కర్ణాటకకు తిరుగు ప్రయాణమైన డీకే శివకుమార్ మద్దతుదారులు

సీఎం మార్పు గందరగోళాన్ని పరిష్కరించాలని కోరినట్లు చెప్పిన ఎమ్మెల్యేలు

Update: 2025-11-26 11:50 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

కర్ణాటక లో సీఎం మార్పు హైడ్రామా కొనసాగుతోంది. డీకే శివకుమార్ ను సీఎంగా చేయాలనే డిమాండ్ తో ఢిల్లీ వెళ్లిన ఆయన మద్దతుదారులు తిరిగి బెంగళూర్ ప్రయాణం అయ్యారు. సీఎం మార్పు విషయంలో అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

ముఖ్యమంత్రి అంశంపై గందరగోళాన్ని త్వరగా ముగించాలని హైకమాండ్ ను కోరినట్లు కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు. మరికొంతమంది మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కొత్తవారికి అవకాశం కల్పించాలని కోరినట్లు చెప్పారు.

నవంబర్ 20న కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలంలో సగం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహగానాల మధ్య అధికార పార్టీలో అంతర్గత అధికార పోరు తీవ్రమైంది.

2023 లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య అధికార భాగస్వామ్య ఒప్పందం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. శివకుమార్ కు మద్దతు ఇస్తున్న ఆరుగురు శాసన సభ్యుల బృందం ఆదివారం రాత్రి హైకమాండ్ ను కలవడానికి ఢిల్లీ వెళ్లారు.

గతవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో దాదాపు పది మంది ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ‘‘ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం హై కమాండ్ దే అని, ప్రభుత్వంలో కొనసాగుతున్న గందరగోళాన్ని పరిష్కరించాలి’’అని మాగడి ఎమ్మెల్యే హెచ్ సీ బాలకృష్ణ అన్నారు.

తాము తుది నిర్ణయం తీసుకోవడానికి హైకమాండ్ తో మాట్లాడుతున్నాము. ఎవరి సీఎం అవుతారనేది ముఖ్యం కాదని, ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి హనికరం అని, హైకమాండ్ జోక్యం చేసుకుని ముగింపు పలకాలని అన్నారు.

అయితే శివకుమార్ ను సీఎం చేస్తారా అనే ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. అయితే రామనగర ఎమ్మెల్యే ఇక్భాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. శివకుమార్ సీఎం కావడం ఖాయమని అన్నారు.

అయితే హై కమాండ్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. మరో ఎమ్మెల్యే కెఎం ఉదయ్ మాట్లాడుతూ..మంత్రివర్గంలో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని కోరారు.

ప్రస్తుత గందరగోళం పరిష్కారించాలని హై కమాండ్ ను కోరినట్లు చెప్పారు. తనకు మద్దతు ఇచ్చే శాసనసభ్యులు ఢిల్లీకి వెళ్లే విషయం తనకు తెలియదని శివకుమార్ అన్నారు.


Tags:    

Similar News