సిద్ధరామయ్య భార్య కేసులో ఈడీకి మరోసారి మందలింపు

రాజకీయా పోరాటాలు ఓటర్ల ముందు చేయాలన్న సుప్రీంకోర్టు, ముడా స్కామ్ లో పార్వతికి ఇచ్చిన నోటీసులు కొట్టివేత;

Update: 2025-07-21 10:23 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య

ముడా స్కామ్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్యపై నమోదైన కేసును కొట్టివేయాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. రాజకీయంగా సున్నితమైన కేసులలో ఈడీ ప్రవర్తన తీరు సరిగా లేదని సర్వోన్నత న్యాయస్థానం విచారణ సందర్భంగా ఆక్షేపించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. రాజకీయా పోరాటాలలో ఏజెన్సీని ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని నిరసిస్తూ హెచ్చరించింది. ఓటర్ల ముందు పోరాడకుండా ఈడీని ఇలాంటి రాజకీయ యుద్దాలకు వాడుకుంటున్నారని కూడా ప్రశ్నించింది.
కర్ణాటక ముఖ్యమంత్రి భార్య బీఎం పార్వతికి సంబంధించిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కేసులో చర్యలను రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వూలను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ తరువాత సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది. సమన్లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన వాదనలో ఎటువంటి లోపం లేదని పేర్కొంది.
అప్పీల్ కొట్టివేత..
ఈడీ తరఫున హజరైన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తో న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ‘‘మిస్టర్ రాజు దయచేసి మమ్మల్ని నోరు తెరమని బలవంతం చేయకండి. లేకపోతే మేము ఈడీ గురించి కఠినమైన వ్యాఖ్యలు చేయవలసి వస్తుంది. దురదృష్టవశాత్తూ నాకు మహారాష్ట్రలో కొంత అనుభవం ఉందది. దేశవ్యాప్తంగా ఈ హింసను కొనసాగించవద్దు. ఓటర్ల ముందు రాజకీయ యుద్దాలు జరగనివ్వండి. మిమల్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు’’ అని చీఫ్ జస్టిస్ విచారణ సందర్భంగా అన్నారు.
ఈడీ అప్పీల్ ను కొట్టివేసిన కోర్టు కేసును కొట్టివేయాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సమర్థించింది. ఈ కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య బీఎం పార్వతికి కేటాయించిన భూమిలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
స్వాగతించిన సిద్ధరామయ్య
ముడా కేసులో ఈడీ నోటీస్ ను రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో సీఎం స్వాగతించారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ తీర్పు న్యాయం వైపు ఒక అడుగు అని, రాజకీయ ప్రేరేపిత జోక్యానికి ఎదురుదెబ్బ అని పేర్కొంది.
‘‘పార్వతి, కుమారుడు బైరతి సురేష్ ముడా కేసులో ఈడీ నోటీస్ ను రద్దు చేస్త హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఎస్ఎల్పీలను కొట్టివేశారు. ఈడీపై ప్రతికూల వ్యాఖ్యలు చేసింది.
ఈ విషయాన్ని రాజకీయం చేయకూడదని వారు పేర్కొన్నారు. ఓటర్ల ముందు మీ పోరాటాలు చేయండి. సింగిల్ జడ్జి ఇచ్చి ఆదేశంలో వారికి ఎలాంటి తప్పు కనిపించలేదు. న్యాయం గెలిచింది. ముడా కేసులో ఈడీ జోక్యానికి ముగింపు పలికింది’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


Tags:    

Similar News