కాంగ్రెస్ ‘గురి’ గుల్బార్గా పై సరిగా కుదరట్లేదా?

వచ్చే ఎన్నికల్ల్ కాంగ్రెస్ పార్టీకి ఒటు వేయకపోతే తన అంతిమయాత్రకు తరలిరావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Update: 2024-04-30 07:11 GMT

ఈ మధ్య రాజకీయ నాయకులందరూ భావోద్వేగంతో ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేరారు. ఇటీవల ఆయన గుల్బార్గా లోక్ సభ నియోజకవర్గంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే.. ఈ తరువాత జరిగే తన అంతిమయాత్రకు తరలిరావాలని.. ఈ నియోజకవర్గానికి నేను చేసిన మేలును గుర్తుంచుకోవాలని ఓటర్లను కోరారు.

"మీరు దహనం చేసినా లేదా మట్టిని అర్పించినా సరే నాకోసం కొవ్వొత్తి వెలిగించండి. నేను కొన్ని మంచి పనులు చేశానని ఇతరులు గ్రహిస్తారు, అది కూడా నా అంత్యక్రియల సమయంలో ఎక్కువ మంది తరలివస్తే. మీ ఓటు వృధా కాకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ," ఖర్గే ప్రజలకు భావోద్వేగంతో పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఇదే విధంగా ఓ నాయకుడు ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. 
కర్ణాటకలో 'హాటెస్ట్' సీటు
గుల్బర్గాలో ఖర్గేకు గట్టిపోటీ ఎదురుకావడమే ఈ భావోద్వేగానికి కారణం. కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా కూడా అత్యంత చర్చనీయాంశమైన నియోజకవర్గాలలో ఇది ఒకటి.
ఈ నియోజక వర్గంలోని ఓటర్లను భావోద్వేగానికి గురి చేసేందుకు ఖర్గే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిన ఈ నియోజకవర్గాన్ని తిరిగి చేజిక్కించుకోవడం కోసం చివరి ప్రయత్నంగా ఆయన ఈ మాటలు అన్నారు. ఈ విజ్ఞప్తి చేస్తున్నప్పుడు ఖర్గే ముఖంలో నిరాశ కనిపించింది. మీటింగ్ జరిగిన అఫ్జల్‌పూర్ ప్రజలు కూడా కొన్ని సెకన్లపాటు మౌనంగా ఉన్నారు.
కష్టతరమైన సవాలు
గత యాభై సంవత్సరాల నుంచి కర్నాటకలో జరుగుతున్న ఎన్నికల్లో ఖర్గే పోటీ చేసి విజయం సాధిస్తునే ఉన్నారు. అయితే ఈ సారి తను పోటీకి దూరంగా ఉంటున్నారు. కర్ణాటకలోని పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, ఖర్గే ఈ సారి పోటీ నుంచి తప్పుకోవాలని భావించారు. జాతీయస్థాయిలో విపరీతమైన పనుల ఒత్తిడి ఉండటం వల్ల గుల్భార్గా నుంచి పోటీ చేయకూడదని అనుకున్నారు.
ఖర్గే బాధ్యతలు చేపట్టాక 2023లో కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. తరువాత తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే లక్ష్యంలో పని చేస్తున్నాడు. సొంత రాష్ట్రం కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని నిరూపించాలని ఆయన భావిస్తున్నాడు.
గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి బరిలో నిలుచున్నాడు. ఇప్పుడు 2019లో ఖర్గేను ఓడించిన ఉమేష్ జాదవ్‌తో దొడ్డమణి పోరు చేస్తున్నారు.
2019లో ఖర్గేని ఓడించిది ఎవరో కాదు. అతనికి నమ్మకమైన అనుచరుడుగా ఉన్న ఉమేష్ జాదవ్.. ఆ ఎన్నికల్లో 95,452 ఓట్ల తేడాతో గెలుపొందారు. నిజానికి 1972 నుంచి 47 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఖర్గేకు ఇది తొలి ఎన్నికల ఓటమి.
కర్నాటకలోని గుల్బర్గా సీటు ఖర్గే, కాంగ్రెస్ ఇద్దరికీ కీలకమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(J) ప్రకారం కళ్యాణ కర్ణాటక ప్రాంతానికి (హైదరాబాద్ కర్ణాటక) ప్రత్యేక హోదా పొందడంలో ఖర్గే కీలక పాత్ర పోషించారు. ఇదే అంశాన్ని తన అల్లుడు దొడ్డమణి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు.
'అజేయుడైన నాయకుడు'
ఖర్గే గుల్బర్గా (ప్రస్తుతం కలబురగి) జిల్లాలోని గుర్మితకల్ స్థానం నుంచి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో ఓడిపోయే ముందు (2009, 2014) లోక్‌సభకు రెండుసార్లు గుల్బర్గా నుంచి ప్రాతినిధ్యం వహించాడు.
గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్‌లను కలిగి ఉంది వాటిలో అఫ్జల్‌పూర్, జేవర్గి, గుర్మిత్‌కల్, చిత్తపురా, సేడం, గుల్బర్గా రూరల్, గుల్బర్గా సౌత్, గుల్బర్గా నార్త్. గుర్మిత్‌కల్ (జేడీఎస్‌కు చెందిన నాగనగౌడ కుందకూర్), గుల్బర్గా రూరల్ (బీజేపీకి చెందిన బసవరాజు మట్టిమడు) మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌కు చెందిన వారే. “మోదీ, షాలకు గుల్బర్గా ప్రజలు స్పందించరని నాకు నమ్మకం ఉంది. దురదృష్టవశాత్తు, నేను ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నాను. కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఓడిపోతే మీ గుండెల్లో నాకు స్థానం లేదని అనుకుంటాను’’ అని ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

