‘ఎంపురాన్’ సినిమాను బ్యాన్ చేయాలని తమిళనాడులో ఆందోళన
ముల్ల పెరియార్ డ్యామ్ ను కేరళకు అనుకూలంగా చిత్రీకరించాలని తమిళుల నిరసన;
By : Praveen Chepyala
Update: 2025-04-01 10:51 GMT
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో, మోహన్ లాల్ నటించిన ‘ఎంపురాన్’ సినిమా మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఈ సినిమా హిందూత్వాన్ని కించపరిచే విధంగా ఉందని రైట్ వింగ్ సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
ఈసారి కొత్త వివాదం తమిళనాడులో చోటుచేసుకుంది. కేరళ- తమిళనాడు లో చాలాకాలంగా వివాదంగా ఉన్న ముల్ల పెరియార్ డ్యామ్ గురించి ఇందులో కేరళకు అనుగుణంగా సన్నివేశాలు ఉన్నాయని తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
తమిళగ వజ్వురిమై కట్చి(టీవీకే), పెరియార్ వైగై ఇరిగేషన్ రైతుల సంఘం వాస్తవాలను తప్పుగా సూచిస్తున్నాయని, తమిళనాడు ప్రయోజనాలను కించపరిచేలా ఉన్నాయని చెప్పే సన్నివేశాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
అయితే ముల్లపెరియార్ ఆనకట్ట గురించి వాస్తవాలను వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొన్ని సంభాషణలు, సన్నివేశాలు తమిళనాడుకు తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
తప్పుడు సమాచారం..
తమిళనాడు రైతులు కంబంలోని గోకులం గోపాలన్ ఆర్ధిక సంస్థను ముట్టడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సినిమాలోని ముల్ల పెరియార్ డ్యామ్ ను సినిమాలో ‘నేడుంపల్లి ఆనకట్ట’గా చూపించారని, బ్రిటిష్ పాలనలో ఇది ట్రావెన్ కోర్ సంస్థానానికి 999 సంవత్సరాలకు లీజుకు ఇచ్చినట్లు తప్పుడు సమాచారం ప్రసారం చేశారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.
ఈ సినిమాలోని వివాదాస్పద సంభాషణ, ఆనకట్ట రెండు షట్టర్లను తెరవడం వల్ల కేరళలో సామూహిక విధ్వంసం జరగుతుందని తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వాదన అనవసరమైన భయాందోళనలను సృష్టిస్తుందని, ఆనకట్ట భద్రతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్దంగా ఉందని వారు చెబుతున్నారు. తమిళనాడు, కేరళ మధ్య దీర్ఘకాలంగా ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు ఎలాంటి చిత్రణలు ముప్పు కలిగిస్తాయని టీవీకే అధ్యక్షుడు ఎమ్మెల్యే టీ వేలమురుగన్ హెచ్చరించారు.
ఇంతవరకు వ్యతిరేకంగా వచ్చినవి..
తమిళులను ప్రతికూలంగా చిత్రీకరిస్తున్నందుకు మలయాళ చిత్ర నిర్మాతలకు టీవీకే విమర్శించింది. డ్యామ్ 999, మద్రాస్ కేఫ్ వంటి తమిళ చిత్రాలను తమిళ భావాలను దెబ్బతీసేవిగా, తమిళ వ్యతిరేక కథనాలను ప్రొత్సహించేవిగా చూపించాయి. వీటిపై కూడా అప్పట్లో నిరసనలు చెలరేగాయి.
ఎంపురాన్ విషయంలో ఈ చిత్రం న్యాయపరంగా పరిష్కరించబడిన సమస్య గురించి భయాన్ని, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తుందని, ఇది రెండు రాష్ట్రాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీస్తుందని నిరసనకారులు వాదిస్తున్నారు.
సినిమాను బహిష్కరించాలి
వివాదాస్పద సన్నివేశాలను వెంటనే తొలగించాలని టీవీకే డిమాండ్ చేసింది. తమిళనాట దుష్ఫ్రచారం ఆపాలని మలయాళ చిత్ర నిర్మాతలను కోరింది. తమిళనాడులోని ఏ ప్రధాన రాజకీయ పార్టీ అధికారికంగా స్పందించినప్పటికీ, నిరసనలు తీవ్రమయ్యాయి.
ఇప్పటికే సినిమాను బహిష్కరించాలని పెరుగుతున్నాయి. ఈ వివాదాలపై చిత్ర బృందం కూడా స్పందించింది. వివాదాస్పద అంశాలను తొలగించడంతో పాటు మరికొన్ని ప్రణాళికలను మార్చాలని ప్రణాళికలు ప్రకటించారు.