‘‘సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కువ బలముందో చూద్దామా’’

ఉదయనిధి సవాల్ కు, ప్రతిసవాల్ విసిరిన అన్నామలై;

Update: 2025-02-21 13:58 GMT

వేసవి కాలం రావడానికంటే ముందే తమిళనాడులో రాజకీయంతో వేడి రగులుకుంది. డీఎంకే పార్టీ కి చెందిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన ట్వీట్లు, రీ ట్వీట్లతో ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్దం జరుగుతోంది.

డీఎంకే రాత్రంతా ‘‘గెట్ అవుట్ మోదీ’’ హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేయాలని, తాను మరుసటి రోజు ‘‘గెట్ అవుట్ స్టాలిన్’’ హ్యాష్ ట్యాగ్ ను ప్రారంభిస్తానని, ఎవరూ ఎక్కువ ట్వీట్లు పొందుతారో చూద్దాం అని ఆయన ఎక్స్ లో సవాల్ విసిరారు.
అన్నామలై ఛాలెంజ్
పాలక కుటుంబం చేస్తున్న కుంభకోణాలు, అవినీతి, దుష్పపరిపాలన వలన ప్రజలు ఇబ్బందిపడుతున్నారని, వారిని ప్రజలు త్వరలోనే గద్దె దించుతారని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
‘‘ఒక కుటుంబం అహాంకారపూరిత ప్రవర్తన, కళంకిత మంత్రివర్గం, అవినీతికి, అక్రమాలను పట్టించుకోకపోవడం రాష్ట్రాన్ని మాదకద్రవ్యాలకు, అక్రమ మద్యానికి స్వర్గధామంగా మార్చారు. కులం ఆధారంగా విభజన రాజకీయాలు, పిల్లలు, మహిళలకు భయానక వాతావరణం లోపభూయిష్ట విధానాలు, ఎన్నికల హమీలు నెరవెర్చకపోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు గద్దె దించుతారని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఓ ట్వీట్ లో ఆరోపించారు.
నాకు ఆసక్తి లేదు..
అన్నామలై విసిరిన సవాల్ తరువాత మీడియాతో మాట్లాడిన డిఫ్యూటీ సీఎం.. నాకు అంశం మాట్లాడటం ఇష్టం లేదన్నారు. ‘‘నాకు అతని గురించి మాట్లాడటం ఆసక్తి లేదు’’ అని డిప్యూటీ సీఎం అన్నారు. 

‘‘భాషా హక్కుల గురించి చాలామంది ప్రాణాల అర్పించిన రాష్ట్రం తమిళనాడు. ఎవరు రాజకీయాలు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు’’ అని ఆయన అన్నారు.
ఎన్ఈపీ పై వివాదం..
ఫిబ్రవరి 18న ఉదయనిధి జాతీయ విద్యా విధానం, త్రిభాష విధానానికి వ్యతిరేకంగా ఒక ప్రకటన చేశారు. తమిళనాడులో ‘‘గో బ్యాక్ మోదీ’’ బదులు, ‘‘గెట్ అవుట్ మోదీ’’ నినాదాలు చేయాలని అనడంతో ఈవివాదం ప్రారంభం అయింది.
‘‘గత సారి మీరు తమిళుల హక్కులను లాక్కోవాలని ప్రారంభించినప్పుడూ ప్రజలు గో బ్యాక్ మోదీ అంటూ ప్రచారం చేశారు. మీరు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఈ సారి మిమ్మల్ని వెనక్కి పంపడానికి గెట్ అవుట్ మోదీ అంటూ మరోసారి ఆందోళనలు చేస్తారు’’ అని ఉదయనిధి అన్నారు. అన్నామలైకి ధైర్యం ఉంటే డీఎంకే ప్రధాన కార్యాలయం ఉన్నా ‘అన్నాసలై’ కేంద్రానికి ఒంటరిగా వెళ్తారా అని సవాల్ విసిరారు.
కరూర్ లో జరిగిన ఒక సమావేశంలో ప్రసంగించిన అన్నామలై.. ఉదయనిధిపై విమర్శలు గుప్పించారు. మోదీపై మీరు అన్న నినాదం ఒకసారి ప్రచారంలోకి తీసుకురమ్మని సవాల్ విసిరారు. ఆయన ఇంటికి వెళ్లి ఎగతాళి చేస్తూ పోస్టర్లు అతికిస్తామని అన్నారు. వీలైతే తనను ఆపమని డీఎంకే, పోలీసులకు ఆయన సవాల్ విసిరారు.


Tags:    

Similar News