ఇది ప్రధానంగా కాంగ్రెస్ కంచుకోట. 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి 1996 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ గెలుస్తూనే ఉంది. తరువాత 1999 నుంచి 2019 వరకూ కూడా కాంగ్రెస్ తన పట్టును ప్రదర్శిచింది

ఉత్తర కర్నాటకలో గెలవాలని
బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఉత్తర కర్నాటకలో సీట్లకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాన్ని కూడా ప్రజలకు పంపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నాటకలో గుల్బార్గా నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక్కడి నుంచి ఖర్గే ఓడిపోయినప్పటికీ తన పార్టీ గెలవడానికి ఉన్నఏ అవకాశాన్ని ఆయన విడిచిపెట్టడం లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే అగ్రనాయకులను ఇక్కడి నుంచి పోటీకి దింపుతోంది. 
ఆర్టికల్ 371(J) ఆయుధంగా..
కాంగ్రెస్ అధ్యక్షుడు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారని, దొడ్డమణిని గెలిపించడానికి అన్నిప్రయత్నాలు చేస్తున్నారని ఖర్గే సన్నిహిత వర్గాలు ఫెడరల్ కి తెలిపాయి. ప్రియాంక్ ఖర్గే, డాక్టర్ శరణ ప్రకాష్ పాటిల్.. దొడ్డమణి గెలుపుకోసం ఎండవేడిని లెక్కచేయకుండా కష్టపడుతున్నారు.
కళ్యాణ కర్ణాటక ప్రాంతానికి ఐదు హామీలను అమలు, ఆర్టికల్ 371-జె తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. దొడ్డమణి ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ క్రమపద్ధతిలో ప్లాన్ చేసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. దొడ్డమణికి అనుకూలంగా సమాజంలోని అన్ని వర్గాల మద్దతు పొందడానికి ప్రియాంక్, శరణ్‌ప్రకాష్ పాటిల్ వివిధ కుల సంఘాలు, కార్మిక వర్గాలను వేర్వేరుగా కలుస్తున్నారు.
బీజేపీ కూడా అంతే 
ఖర్గెని ఓడించి జాయింట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్న ఉమేష్ జాదవ్ తిరిగి ఇక్కడ గెలుపొందాలని గట్టిగా పోరాడుతున్నారు. బీజేపీ పెద్దల అండదండలు ఆయనకు పుష్కలంగా లభిస్తున్నాయి. బీజేపీ దొడ్డమణిని, కాంగ్రెస్ పార్టీని ముస్లిం అనుకూల అభ్యర్థిగా పేర్కొంటునే.. గుల్బార్గా నుంచి వందే భారత్ వంటి రైళ్లు వంటి వాటితో సహ కొత్త రైళ్లను ప్రారంభించడాన్ని తమ విజయంగా చెప్పుకుంటున్నారు. తమ ట్రంప్ కార్డు అయినటువంటి హిందూత్వ వాదం కూడా పార్టీ తన వ్యూహంగా ఉపయోగిస్తోంది. గుల్బర్గా నియోజకవర్గంలో 20,98,202 మంది ఓటర్లు ఉన్నారు. లింగాయత్ ల ప్రాబల్యం ఎక్కువ. దాదాపు ఇక్కడ వీరి సంఖ్య ఐదు లక్షల పైమాటే.
దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉన్న కురుబలు రెండవ అతిపెద్ద సామాజికవర్గం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారణంగా వారు కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశం ఉంది. ముస్లింలు, కోలీ వర్గాలు ఒక్కొక్కరు 2.5 లక్షల మంది ఓటర్లతో మూడో స్థానంలో ఉన్నారు.
కోలీస్ సామాజికవర్గాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని బీజేపీ 2019లో హమీ ఇచ్చింది. అయితే దానిని నెరవేర్చలేదు. అలాగే ప్రముఖ కోలి నాయకుడు బాబూరావు చించనసూర్ ను బీజేపీ తన పార్టీలోకి చేర్చుకుంది. దీంతో బీజేపీ సునాయాసంగా విజయం సాధించింది.
తిరిగి కాంగ్రెస్ గూటీకి చించన్ సూర్..
ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాజపా విఫలమవడంతో ఇప్పుడు చించనసూర్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఖర్గేను ఓడించడంలో కీలకపాత్ర పోషించేందుకు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్ కూడా ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికలలో ఖర్గే కంటే జాదవ్ 35,000 ఓట్లకు పైగా సాధించిన అఫ్జల్‌పూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ గణనీయమైన ఆధిక్యాన్ని పొందడానికి చించన్‌సూర్, గుత్తేదార్‌ల తిరిగి రావడమే కారణం.
ఎస్సీ (రైట్) ఓటర్లు తమ నాయకుడు దొడ్డమణికి మద్దతు ఇస్తారని కాంగ్రెస్ కూడా పేర్కొంది. అయితే, ఉమేష్ జాదవ్ లంబానీ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి, వారు ఆయనకు ఓటు వేస్తారని బీజేపీ కార్యకర్తలు నమ్ముతున్నారు.
మరోవైపు, కాంగ్రెస్ నాయకులు రేవు నాయక్ బెళమగి, సుభాష్ రాథోడ్ వంటి ప్రముఖ నాయకులను తన గుప్పిట్లో ఉంచుకోవడంతో లంబానీ ఓట్లలో కూడా గణనీయమైన భాగాన్ని చేజిక్కించుకోవాలని పార్టీ భావిస్తోంది.
ఆర్టికల్ 371(జే)ని తిరస్కరించిన అద్వానీ
ఈ ప్రాంత అభివృద్ధిలో కాంగ్రెస్‌ పార్టీ తామే ఛాంపియన్‌గా వ్యవహరిస్తుందన్నారు. 1999లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ హయాంలో అప్పటి ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ ఆర్టికల్ 371 (జె) ప్రకారం కళ్యాణ కర్ణాటకకు ప్రత్యేక హోదాను తిరస్కరించడం బిజెపిని ఇంకా వెంటాడుతూనే ఉంది. యూపీఏ ప్రభుత్వం 2012లో దీన్ని అంగీకరించింది.
కళ్యాణ కర్ణాటక ప్రాంతానికి ఖర్గే అందించిన సహకారం, ప్రత్యేకించి ఆర్టికల్ 371(జె) దొడ్డమణికి అనుకూలంగా మారుతుందా లేక కులమతాలకు అతీతంగా ప్రజలు మోదీకి ఓటేస్తారా అనేది ప్రశ్నార్థకమే
Tags:    

Similar News