మరో వివాదానికి తెరతీసిన ఉదయనిధి స్టాలిన్.. ఈ సారి సినీ పరిశ్రమపైనే..

తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ పరిశ్రమపై ఆయన మాట్లాడిన మాటలు ఉత్తరాది రాష్ట్రాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి.

By :  491
Update: 2024-11-04 10:18 GMT

తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరో వివాదానికి తెరతీశారు. ఇప్పటికే సనాతన ధర్మాన్ని మలేరియా, దీన్ని నాశనం చేయాలని మాట్లాడటంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. దీనిపై వివాదం సమసిపోకముందే ఇప్పుడు ఉత్తరాదిలో ఏ చిత్ర పరిశ్రమ కూడా దక్షిణాది పరిశ్రమ కంటే ఎక్కువ అభివృద్ధి చెందలేదని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆయన ఏమన్నారంటే..

“తమిళ చిత్ర పరిశ్రమ ఇప్పుడు బిలియన్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. మలయాళం, తెలుగు, కన్నడ సినిమాలు దూసుకుపోతున్నాయి. అయితే ఉత్తర భారతదేశంలో ఏ భాషకైనా మనకి ఉన్నంత వైబ్రెంట్ ఇండస్ట్రీ ఉందా? సమాధానం చెప్పడం పెద్ద కష్టం కాదు. ఉత్తరాదిలో మాట్లాడే దాదాపు అన్ని భాషలూ హిందీకి దారి తీశాయి'' అన్నారు.
“ముంబై ఇప్పుడు హిందీ చిత్రాలను విస్తృతంగా నిర్మిస్తోంది, మరాఠీ, భోజ్‌పురి, బీహారీ, హర్యానా, గుజరాతీ సినిమాలకు సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదు. చాలా ఉత్తరాది రాష్ట్రాలకు వారి స్వంత చలనచిత్ర పరిశ్రమలు కూడా లేవు" అని ఉదయనిధి శనివారం కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో అన్నారు.
1950లను ప్రతిబింబిస్తూ, తమిళ సినిమా 'భారీగా సంస్కృతీకరించబడింది'.'ఉన్నత కులాలు, సంపన్న ప్రేక్షకులకు' మాత్రమే అందుబాటులో ఉండేదని ఉదయనిధి వివరించారు. అన్ని నేపథ్యాల ప్రజలు సినిమాలను ఆస్వాదించగలిగేలా సినిమాని మరింత కలుపుకొని పోయేలా చేయడంలో ద్రావిడ ఉద్యమం విజయం సాధించిందని అన్నారు.
ద్రావిడ ఉద్యమం మూలం భాషా, సాంస్కృతిక గుర్తింపు కోసం జరిగిన పోరాటాల గురించి వివరిస్తూ, ఉదయనిధి ద్రావిడ ఉద్యమం హిందీ ఆధిపత్యాన్ని ఎలా ప్రతిఘటించిందో తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో స్థానిక భాషలను హిందీ లొంగదీసుకుందని చెప్పారు.
“మన భాషను కాపాడుకోవడంలో మనం విఫలమైతే, హిందీ మన సంస్కృతిని స్వాధీనం చేసుకుంటుంది. మన గుర్తింపులను నాశనం చేస్తుంది. అందుకే మేము హిందీ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాము, మాకు హిందీ భాష పట్ల ద్వేషం ఉన్నందున కాదు, ” అని డిఎంకె నాయకుడు అన్నారు.
మండిపడిన బీజేపీ..
మరోవైపు డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. తమిళనాడు బిజెపి ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి ఉదయనిధిని 'విఫలమైన నటుడు', 'విఫలమైన సినీ వ్యక్తిత్వం' అని పేర్కొన్నారు. "అతని అపరిపక్వత, జ్ఞానం లేకపోవడం వల్ల అతను అలా మాట్లాడతాడు ... వారు దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆయన సొంత నిర్మాణ సంస్థ తమిళ చిత్రాల హిందీ వెర్షన్లను తీసుకుని భారీగా వసూళ్లు చేస్తోంది. డబ్బు సంపాదించడానికి, వారికి హిందీ కావాలి. అధికారంలో ఉండటానికి, ప్రజలు హిందీ నేర్చుకోవాలని వారు కోరుకోరు, ”అని తిరుపతి అన్నారు.


Tags:    

Similar News