‘పవనశక్తి‘ పై ప్రభుత్వ కొత్త లక్ష్యాలు.. సాధ్యమయ్యేనా?

రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను తట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి పెడుతోంది. అందులో భాగంగా పవనశక్తిని..

By :  177
Update: 2024-08-25 08:27 GMT

ఇంధన శక్తి వనరుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కొత్త విధాన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న విండ్ పవర్ ఉత్పత్తిని పెంచాలని, అందుకోసం పాత వాటికి మరమ్మతులు చేయాలని సంకల్పించింది. ప్రధాన ప్రైవేట్ సంస్థలు కూడా రాష్ట్రంలో విండ్ పవర్ లో పెట్టుబడులు పెడుతున్నాయి. పునరుత్పత్తి చేయగల ఇంధన వనరులను పెంచాలనే లక్ష్యంతో పాత వాటికి మరమ్మతులు చేయాలని ప్రభుత్వ లక్ష్యం. అందుకే వాటికి సమర్థవంతమైన విడి భాగాతో రిపేర్ చేయించాలని నిర్ణయం తీసుకుంది.



 


కొత్త ప్రైవేట్ ప్రాజెక్ట్ లతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పవన ఇంధన ఉత్పత్తి అదనంగా 25 శాతం పెంచుతాయని అంచనాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ అంచనాలు అందుకోవడం సాధ్యం కాదని ప్రైవేట్ కంపెనీలు అంటున్నాయి.
విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్‌
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం, దక్షిణాది రాష్ట్రాలలో తమిళనాడులో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంది. రాష్ట్రం తన ఉత్పాదక రంగాన్ని విస్తరించడం, వృద్ధి.. ఉపాధి కోసం కొత్త పరిశ్రమలను ఆకర్షించడానికి ఒప్పందాలు జరుగుతున్నాయి. అందువల్ల రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్లు విపరీతంగా పెరుగుతున్నాయి.
తమ విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి మధ్య తరహ పారిశ్రామిక సంస్థలు ఒకటి లేదా రెండు విండ్ మిల్లులను కొనుగోలు చేసేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీటితో పాటు కొత్త సబ్ స్టేషన్లు, మరికొన్ని ప్రైవేట్ విండ్ మిల్స్ వస్తాయని అనుకుంటున్నారు.
పునరుత్పాదక ప్రాజెక్టులతో కలిపి రాష్ట్రంలో2030 నాటికి విద్యుత్ రంగంలో 500 మెగావాట్లను కేవలం విండ్ పవర్ నుంచి సాధించాలని, దాన్ని సాధించడానికి ఈ చర్య దోహాదపడుతుందని అంచనాలు ఉన్నాయి. తమిళనాడు సంప్రదాయ విద్యుత్ సామర్థ్యం 15,839.56 మెగావాట్లుగా ఉంది. అయితే పునరుత్పాదక శక్తి మొత్తం స్థాపిత సామర్థ్యం 36.563 మెగావాట్లుగా ఉంది. పునరుత్పాదక ఇంధన రంగానికి పవన శక్తి ప్రధాన కారకంగా ఉంది. 10,591.68 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో, రాష్ట్రం ఏటా 13,000 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.
గాలిమరల ఖర్చు ఎంతంటే..
ఒక మెగావాట్ల విండ్‌మిల్‌ను ఏర్పాటు చేయడానికి డెవలపర్‌లకు దాదాపు రూ.7 కోట్లు ఖర్చవుతుంది. ఈ పెట్టుబడి MSMEలకు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు) అందుబాటులో లేదని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది.


 


అయితే, పెద్ద ప్రైవేట్ సంస్థలు గాలిమరల పెట్టుబడి, సంస్థాపన, నిర్వహణను నిర్వహిస్తే, MSMEలు విండ్‌మిల్‌లను కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల చిన్న సంస్థలు ప్రయోజనం పొందుతాయి.
JSW, Everrenew, Green Infra, వెలియనై, Amplus Iru వంటి కంపెనీలు ప్రస్తుతం పవన క్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నాయని తమిళనాడు ఇంధన శాఖ అధికారులు ఫెడరల్‌కు తెలిపారు.
ప్రైవేట్ సంస్థలు
ఈ డెవలపర్‌లు తమ కంపెనీలలో MSMEలకు తలుపులు తెరవాలని వారి కార్యకలాపాలలో వాటిని ఏకీకృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ''ఉదాహరణకు, సేలం స్టీల్ ప్లాంట్‌కు 38 మెగావాట్లను సరఫరా చేయాలని JSW ప్రతిపాదించింది. ఇతర ప్రైవేట్ సంస్థలు కూడా త్వరలో తమ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంతలో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ విండ్ ఫామ్‌లకు అనువైన కొత్త గాలులతో కూడిన ప్రదేశాలను అన్వేషిస్తోంది” అని ఒక అధికారి తెలిపారు.
ప్రస్తుతం, గాలి ఉత్పత్తి కన్యాకుమారిలోని ముప్పందల్, కోయంబత్తూర్ సమీపంలోని పాల్ఘాట్ పాస్, తెన్కాసి సమీపంలోని సెంగోట్టై పాస్లో ఉంది. ఈ మూడు ప్రధాన పాస్‌లు సెకనుకు 8-12 మీటర్ల వేగంతో బలమైన గాలులను వీస్తాయి. "కొత్త సైట్‌లను గుర్తించడం వల్ల రాష్ట్రానికి మరింత మంది డెవలపర్‌లను ఆకర్షించవచ్చు" అని అధికారి తెలిపారు.
టెస్టింగ్ గ్రౌండ్
పవన ఇంధన రంగంలో అగ్రగామిగా ఉన్న తమిళనాడు, కొత్త పద్ధతుల ప్రయోగాలకు టెస్టింగ్ గ్రౌండ్ గా మారింది. ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ ఇచ్చిన విద్యుత్ సంస్కరణల నివేదికతో తమిళనాడులో ఈ తరహ ప్రయోగాలు మొదలయ్యాయి. ఆయన నేతృత్వంలోని కమిటీ పాత విండ్ మిల్స్ పునరుద్దరణ, జీవితకాలం పొడిగింపు సహ పలు కీలక సిఫార్సులు, కొత్త విధానాలు సూచించింది.


