‘‘తమిళనాడు లో తండ్రి కొడుకుల సవాల్’’

పీఎంకే పార్టీ నియంత్రణ పై కొడుకు అన్భుమణి పై తండ్రి రామదాస్ తిరుగుబాటు;

Update: 2025-07-10 12:48 GMT
ఎస్ రామదాస్, అన్భుమణి రామదాస్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు పీఎంకే పార్టీలో అధికార పోరాటం తీవ్రమైంది. పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ రామదాస్ తన కుమారుడు పార్టీ అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణిని ‘‘రామదాస్’’ అనే తన ఇంటి పేరును వాడొద్దని బహిరంగంగా పిలుపునిచ్చాడు.

ఇది పార్టీలో జరగుతున్న అంతర్యుద్దాన్ని సూచిస్తోంది. తంజావూర్ జిల్లా కుంభకోణంలో రామదాస్ నాయకత్వంలో జరిగిన పీఎంకే, వన్నియార్ సంఘం సంయుక్త జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రకటన చేశారు.

ఈ కార్యక్రమంలో రామదాస్ మాట్లాడుతూ.. ‘‘అన్బుమణి తన పేరు తరువాత నా పేరు ఉపయోగించకూడదు. అవసరమైతే కేవలం ఇనిషియల్ గా ఉపయోగించుకోవచ్చు.
కానీ నన్ను ధిక్కరించే వారికి నా పేరును ఉపయోగించే హక్కు లేదు’’ అని అన్నారు. ‘‘వారు నన్ను ఐదేళ్ల పిల్లవాడి అని పిలుస్తారు. కానీ ఈ పిల్లవాడు మూడేళ్ల క్రితం అన్బుమణిని పీఎంకే అధ్యక్షుడి చేశాడు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఎంకే నియంత్రణ..
పార్టీ నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటం కారణంగా పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రామదాస్(85) ఆయన కుమారుడు అన్బుమణి రామదాస్(56) మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఇద్దరు నాయకులు తమ మద్దతుదారులను సమీకరిస్తూ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వేర్వేరు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రామదాస్ అన్భుమణి మద్దతుదారులను పార్టీ కీలక పదవుల నుంచి తొలగించగా, తిరిగి వారిని ఆయన నియమించారు. ఇది విభజనను మరింత తీవ్రతరం చేసింది.
ముఖ్యంగా సేలం వెస్ట్ నుంచి ఎన్నికైన పీఎంకే ఎమ్మెల్యే అరుళ్ విషయంలో తమిళనాడు అసెంబ్లీలో వివాదం చెలరేగింది. రెండు వర్గాలు ఆయన విధేయతపై బహిరంగంగా ఘర్షణ పడ్డారు.
పార్టీ వేదికలపై జరిగిన బహిరంగ ఆరోపణల తరువాత పీఎంకే కార్యకర్తలను డైలామాలో పడేసింది. పార్టీలోని ప్రధాన వన్నియార్ ఓటర్లను మరింత గందరగోళానికి గురిచేసింది.
జూలై 8న రామదాస్ అధ్యక్షత వహించిన కార్యనిర్వహాక కమిటీ సమావేశం తిండివనం సమీపంలోని ఓమండూర్ లో జరిగింది. ఈ సమావేశంలో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పొత్తులు, అభ్యర్థుల ఎంపికతో సహ కీలకమైన పార్టీ నిర్ణయాలపై ఆయనకు పూర్తి అధికారం కల్పిస్తూ తీర్మానాలు ఆమోదించబడ్డాయి.
ఈ సమావేశంలో అన్భుమణి తన చర్యలకు క్షమాపణలు చెప్పాలని, క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే హాజరైనట్లు పలు వర్గాలు తెలిపాయి. ఇది పార్టీలో రామదాస్ ప్రభావం క్షీణించినట్లు హైలైట్ చేసింది.
