తమిళనాట షా గెలుపు ధీమా..
సమావేశంలో AIADMK నేత ఫళని స్వామిని ఎక్కడా ప్రస్తావించని కేంద్ర హో మంత్రి..;
2026 జరిగే తమిళనాడు(Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)లో గెలుస్తామని కేంద్రం హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఆశాభావం వ్యక్తం చేశారు. AIADMK కలిసి రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా నిన్న తమిళనాడు రాష్ట్రంలో పర్యటించారు. తిరునెల్వేలిలో మూడు గంటల పాటు జరిగిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఐదు దక్షిణ నియోజకవర్గాలు - కన్యాకుమారి, తెన్కాసి, టుటికోరిన్, విరుదునగర్, తిరునెల్వేలి నుంచి వచ్చిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ స్వాగతం పలికారు.
‘2026కు మరింత పెరగాలి’
“2024 లోక్‌సభ ఎన్నికల్లో NDA 18 శాతం ఓట్లను సాధించగా, AIADMK 21 శాతం ఓట్లను సాధించింది. మన దగ్గర దాదాపు 39 శాతం ఉంది. ఇది 2026 నాటికి మరింత పెరగాలి’’ అని అన్నారు.
AIADMK కార్యకర్తలో అసంతృప్తి..
అన్నాడీఎంకే చీఫ్ ఇడప్పాడి కే ఫళని స్వామి (EPS) పేరును సమావేశంలో షా ఎక్కడా ప్రస్తావించపోవడంపై AIADMK కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి వైగై చెల్వన్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ..“ప్రతి సమావేశంలోనూ అమిత్ షా కూటమి బలం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. తమిళనాడులో అన్నాడీఎంకే ఎన్డీఏకు నాయకత్వం వహిస్తుందని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయన తన కార్యకర్తలను ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నారు, అందుకే ఆయన బీజేపీపై దృష్టి సారించారు,” అని చెప్పారు.
‘అందులో అనుమానం లేదు’
అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్. సెమ్మలై కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “షా తన బూత్ కార్యకర్తలతో మాట్లాడారు. మా నాయకుడు ఈపీఎస్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రతిచోటా ఆయన భారీ ఆదరణ వస్తుంది. మేము ఐక్యంగా ఉన్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. 2026లో మేమే గెలుస్తా్ం, ”అని అన్నారు.
రచయిత, రాజకీయ వ్యాఖ్యాత ఎ జీవకుమార్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు ఈపీఎస్‌కు క్రెడిట్ ఇవ్వడం లేదంటే పొత్తు ఎన్నికల కోసం మాత్రమే అనే అర్థం చేసుకోవాలి " అని పేర్కొన్నారు.
డీఎంకే యువజన విభాగం నాయకుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకుని షా మాట్లాడారు. “ఒక్కరోజు కూడా ఉదయనిధి ముఖ్యమంత్రి కాలేడు” అని అన్నారు. అలాగే “రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరు.” అని పేర్కొన్నారు.