గవర్నర్ , డీఎంకేలకు మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు
విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియమాకాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచన;
By : Praveen Chepyala
Update: 2025-01-17 10:43 GMT
కొన్నాళ్లుగా అధికారంలో ఉన్న డీఎంకే సర్కార్ కు, తమిళనాడు గవర్నర్ కు మధ్య జరుగుతున్న విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకం వివాదం పై ఇరువురికి సర్వోన్నత న్యాయ స్థానం శుక్రవారం మొట్టికాయలు వేసింది. ఇరుపక్షాలు సామరస్యంగా మాట్లాడుకుని వివాదాన్ని పరిష్కరించాలన సూచించించింది. వచ్చే వాయిదా నాటికి సమస్య పరిష్కారం కాకపోతే కోర్టే స్వయంగా జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరిస్తుందని కేసు విచారించిన జస్టిస్ ఎస్ బీ పార్డీవాలా చెప్పారు.
రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఎక్స్ అఫిషియో ఛాన్సలర్ స్వతంత్ర్యంగా వైస్ ఛాన్స్ లర్ లను నియమించే అధికారం తనకు ఉందని గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రకటించడం వివాదం తలెత్తుతోంది.
అయితే ఈ విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వానికే అధికారం ఉందని, ప్రభుత్వ నిర్ణయాలకే అనుగుణంగా గవర్నర్ నిర్ణయాలు తీసుకోవాలని వాదిస్తోంది. దీనివల్ల మద్రాస్ విశ్వవిద్యాలయం, భారతీయార్ విశ్వ విద్యాలయం, తమిళనాడు టీచర్స్ ఎడ్యూకేషన్ యూనివర్శిటీ వంటి సంస్థలలో తీవ్రమైన ప్రభావం చూపుతోంది.
ఇక్కడ పరిపాలన కుంటుపడటంతో వివాదం ముదిరిపాకాన పడింది. వైస్ ఛాన్సలర్ల నియమకాల కోసం గవర్నర్ ఏకపక్షంగా సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ డీఎంకే సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇది రాజ్యాంగ విరుద్దమని, ఇందులో నామినిలుగా యూజీసీని కూడా చేర్చింది. తరువాత ఆర్ఎన్ రవి సెర్చ్ కమిటీలను ఆయన ఉపసంహరించుకున్నారు. తమిళనాడు తరహలోనే పశ్చిమ బెంగాల్ లోనూ ఇలాగే ఆనంద బోస్ కు అదనపు సమయాన్ని సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఇంతకుముందు కేరళ ఇదే తరహ వివాదం తలెత్తినప్పుడు గవర్నర్ కు వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం ఉందని తీర్పు చెప్పింది.
సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోండి
అడ్మినిస్ట్రేటివ్ స్టాండ్ ఆఫ్ లను నివారించడానికి గవర్నర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సహకారం ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది. ఇద్దరు తమ వివాదాలను పక్కన పెట్టి విద్యార్థులకు విద్యాపరమైన వృత్తిపరమైన అభివృద్ధికి, ఉన్నత విద్యాసంస్థల సజావుగా సాగేలా చూడాలని కోర్టు సూచించింది.