రెండు రోజుల క్రితం భారత ప్రధాని రాజస్థాన్ లోని బీకానేర్ లో మాట్లాడుతూ.. పాకిస్తాన్ ను కేవలం మూడు రోజుల్లోనే మోకాళ్ల మీద కూర్చోబెట్టామని అన్నారు. తన శరీరంలో వేడి సిందూరం ప్రవహిస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా సైన్యాన్ని ఆయన ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ వ్యాఖ్యలపై ఫెడరల్ నిర్వహించే ‘కాపిటల్ బీట్’ తాజా ఎపిసోడ్ లో యాంకర్ నీలు వ్యాస్.. పలువురు నిపుణులతో కూడిన ప్యానెల్ లో చర్చలు నిర్వహించారు.
ఇందులో సుభాషిణి అలీ, టీకే రాజ్యలక్ష్మి, వింగ్ కమాండర్ అనుమా ఆచార్య(రిటైర్డ్) పాల్గొన్నారు. వీరు ప్రధాని చేసిన వ్యాఖ్యల రాజకీయ, సామాజిక పరిణామాలను విశ్లేషించే ప్రయత్నం చేశారు. Full View
బీజేపీ దాని భాగస్వామ్య పక్షాలు సైనిక చర్యను దేశభక్తి ప్రకటనగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ప్రతిపక్షాలు, విమర్శకులు మాత్రం సైనిక చర్యను రాజకీయం చేయడానికి వాడుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలకు ముందు ఓటర్లను భావోద్వేగపరంగా మభ్యపెట్టడానికి మరొక ప్రయత్నం చేస్తోందని అంటున్నాయి.
మహిళలలను ముందుపెట్టి భావోద్వేగం..
మోదీ ప్రస్తావించిన ఆపరేషన్ సిందూర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని సుభాషిణి అలీ అన్నారు. ‘‘ఇది మహిళలను కించపరిచేలా ఉంది. వారి దు:ఖాన్ని ఉపయోగించుకుని, వారి గాయాలను రాజకీయ మార్కెటింగ్ లా ఉపయోగించుకుంటున్నారు. ’’ అలీ చెప్పారు.
మనుస్మృతితో బీజేపీ చారిత్రక సమన్వయాన్ని ఆమె తప్పు పట్టారు. ఆ పార్టీ సానుభూతిని పొందడానికి, భావోద్వేగాన్ని రేకెత్తించడానికి మహిళలను మతపరమైన ప్రతీకలుగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. పుల్వామా బాధితుల విధవరాళ్లు, సైనిక ప్రతినిధులు ఇచ్చిన శాంతి సందేశాలను మోదీ మద్దతుదారులు తీవ్రంగా ట్రోల్ చేశారని సుభాషిణీ అలీ ఎత్తి చూపారు.
హిమాన్షీ నర్వాల్, ఆర్తి మీనన్ వంటి ట్రోల్ చేయబడిన మహిళలకు బీజేపీ ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదని అన్నారు. ‘‘అవసరమైన సమయంలో మహిళలను తోడేళ్లకు విసిరివేస్తారు’’ అన్నారు.
ఆగ్రహం కూడా..
రాజ్యలక్ష్మి ఈ ఆందోళనలను హిందూ మహిళలను ఆకర్షించడానికి, సిందూరం అనే సెంటిమెంట్ ను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఇలాంటివి కేవలం ఎన్నికల లక్ష్యాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని ఇది మతపరమైన భావోద్వేగపు రాజకీయం అన్నారు.
మైనారిటీ వర్గాల మహిళలు, భిన్నాభిప్రాయాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడూ ప్రభుత్వం ఎందుకు నిష్క్రియంగా ఉంటుందని ప్రశ్నించారు. ‘‘బిల్కిస్ భానో, వరకట్న మరణాలను ఎదుర్కొంటున్న మహిళలపై ఆకృత్యాలు జరిగినప్పుడూ ప్రభుత్వానికి ఎందుకు ఆగ్రహం రాలేదు’’ ? అని ప్రశ్నించారు. ప్రారంభంలో ఇది బాగాపనిచేసిన ఆర్టికల్ 370, అయోధ్య రామాలయం వంటి వాటిలాగే ఆపరేషన్ సిందూర్ ప్రతిష్ట రాజకీయం మసకబారుతుందని రాజ్యలక్ష్మి హెచ్చరించారు.
వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..
కాంగ్రెస్ ప్రతినిధి, రిటైర్డ్ వింగ్ కమాండర్ ఆచార్య మాట్లాడుతూ.. ఈసారి బీజేపీ భావోద్వేగ కథనాలు విఫలమయ్యే అవకాశం ఉందని అన్నారు. చిన్న చిన్న వ్యక్తులు సైతం ప్రధాని కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారని ప్రశ్నిస్తున్నారని అన్నారు.
సిందూర్ కథనాన్ని చౌక భావోద్వేగ దోపిడిగా అభివర్ణించారు. ప్రధానమంత్రి మోదీ మహిళలపై చేస్తున్న ప్రసంగాలు, పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి విషయాలు క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు వాస్తవ విరుద్దంగా ఉన్నాయని చెప్పారు.
‘‘మహిళలపై నేరాలు సాధారణీకరించబడ్డాయి. నిజమైన న్యాయం ఎక్కడా లేదు’’ అని ఆమె అన్నారు. కానీ ప్రజలు ఈ నాటకాన్ని గమనిస్తున్నారని చెప్పారు.
వ్యతిరేక స్పందన..
బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే వరకూ ఆపరేషన్ సిందూర్ ను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్యానెల్ అభిప్రాయపడింది. మోదీ అనుకూల మీడియా అతని ఇమేజ్ భాషను కీర్తిస్తున్నాయని, ప్రతిపక్షాలు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.
‘‘ప్రతిపక్షాలు కాల్పుల విరమణ పై ప్రశ్నలు సంధించిన ప్రతిసారీ వారు పాకిస్తాన్ అనుకూలురని ముద్రవేస్తున్నారని ’’ వారు పేర్కొన్నారు. మాజీ సైనికులు , ఓటర్లను నేరుగా పాల్గొనేలా జై హింద్ సభ వంటి ప్రచారాలతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందని ఆచార్య చెప్పారు. మేము ఈ ప్రశ్నలను ఢిల్లీలోనే ఉండి ప్రశ్నించకుండా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామని ఆమె అన్నారు.
లౌకికవాదం.. వైరుధ్యాలు..
ప్రస్తుతం బీజేపీ దేశంలో లౌకికవాద వాతావరణం పాడుచేస్తోందని సుభాషిణి అలీ అన్నారు. విశ్వసనీయత ఉందని నిరూపించుకోవడానికి విదేశాలలో జమ్మూకాశ్మీర్ పౌరులు, ముస్లిం మహిళల వంటి లౌకిక చిహ్నాలను ఉపయోగించుకుంటారని, కానీ స్వదేశంలో మాత్రం వేరే ఆచరిస్తారని చెప్పారు.
భారతదేశం బలం దాని నిజమైన లౌకికవాదం, వైవిధ్యంలో ఉందని, మతపరమైన లింగపరమైన భేదాలలో లేదని అలీ అన్నారు. భారత్ ను ఐక్యం చేసేది లౌకికవాదం మాత్రమే.
కానీ బీజేపీ మాత్రం దాని పునాదిని బలహీనపరుస్తుందని హెచ్చరించారు. 2019- 2024 లో బీజేపీ భావోద్వేగాలను ప్రేరేపించడానికి ప్రయత్నించింది. రామమందిరం దీనిని పెద్దగా కదిలించలేదు. సిందూర్ బాగా పనిచేస్తుందా? అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
మోడీ ప్రసంగం స్వల్పకాలికంగా ప్రాధాన్య అంశంగా ఉపయోగపడవచ్చు. కానీ ప్రజల దృష్టి ఉద్యోగాలు, ద్రవ్యోల్భణం, విద్య, పాలన వంటి వాస్తవ సమస్యలపై మళ్లుతోందని ఆమె చెప్పారు. ప్రతిదానికి తుది స్థానం ఉంటుందని, ప్రజలు దీని గురించి ఆలోచిస్తున్నారని వారు ముగించారు.