మోదీ కూడా నొక్కాడు బటన్.. డబ్బులు పడ్డాయో లేదో చూస్కోండి!

తమిళనాడుపర్యటనలో ఉన్న ప్రధాని మోదీ- డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.

Update: 2025-11-19 13:53 GMT
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు ఇచ్చే రూ.2 వేల సాయాన్ని విడుదల చేశారు. డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ అయ్యేలా ఆయన బటన్ నొక్కి ప్రారంభించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా విడుదల చేయడం ఇది 21వ సారి.
తమిళనాడు కోయంబత్తూరు పర్యటనలో ఉన్న ప్రధాని.. డీబీటీ పద్ధతిలో లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఇప్పటి వరకు 20 విడతలుగా పీఎం కిసాన్ డబ్బులు వేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు 21 విడత నిధులను రైతుల ఖతాల్లోకి బదిలీ చేసింది.
దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లకు పైగా నిధులు జమ చేశారు. వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించాలని రైతులకు ఆయన ఈ సందర్భంగా సూచించారు.

పంట పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 2019లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ. 6 వేలు మూడు విడతల్లో రూ. 2 వేలు చొప్పున విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు 20 విడతల్లో రూ. 3.70 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్ర ప్రభుత్వం.
కాగా, చంద్రబాబు కూడా అన్నదాతా సుఖీభవ పథకం కింద 5 వేల రూపాయలను ఇవాళ విడుదల చేశారు.
Tags:    

Similar News