NHRC | పెరిగిపోతున్న గిరిజనుల ఆత్మహత్యలపై కేరళ ప్రభుత్వానికి నోటీసు

"సమాజంలోని బలహీన వర్గానికి చెందిన యువకుల ఆత్మహత్యలు మానవ హక్కుల ఉల్లంఘనే. వీటి నివారణకు ప్రభుత్వ తక్షణ చర్య అవసరం.’’ - NHRC

Update: 2024-12-27 11:36 GMT

తిరువనంతపురం జిల్లా శివార్లలో స్థిరపడిన ఆదివాసీల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని వచ్చిన కథనాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సి (National Human Rights Commission) స్పందించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసు చీఫ్‌కి నోటీసు జారీ చేసింది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 23 మంది బలవన్మరణాలు చేసుకోవడంపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

"2011-2022 మధ్య తిరువనంతపురం జిల్లాలోని పెరింగమ్మల పంచాయతీలో దాదాపు 138 ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు సంవత్సరాల తర్వాత జిల్లాలో గిరిజన ఆవాసాల్లో మళ్లీ బలవన్మరణాలు పెరిగిపోయాయి. విపరీతమైన ఒత్తిడి, కుటుంబసమస్యలు, వేధింపులు, సెక్స్ రాకెట్ ఆత్మహత్యలకు దోహదం చేస్తున్నాయి’’ అని నేషనల్ హ్యూమన్ హక్కుల కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఒక్క 2024లోనే దాదాపు 23 మరణాలు నమోదు కావడం, జీవితాన్ని ముగిస్తున్న వారంతా 20-30 ఏళ్ల మధ్య వయసు వారే ఉండడంతో NHRC ఆందోళన వ్యక్తం చేసింది.

"సమాజంలోని బలహీన వర్గానికి చెందిన యువకుల ఆత్మహత్యలు మానవ హక్కుల ఉల్లంఘనే. వీటి నివారణకు ప్రభుత్వం తక్షణ చర్య అవసరం.’’ అంటూ పెరిగిపోతున్న బలవన్మరణాలపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కేరళ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఆదేశించింది కమిషన్.

Tags:    

Similar News