కొన్ని వర్గాలనే దేశభక్తులుగా చెబుతున్నారు: ఫ్రొపెసర్ అపూర్వానంద్

ది ఫెడరల్ చర్చా కార్యక్రమం ‘క్యాపిటల్ బీట్’ లో అభిప్రాయాలు వెల్లడించిన ఢిల్లీ ఫ్రొపెసర్;

Translated by :  Praveen Chepyala
Update: 2025-04-16 05:24 GMT

(మూలం.. నీలు వ్యాస్)

దేశంలో విద్య క్రమంగా కాషాయీకరణ అవుతుందని ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ అన్నారు. ‘ది ఫెడరల్’ లో నిర్వహిస్తున్న ‘క్యాపిటల్ బీట్’ తాజా ఎపిసోడ్ లో ఆయన పాల్గొన్నారు.

ఏడో తరగతి పాఠ్య పుస్తకాల్లో డిజిటల్ ఇండియా, బేటీ బచావో, బేటీ పడావో వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను చేర్చారన్నారు. అధికార పార్టీ కథనాలకు మౌత్ పీస్ లుగా మార్చే కథనాలు పాఠ్యపుస్తకాల్లో చేర్చే అనేక అంశాలు అన్ని స్థాయిల విద్యల్లో ఉన్నాయన్నారు.

గోశాలల గురించి తెలుసుకోవడం, విద్యార్థులకు పాఠశాల సౌకర్యాలను డిజిటల్ ఇండియాకు ఆపాదించడం వంటి అంశాలపై విమర్శలు గుప్పించారు. విద్యార్థులను కేంద్ర ప్రభుత్వ కథనాలకు మౌత్ పీస్ గా మార్చే విధంగా పాఠాలు ఉన్నాయన్నారు.

ఏకైక మూలం..
దేశంలో చదువుకుంటున్న లక్షలాది మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలే ఏకైక మూలం. దాని పర్యవసానాలు చాలా విస్తృతమైనవని అభిప్రాయపడ్డారు. ‘‘ ఉపాధ్యాయులు పుస్తకాల్లో ఉన్న వాటిని సత్యంగా భావిస్తారు’’ అని అపూర్వానంద్ అన్నారు. గోశాలలను సందర్శించడం వంటివి ఎలాంటి సూచన ప్రశ్నలు లేకుండా అమలు చేస్తున్నారన్నారు.
Full View

ప్రత్యామ్నాయ దృక్కోణాలకు లేదా విమర్శనాత్మక ఆలోచనలకు చోటు ఉండట్లేదన్నారు. 2005 తరువాత జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం కింద విద్యా సంస్కరణలు పిల్లలను విభిన్న దృక్కోణాల నుంచి విశ్లేషించడానికి, విమర్శించడానికి, నేర్చుకోవడానికి సాధనాలతో సన్నద్దం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన వివరించారు.
దేశభక్తి అనే ఆలోచన ఎక్కడిది..
అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి దేశభక్తి. అయితే పాఠ్య పుస్తకాలలో దీనికి విభిన్న అర్థం వచ్చే వాటిని తీసుకొచ్చారు. జాతీయ యుద్ద స్మారక చిహ్నం, వందే భారత్ రైలు వంటివి చూపించారు. ‘‘యుద్ద స్మారక చిహ్నాలు మాత్రమే ఎందుకు? రైతు లేదా కార్మికుడు కూడా అంతే దేశభక్తులు’’ అని అపూర్వానంద్ అన్నారు.
అడవులు, నదులు కాపాడటం కోసం చేసే పోరాటాలు కూడా దేశం పట్ల ప్రేమను ప్రదర్శిస్తాయని అన్నారు. ఇలాంటి ఉదాహారణలు ఎందుకు మినహాయించారని ఆయన ప్రశ్నించారు. ఒక నిర్ధిష్ట రాజకీయ భావజాలంతో అనుసంధానించబడిన జాతీయవాద కథనాలను ఉద్దేశపూర్వకంగా రూపొందించారని విమర్శించారు.
ఈ మార్పులు బోధనాశాస్త్రంపై లోతైన ప్రభావాలను చూపుతుందని చెప్పారు. విద్య అనేది ఊహ, సృజనాత్మకత, స్వతంత్ర ఆలోచనను పెంపొందించడానికి ఉద్దేశించబడిందని అపూర్వానంద్ అన్నారు. పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ పథకాలు చేర్చడం ద్వారా విద్యా లక్ష్యాలు దెబ్బతింటాయని చెప్పారు.
సమాఖ్య సమస్య..
ఎన్సీఆర్టీ, సీబీఎస్ఈ పాఠ్య పుస్తకాల ద్వారా పాఠ్యాంశాలను కేంద్రీకరించడం వల్ల సమాఖ్య స్వయంప్రతిపత్తి కూడా బలహీనపడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘‘తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తమ సొంత పాఠ్య పుస్తకాలను అభివృద్ది చేసుకోవడంలో ముందడుగు వేయాలి’’ అని అపూర్వానంద్ అభిప్రాయపడ్డారు.
ఎన్సీఈఆర్టీ పుస్తకాలను స్వీకరించడం తప్పనిసరి కాదని ఆయన ఎత్తి చూపారు. అయితే నీట్, సీయూఈటీ వంటి ప్రవేశ పరీక్షలు, సీబీఎస్సీ పాఠ్యాంశాలను అనుసరిస్తాయి. పరోక్షంగా రాష్ట్రాలు, పాఠశాలలను మమ్మల్ని అనుసరించమని బలవంతం చేస్తాయన్నారు.
మార్పు అనేది ప్రస్తుత పాలనలో అసంభవం అని అపూర్వానంద్ చెప్పారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు తమ హక్కులను వినియోగించవచ్చు. రాజకీయ బ్రాండింగ్ కంటే ప్రజాస్వామ్య బోధనలో పాతుకుపోయిన మెరుగైన పాఠ్య పుస్తకాలను రూపొందించాలని ఆయన వారిని కోరారు. తల్లిదండ్రులు, మీడియా అవగాహాన పెంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘మీ పిల్లలకు చెప్పండి. వారిని ప్రభుత్వ ప్రచార వాహాకాలుగా మారనివ్వకండి’’ అని ముగించారు.


Tags:    

Similar News