అన్నాడీఎంకేపై ఈపీఎస్ పట్టు సడలబోతుందా?
అమిత్ షాతో సమావేశం కాబోతున్న పళని స్వామి;
By : Pramila Krishnan
Update: 2025-09-16 06:58 GMT
ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు కేఏ సెంగొట్టయ్యన్ కలిసిన తరువాత తమిళనాడు లోని రాజకీయ వర్గాల్లో ఊహగానాలు చెలరేగుతున్నాయి.
రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమావేశం 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి మరిన్ని ఓట్లను జత చేయడానికి ఉపయోగపడే ఐక్య ఏఐడీఎంకేను ఏర్పాటు చేయడానికి కమల దళం ప్రయత్నిస్తోందని సమాచారం.
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఓ పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్, వీకే శశికళలను తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేయాలని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు కేఏ సెంగొట్టాయన్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే. పళని స్వామికి పదిరోజుల అల్టిమేటం జారీ చేశారు.
అయితే సెంగొట్టయన్ విలేకరుల సమావేశంలో అల్టిమేటం జారీ చేసిన కొద్దిసేపటికే ఈపీఎస్ ఆయన ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన విధించిన డెడ్ లైన్ సోమవారం తో ముగిసింది. కానీ ఎటువంటి సయోధ్యకు సంబంధించిన సంకేతాలు కనిపించలేదు.
ఈ పరిణామాలు ఇలా కొనసాగుతుండగానే ఈపీఎస్ ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలవడానికి సిద్ధంగా ఉన్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమావేశం అన్నాడీఎంకే లో ఓ స్పష్టమైన వైఖరిని తీసుకురావచ్చు.
బహిష్కరించబడిన నాయకులను ఏకం చేయడం లేదా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారిని దూరంగా ఉంచాలని తమ నిర్ణయంలో పార్టీ దృఢంగా ఉంటుందని బీజేపీకి తెలపవచ్చు.
కాషాయ పార్టీ వ్యూహాం..
భారత్ కు కొత్తగా ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ ను ఈపీఎస్ కలిసిన తరువాత అమిత్ షాను కలవబోతున్నారని కొన్ని వర్గాలు ‘ది ఫెడరల్’ కు చెప్పాయి. ది ఫెడరల్ తో మాట్లాడిన రాజకీయ విమర్శకుడు ఏ. జీవన్ కుమార్ ఈసారి అమిత్ షాతో ఈపీఎస్ సమావేశం అత్యంత ప్రాధాన్యం ఉండబోతోందని అన్నారు.
‘‘ఇది కేవలం సాధారణ సమావేశం కాదు. 2026 ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే నాయకులు ఐక్యంగా ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. దీనికి రాజకీయ ప్రాముఖ్యత ఉంది. ఐక్యత లేకుంటే డీఎంకే వ్యతిరేక ఓటు చీలిపోయే ప్రమాదం ఉంది.
ఇది అన్నాడీఎంకే తో పాటు బీజేపీని కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి బీజేపీ కంటే అన్నాడీఎంకే పార్టీలో ఐక్యత అవసరం ఎక్కువ’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
దక్షిణ తమిళనాడులో బీజేపీ వ్యూహాం ఇదేనని ఆయన చెప్పారు. అక్కడ ఓపీఎస్, శశికళ, టీటీవీ దినకరన్ ఇప్పటికి ప్రభావం చూపుతూనే ఉన్నారు. వారిని తిరిగి అన్నాడీఎంకే గూటికి తీసుకురావడం వలన ఓట్లను ఏకీకృతం చేయవచ్చు. డీఎంకేకి వ్యతిరేకంగా కూటమి పనితీరును మెరుగుపరుచుకోవచ్చు’’ అని జీవకుమార్ అన్నారు.
సెంగొట్టయన్ అల్టిమేటం ఇవ్వడం, తరువాత ఆయనను పార్టీ నుంచి తొలగించడం నాటకాన్ని మరింత రసవత్తరం చేశాయి. అమిత్ షా ను ఆయన కలవడం, ఐక్యత చర్చల కోసం బీజేపీ పూర్తిగా ఈపీఎస్ పైనే ఆధారపడి లేమనే సంకేతాలు బయటకు ఇచ్చింది. ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే కూటమిని పునర్మించడానికి ఢిల్లీ స్థాయిలో తీవ్ర కసరత్తు జరుగుతోంది.
ఈపీఎస్ ఏమంటున్నారు..
ఈపీఎస్ ఇప్పుడు సందిగ్థవస్థలో ఉన్నారు. ఒకవైపు ఢిల్లీ ఒత్తిడికి గురైతే తన క్యాడర్ లో నాయకుడిగా పలుచన అయ్యే అవకాశం ఉంది. మరో వైపు బీజేపీ ప్రతిపాదనను తిరస్కరిస్తే తమిళనాడులో ఆయన ప్రధాన మిత్రపక్షమైన కాషాయ పార్టీతో సంబంధాలు దెబ్బతింటాయి.
పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక మాజీ అన్నాడీఎంకే మంత్రి ది ఫెడరల్ తో మాట్లాడారు. బహిష్కరించబడిన వర్గాలను తిరిగి కలపడం ఎందుకు ఆమోదయోగ్యం కాదని షాతో జరిగే సమావేశంలో ఈపీఎస్ ఉపయోగించుకుంటారని చెప్పారు. ఓపీఎస్, టీటీవీ దినకరన్, శశికళలకు వ్యతిరేకంగా కార్యకర్తలు ఉన్నారని షాకు ఈపీఎస్ తెలియజేస్తారని మాజీ మంత్రి అన్నారు.
‘‘వారికి ఈ నాయకుల బహిష్కరణ కష్టపడి గెలిచిన యుద్ధం కాదు దానిని తిప్పికొట్టడం అట్టడుగు వర్గాలను నిరుత్సాహపరుస్తోంది. కానీ బీజేపీ అభిప్రాయం భిన్నంగా ఉంది. వారు ప్రతి ఓటును కోరుకుంటున్నారు.
అంటే బహిష్కరించబడిన నాయకులను తిరిగి చేర్చుకోవాలి. కానీ మాకు పార్టీని విభజించే వ్యక్తులకు మద్దతు ఇవ్వడం మాకు ఇష్టం లేదు’’ ని చెప్పారు.
అమిత్ షాను కలిశానని సెంగొట్టయన్ చేసిన వాదనను ఆయన తోసిపుచ్చారు. సెంగొట్టయన్ అమిత్ షాను వ్యక్తిగతంగా కలవలేదు. ఆయన తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రకటనలు ఇవ్వవచ్చు.
వాస్తవానికి పార్టీలో పదవి, అధికారం ఈపీఎస్ కే ఉంది. ఇతరులకు కాదు’’ ఇదిలా ఉండగా అన్నాడీఎంకే లో జరుగుతున్న పరిణామాలను డీఎంకే ఆసక్తిగా గమనిస్తోందని రాజకీయ విమర్శలకులు అంటున్నారు.
అధికార పార్టీకి అన్నాడీఎంకేలో ప్రతిరోజు అనైక్యత తన స్థానాన్ని బలపరుస్తుంది. బీజేపీ ప్రభావంతో ఐక్యంగా ఏఐఏడీఎంకే ఏర్పడితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ మరింత తీవ్రతరమవుతోంది.