సినిమా టికెట్ రేట్ల సవరణపై కర్ణాటక హైకోర్టు స్టే

టికెట్ల రేట్లను కేవలం రూ. 200 వరకే పరిమితం చేసిన ప్రభుత్వం

Update: 2025-09-23 14:11 GMT
కర్ణాటక హైకోర్టు

కర్ణాటక ప్రభుత్వం టికెట్ రేట్లపై రూ. 200 వరకూ పరిమితిని విధిస్తూ తీసుకొచ్చిన చట్ట సవరణపై హైకోర్టు స్టే విధించింది. మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇతర సినిమా భాగస్వాములతో కలిసి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ రవి వి హోస్మానీ మంగళవారం మధ్యంతర స్టే విధించారు. కర్ణాటక సినిమాస్(నియంత్రణ, సవరణ) నియమాలు -2025 ను కర్ణాటక ప్రభుత్వం ఈ మధ్య సవరించింది.

పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదీ ముకుల్ రోహత్గీ వాదిస్తూ టికెట్ ధరలను పరిమితం చేయడానికి కర్ణాటక సినిమాస్(నియంత్రణ చట్టం) కింద ప్రభుత్వం ఏకపక్షంగా ఒక నిబంధనను ప్రవేశపెట్టిందని వాదించారు.
‘‘మెరుగైన సౌకర్యాల కోసం కస్టమర్లు ఎక్కువ చెల్లించాలని అనుకుంటే రూ. 200 పరిమితి నిర్ణయించడానికి ఆధారం ఏంటీ? ఏకరీతి పరిమితి విధించడంలో ఎటువంటి హేతబద్దత లేదు’’ అని రోహత్గీ వాదించారు.
2017 లో జారీ చేసిన ఇలాంటి ప్రభుత్వ ఉత్తర్వును హైకోర్టు సస్పెండ్ చేసి ఆ తరువాత రాష్ట్రం ఉపసంహరించుకుందని న్యాయస్థానానికి గుర్తు చేశారు. టికెట్ల రేట్లను నిర్ణయించడానికి చట్టం రాష్ట్రానికి ఎటువంటి అధికారం ఇవ్వదని, అటువంటి పరిమితి సినిమా యజమానులు తమ వ్యాపారాన్ని నిర్వహించే హక్కును నేరుగా ప్రభావితం చేస్తుందని రోహత్గీ అన్నారు.
‘‘ప్రతి టికెట్ ధర రూ. 200 ఉండాలని ఒకే ఆదేశం ఉండకూడదు. అలాగే అన్ని విమానయాన సంస్థలు ఎకానమీ తరగతిలో నడపాలని ఒక ఆదేశం ఉండకూడదు’’ అని ఆయన న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించారు.
సీనియర్ న్యాయవాదులు ఉదయ్ హోల్లా, ధ్యాన్ చిన్నప్ప కూడా టికెట్ ధరలను కాకుండా టికెట్ బూత్ లకు సంబంధించిన నిబంధన 55కి కొత్త అధికరణ తీసుకురావడం ద్వారా సవరణ తీసుకొచ్చారని వివరాలు సమర్పించారు.
ప్రధాన నిబంధన పరిధిని ఒక నిబంధన విస్తరించలేమని చిన్నప్ప గట్టిగా వాదించారు. కేవలం శాసనసభకు మాత్రమే టికెట్ల రేట్లను సవరించే అధికారం ఉందన్నారు.
మరో థియెటర్ తరఫున హజరైన సీనియర్ న్యాయవాదీ డీఆర్ రవిశంకర్ వాదనలు వినిపిస్తూ.. సినిమా టికెట్ రేట్ల ధర అనేది ఎగ్జిబిటర్లు, కస్టమర్ల మధ్య జరిగే ప్రయివేట్ ఒప్పందం అని అన్నారు.
చట్టంలో అటువంటి నియంత్రణ స్పష్టంగా లేకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని ఆయన వాదించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన ఆర్టికల్ 19(1)(జీ) ప్రకారం.. వ్యాపారాన్ని కొనసాగించే హక్కును ఉల్లంఘించడమే అన్నారు.
రాష్ట్ర చర్యను సమర్థిస్తూ అదనపు అడ్వకేట్ జనరల్ ఇస్మాయిల్ జబివుల్లా వాదనలు వినిపించారు. కేవలం ప్రజాప్రయోజనాల కోసమే ఈ సవరణ తీసుకొచ్చినట్లు చెప్పారు.
మార్చి 7న బడ్జెట్ ప్రసంగం, తరువాత వచ్చిన ముసాయిదా నోటిఫికేషన్ ను ఆయన ప్రస్తావించారు. దీనిపై కొంతమంది వాటాదారుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. సినిమా హాళ్లను నియంత్రించే ప్రభుత్వ అధికారం రాజ్యాంగం నుంచి సంక్రమించిందని జాబితా రెండు లోని ఎంట్రీని 33ని ఆయన తన వాదనల్లో ఉటంకించారు. ఇది రాష్ట్రాలకు థియోటర్లు, వినోదాన్ని నియంత్రించడానికి అధికారం ఇస్తుంది.
కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా జోక్యం చేసుకోవాలని కోరింది. కానీ ఈ విషయం ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని సంస్థ తన స్థానాన్ని సమర్థించుకోవాలని కోర్టు పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ హైకోర్టు మధ్యంతర స్టే అమలులో ఉంటుంది.



Tags:    

Similar News