కూలీలు కుటుంబసభ్యులు తమ వాళ్ల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆచూకీ లేకుండా పోయిన వారిలో తమ రాష్ట్రానికి చెందిన వారెవరైనా ఉన్నారా? అని తెలుసుకునే పనిలో పడ్డాయి.

వాయనాడ్ జిల్లాలో తమ రాష్ట్రానికి చెందిన 242 మంది వలస కూలీలు చిక్కుకుపోయారని పశ్చిమ బెంగాల్ కార్మిక మంత్రి మోలోయ్ ఘటక్ అసెంబ్లీకి తెలిపారు. కొంతమంది కార్మికులతో ఇప్పటికే మాట్లాడామని, మిగిలిన వారితో సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు తమతో మాట్లాడిన కార్మికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లే కార్మికుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. కార్మిక శాఖ లెక్కల ప్రకారం.. దాదాపు 22 లక్షల మంది కార్మికులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు ఢిల్లీకి వెళ్లారు. వలస కార్మికులు అత్యధికంగా ఉన్న జిల్లా ముర్షిదాబాద్. ఆ తర్వాతి స్థానాల్లో మాల్దా, పశ్చిమ మిడ్నాపూర్, నదియా. తూర్పు మిడ్నాపూర్ ఉన్నట్లు వెస్ట్ బెంగాల్ కార్మిక శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News