సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఏమైందీ? మళ్లీ ఆస్పత్రిలో ఎందుకు చేరారు?
73 ఏళ్ల సూపర్ స్టార్ రజనీకాంత్ ఆకస్మికంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఎందుకు చేరారు, సమస్య ఏమిటనేది ఇంకా తెలియలేదు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు
సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఏమైందీ? ఆయనెందుకు ఆస్పత్రిలో చేరారు? గత 24 గంటలుగా చెన్నైలోని రజనీకాంత్ ఇంటి ముందు ఆయన అభిమానులు పడుతున్న ఆందోళన ఇది. అధికారికంగా ఎవ్వరూ చెప్పక పోయినా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యుల కథనం. ఓ అంతర్జాతీయ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో రజినీకాంత్ కి చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా రజనీకాంత్ కి ఆ డాక్టర్ ఆధ్వర్యంలోనే ముందస్తు చికిత్స అందుతోంది. ఆయన సలహా మేరకే ఇప్పుడు కూడా ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. రజనీ కాంత్ గుండె పనితీరును మదింపు చేస్తున్నారు. వైద్యులు గుండెకు సంబంధించిన టెస్టులు, చికిత్స చేస్తున్నారు.
రజనీకాంత్ సూచన మేరకే ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. గతంలో రజనీకాంత్ మెదడు రక్తనాళంలో అడ్డంకులు (బ్లాక్స్) ఏర్పడటంతో కావేరీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు చికిత్స చేసి వాటిని తొలగించారు. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే ఓ రక్తనాళంలో అడ్డంకులు ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. వాటిని తొలగించి మెదడుకు సరిగా రక్త ప్రసరణ జరిగేలా చూడాలని సూచించారు.