 


తమిళనాడులోని దాదాపు 76 శాతం గాలిమరలు క్యాప్టివ్ వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. (స్పిన్నింగ్ మిల్లులు, ఫౌండ్రీల వంటి వారి పరిశ్రమలలోని జనరేటర్ల ద్వారా విద్యుత్తు ఉపయోగించబడుతుంది). ఇతర ప్రైవేట్ విండ్ ఫామ్ ప్రాజెక్ట్‌లు పవర్-ఇంటెన్సివ్ పరిశ్రమలు, మధ్యస్థ సంస్థలను ఆకర్షించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు.
కొత్త ప్రైవేట్ విండ్ ఫామ్ ప్రాజెక్ట్ లను ఏర్పాటు చేయడంలో అనేక సాంకేతిక సవాళ్లు ఎదురువుతున్నాయని తమిళనాడు స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ (టాస్మా) ముఖ్య సలహాదారు కె వేంకటాచలంతో ఫెడరల్ కు వివరించాడు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు - ప్రత్యేక వడ్డీ రుణాలు, ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు - విండ్‌మిల్ యజమానులు రీ పవర్ ప్రాజెక్ట్‌లు చేపట్టడానికి అవసరమని ఆయన అన్నారు.
అసోసియేషన్ ఆందోళనలు
“ప్రభుత్వం గాలి ఉత్పత్తిని 25 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అయితే, పాత గాలిమరల పునరుద్ధరణ, జీవితకాలం పొడిగింపు మాత్రమే ఉత్పత్తిని గణనీయంగా పెంచకపోవచ్చు, ” అని వేంకటాచలం చెప్పారు.
“పవన లభ్యత, యంత్రాలు, గ్రిడ్ కనెక్టివిటీ ప్రధాన సవాళ్లు. మేము విండ్-సోలార్ హైబ్రిడ్ సెటప్‌ను పాక్షిక పరిష్కారంగా సూచించాము. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితిని బట్టి, ఆర్థిక సవాళ్లు, కొత్త పెట్టుబడులకు అనువైన వాతావరణం కారణంగా ప్రోత్సాహకాలు లేకుండా పెట్టుబడి పెట్టడానికి చాలా మంది వెనుకాడుతున్నారు, ”అన్నారాయన. రెండేళ్ల క్రితం పవన విద్యుదుత్పత్తిలో తమిళనాడును అధిగమించిన గుజరాత్, తక్కువ ఓపెన్ యాక్సెస్ ఛార్జీలతో పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని కూడా ఆయన వివరించారు.
గ్రిడ్ సౌకర్యాలు
ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ అజయ్ దేవరాజ్ మాట్లాడుతూ.. "చాలా పాత గాలిమరలు కొత్త విడిభాగాలను అందుకోలేకపోవచ్చు, ఎందుకంటే వాటి తయారీదారులు మార్కెట్లో లేరు. విండ్‌మిల్ యజమానులు ఆర్డర్లు ఇచ్చినప్పటికీ, కొత్త భాగాలను రూపొందించడానికి, ఉత్పత్తి చేయడానికి తయారీదారులకు కనీసం రెండు సంవత్సరాలు పట్టవచ్చు” అని అతను చెప్పాడు.


 


"తత్ఫలితంగా, మేము రీపవర్డ్ విండ్‌మిల్స్‌లో 5 నుంచి 8 శాతం పెరుగుదలను మాత్రమే చూడవచ్చు, ఇది 25 శాతం లక్ష్యాన్ని సాధించడం ఒక సవాలు " అని దేవరాజ్ చెప్పారు.
ఫెడరల్ వివిధ సంస్థలు లెవనెత్తిన అంశాలను అధికారులు ముందు పెట్టినప్పుడు వారు కొన్ని వివరాలు అందించారు. అన్ని సమస్యలు కూలకషంగా తెలుసుకుని పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. పాతవాటినిక మరమ్మతులు పై విషయంలో కూడా తగిన విధంగా నిబంధనలు సడలిస్తామని చెప్పారు.


Tags:    

Similar News