‘‘చిన్నారి తప్పుడే ప్రవర్తనే లైంగిక వేధింపులకు కారణమయ్యాయి’’
మైలదుత్తురై కలెక్టర్ వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు;
By : Praveen Chepyala
Update: 2025-03-01 09:50 GMT
మూడేళ్ల చిన్నారి అనుచితంగా ప్రవర్తించిన కారణంగానే లైంగిక వేధింపులు ఎదుర్కొందని జిల్లా కలెక్టర్ వ్యాఖ్యానించడంతో తమిళనాడులో సంచలనం రేపింది.
నిందితుడు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం బాధితురాలు చేసిన చెడ్డ పనులే కారణమని జిల్లా కలెక్టర్ ఏపీ మహాభారతి ఓ సమావేశంలో వ్యాఖ్యానించడంతో తీవ్ర దుమారం చెలరేగడంతో తమిళనాడు ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది.
నిన్న జరిగిన ఒక సెన్సిటిజేషన్ కార్యక్రమంలో మహాభారతి మాట్లాడుతూ.. ‘‘మూడు సంవత్సరాల చిన్నారి నిందితుడితో తప్పుగా ప్రవర్తించింది. ఆ చిన్నారి దుండగుడి ముఖంపై ఉమ్మివేసిందని, అదే దాడికి కారణమైందని అందువల్ల పోక్సో కేసు రెండు వైపులా పరిగణలోకి తీసుకోవడం ముఖ్యము’’ అన్నారు.
కలెక్టర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై వేలాదిమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పిల్లవాడు తన చర్యల పరిణామాల గురించి ఎలా తెలుసుకోగలడని చాలామంది ప్రశ్నించారు.
ఒక ఉన్నతాధికారి ఇలా ఎలా ఆలోచించగలరని చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది కాస్త ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే అవకాశంగా మారడంతో మహాభారతిని మైలదుత్తురై నుంచి బదిలీ చేశారు.
కానీ ఎక్కడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. మైలదుత్తురై జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో చిన్నారిపై వేధింపులకు పాల్పడింది 16 ఏళ్ల బాలుడని పీటీఐ వార్తలు ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.