మైనారిటీలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన దళపతి

ఒక్కొ కార్యకర్తకు కనీసం ఐదుగురు ముస్లింలు తీసుకురావాలని నిబంధన;

Update: 2025-03-08 10:35 GMT

తమిళగ వెట్రీ కజగం(టీవీకే) చీఫ్ విజయ్ చెన్నైలోని రాయపేటలోని వైఎంసీఏ మైదానంలో గ్రాండ్ గా ఇఫ్తార్ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో 15 మందికి పైగా జమాత్ నిర్వాహకులు పాల్గొన్నారు. మత సామరస్యం, సమ్మిళితం సందేశాన్ని బలోపేతం చేస్తూ 2000 మందికి పైగా హజరయ్యారు.

రంజాన్ పండగ సందర్భంగా మటన్ బిర్యానీ, చికెన్ 65, సమోసాలు, నొంబు కంజి( సాంప్రదాయ గంజి) డ్రై ప్రూట్స్ తో సహా విస్తృతమైన భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు.
టీవీకే సభ్యులు సమాజంలోని వివిధ వర్గాల నుంచి పాల్గొనడాన్ని ప్రొత్సహించడానికి కనీసం ఐదుగురు ముస్లింలను తీసుకురావాలని ప్రొత్సహించారు.
Full View

ఈ వేడుకకు దళపతి విజయ్ ముస్లిం సాంప్రదాయ ఆచారాలను గౌరవిస్తూ వారి సాంప్రదాయ దుస్తులలతో తలపై టోపి, తెల్లచొక్కాతో సంప్రదించాడు. అతను జనసమూహానికి చేయి ఊపుతుండగా, మద్దతుదారులు, టీవీకే పార్టీ సభ్యులు అతన్ని హృదయపూర్వకంగా స్వాగతించారు. ఇఫ్తార్ విందు కోసం నేలపై ఉన్న హజరైన వారితో కలిసి కూర్చునే ప్రాంతానికి తీసుకెళ్లారు.
విజయ్ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు ఇక్కడ గూమిగూడిన నా ముస్లిం స్నేహితులకు నా శుభాకాంక్షలు. నబీగల్ నాయగం సూత్రాలను అనుసరించే వారందరికీ నా హృదయపూర్వక గౌరవాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నా ఆహ్వానాన్ని అంగీకరించి ఇక్కడకు వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ఉనికి నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది’’ అన్నారు.
ఇఫ్తార్ సమావేశం ద్వారా విజయ్ వచ్చే ఎన్నికల కోసం మైనారిటీల వర్గాలను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. సామాజిక సమ్మిళతత్వాన్ని పెంపొందించడం ద్వారా, ఈ కార్యక్రమం టీవీకే ఐక్యతను ప్రదర్శించింది.
ఇప్పటికే తమిళనాడులో విజయ్ పార్టీ మెల్లగా తన ప్రయాణం ప్రారంభించింది. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను పూరించడానికి టీవీకే పార్టీ ప్రయత్నిస్తోంది. తనను తాను నాయకుడిగా నిలబెట్టుకోవడానికి సినిమాలు సైతం దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నాడు.


Tags:    

Similar News