ఈ సమావేశానికి ప్రతీకారంగా అన్బుమణి అదే రోజు చెన్నైలో పార్టీ కార్యకర్తలతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాన కార్యదర్శి ఎస్ వడివేల్ రావణ్ వంటి వారు హజరయ్యారు.
ఈ సమావేశం రామదాస్ నియమించిన కార్యనిర్వాహక కమిటీ చెల్లదని ప్రకటించింది. దాని తీర్మానాలు శూన్యమని, చెల్లదంది. అన్బుమణి సమావేశమైన జనరల్ కౌన్సిల్ మాత్రమే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే చట్టబద్దమైన అధికారం ఉందని చెప్పింది.
ఈసీని సంప్రదించిన రామదాస్
తీవ్ర ఉద్రిక్త మధ్య రామదాస్ వర్గం ఎన్నికల కమిషన్ కి ఒక లేఖ సమర్పించింది. ఇందులో పీఎంకే అధ్యక్షుడిగా అన్భుమణి పదవీకాలం మే 28, 2025తో ముగిసిందని పేర్కొన్నారు. పార్టీ బైలాస్ ప్రకారం.. రామదాస్ మరుసటి రోజు మే 29న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారని లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖలో వెయి కంటే ఎక్కువ సంతకాలు, ఇటీవల కార్యనిర్వాహక, రాష్ట్ర కమిటీ సమావేశాల తీర్మానాల కాపీతో పాటు పార్టీ అత్యున్నత పదవి నుంచి అన్భుమణి తొలగింపును అధికారికంగా చట్టబద్దం చేయడం ఈ సమర్పణ లక్ష్యం.
జూలై 5న విల్లుపురంలోని రామదాస్ తైలపురం ఎస్టేట్ లో జరిగిన సమావేశంలో అన్భుమణిని పార్టీ కార్యనిర్వాహక కమిటి నుంచి తొలగించారు. రామదాస్ అధికారిక లెటర్ హెడ్ నుంచి ఆయన పేరు తొలగించారు.
జూలై 8న ఒమందుర్ లో జరిగిన సమావేశం ఘర్షణను తీవ్రతరం చేసింది. ‘‘పార్టీ ప్రతిష్టను దెబ్బతీసినందుకు’’ అన్భుమణిపై చర్యకు తీసుకోవడానికి రామదాస్ కు అధికారం ఇచ్చే తీర్మానంతో సహ 25 తీర్మానాలను ఆమోదించింది.
అయితే పార్టీలో 90 శాతం మద్దతు తనకే ఉందని అన్భుమణి వర్గం చెప్పుకుంటోంది. రామదాస్ చేస్తున్నవి చట్ట విరుద్దంగా పేర్కొంది. బీజేపీ మద్దతు కూడగట్టడానికి అన్భుమణి ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. అయితే ఇది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అన్భుమణిని బహిష్కరించే చర్య..
రామదాస్ జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక్కడ అన్భుమణిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన ఒత్తిడి చేయవచ్చని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. రామదాస్ వ్యక్తిగత కార్యదర్శి స్వామినాథన్ ను సంప్రదించినప్పుడు ‘‘భారత ప్రధాన ఎన్నికల సంఘానికి అధికారికంగా లేఖ సమర్పించినట్లు చెప్పారు’’ మిగిలిన వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రజా వైరం పీఎంకే ప్రతిష్టను బలహీనపరిచే ప్రమాదం ఉంది. అన్బుమణి తీసుకున్న నిర్ణయానికి కారణమైన బీజేపీతో పార్టీ పొత్తుపై చింతిస్తున్న రామదాస్, అన్నాడీఎంకే వంటి ప్రాంతీయ ద్రవిడ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ అంతర్గత కుమ్ములాటలో వన్నియార్ కులంలో పీఎంకే కు ఉన్న 5 శాతం ఓట్ల వాటాప్రమాదంలో పడింది.ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే ఎన్నికల నాటికి ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది.


Tags:    

Similar News