మహిళలకు పెరుగుతున్న డిజిటల్ వేధింపులు

బెంగళూర్ లో అనుమతి లేకుండా అమ్మాయి వీడియో చిత్రణ, సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్.. బాధిత మహిళ కామెంట్ తో అలర్ట్ అయిన పోలీసులు;

Update: 2025-07-10 11:30 GMT

బహిరంగ ప్రదేశాలలో మహిళల అనుమతి లేకుండా వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చర్చి స్ట్రీట్, కోరమంగళ ప్రాంతంలోని ఓ మహిళ స్లో మోషన్ లో వెళ్తున్నట్లు వీడియో తీసి అకౌంట్ లో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారడంతో సదరు ఈ ఖాతా ఎక్స్ పోజ్ అయింది. ఇది కచ్చితంగా అనుమతి లేకుండా తీసిన వీడియో అని తెలిసింది.

వీడియోలు తీసిన వ్యక్తిని గురుదీప్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. హోటల్ మేనేజ్ మెంట్ చేసి కేఆర్ పురంలో తన సోదరుడితో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. గత నెలలో ఇలాంటి సంగతే మరొకటి జరిగింది.
హసన్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల దిగంత్ మెట్రోలో ప్రయాణించే మహిళల అవాంఛిత చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేసినందుకు అరెస్ట్ అయిన తరువాత ఇది జరిగింది.
మహిళల వీడియోలు..
సింగ్ ఇన్ స్టాగ్రమ్ లో క్లిప్ లలో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యంగా బెంగళూర్ లోని ఒక ప్రసిద్ధ వాణిజ్య ప్రాంతమైన చర్చి స్ట్రీట్ లో నడుస్తున్నట్లు చూపించారు.
ఈ వీడియోలను జాగ్రత్తగా పరిశీలిస్తే వారి అనుమతి లేకుండా తీసినట్లు స్పష్టమైంది. వీధిలో జరిగే గందరగోళాన్ని రికార్డు చేసే ముసుగులో మహిళల వీడియోలు తీసినట్లు తెలిసింది.
బెంగళూర్ నగరంలో తాను ఏదో పని మీద వెళ్తున్న సమయంలో ఈ వీడియో తీశారని ఓ మహిళ కింద కామెంట్ చేయడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ఈ వీడియోలను డిలీట్ చేయడానికి తాను ప్రయత్నించానని కానీ అవన్నీ విఫలం అయినట్లు కూడా బాధిత మహిళ చెప్పారు. ఇన్ స్టాగ్రామ్ లో యాప్ కు ఫిర్యాదు కూడా చేశానని, కానీ వారు దీనికి స్పందించలేదని కూడా తెలిపింది.
అనుమతి లేకుండా ఎలా..
గురుదీప్ సింగ్ చర్చి స్ట్రీట్ లో గందరగోళాన్ని చిత్రీకరిస్తున్నట్లు నటిస్తూ తిరుగుతున్నాడని, కానీ అతను కేవలం మహిళలను అనుసరించి వారి అనుమతి లేకుండా వారిని రికార్డు చేస్తున్నాడని, ఆ అమ్మాయి హైలైట్ చేసింది.
‘‘ఇది నాకు జరిగింది. ఇలానే చాలామందికి జరిగి ఉంటుందని అనుకుంటున్నాను. నేను అందరికి కనిపిస్తున్నానంటే నన్ను వీడియో తీయడానికి అనుమతిచ్చినట్లు కాదు. నా అనుమతి లేకుండా ఇలా ఎలా చేస్తారు’’ అని బాధిత మహిళ కామెంట్ చేసింది. ఈ వీడియో వల్ల సదరు మహిళకు అపరచిత వ్యక్తుల నుంచి అసభ్యకరమైన సందేశాలు రావడం ప్రారంభించాయి.
ఇన్ స్టాగ్రామ్ అంతర్గత విధానాలు..
ఇన్ స్టాగ్రామ్ నుంచి ఈ ఖాతాను తొలగించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయని పోలీసులు తెలిపారు. దీనికి సోషల్ మీడియా ప్లాట్ ఫాం అంతర్గత విధానాలే కారణమని తెలిపారు. ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన మెటా ఖాతాను తొలగించడానికి న్యాయపరమైన జోక్యాన్ని కోరేందుకు సిద్దమవుతున్నట్లు పోలీసులు తెలిపారు.
పాత కేసు..
కొన్ని వారాల క్రితం బెంగళూర్ లో వేరే సోషల్ మీడియా ఖాతాకు చెందిన మరో ఇబ్బందికరమైన విషయం బయటపడింది. మెట్రోలో ప్రయాణించే మహిళల చిత్రాలు, వీడియోలను వారి అనుమతి లేకుండా తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ ఖాతా మహిళల వీడియోల వల్ల బాగా వైరల్ గా మారింది. బహిరంగ ప్రదేశాలలో డిజిటల్ వేధింపుల గురించి పెరుగుతున్న ఆందోళనలు తార్కాణంగా నిలిచింది.
ఈ వీడియోలు తీసిన వ్యక్తి దిగంత్(27) జూన్ లో అరెస్ట్ అయ్యాడు. ఒక ప్రయివేట్ సంస్థలో అకౌంట్స్ విభాగంలో ఉద్యోగి అయిన అతను రోజువారీ ప్రయాణంలో మహిళలను వీడియో తీస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అతనికి ఇన్ స్టగ్రామ్ లో 5 వేల మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అయితే అధికారిక ఫిర్యాదు తరువాత ఖాతాను తొలగించారు.


Tags:    

Similar News