ప్రేమ విఫలమయిందని జిలెటిన్ స్టిక్ తో పేల్చేసుకున్నాడు
కర్ణాటకలోని మాండ్యలో యువకుడి ఆత్మహత్య;
By : 491
Update: 2024-12-30 08:11 GMT
తన ప్రేమను బాలిక కుటుంబ సభ్యులు తిరస్కరించారని 21 ఏళ్ల యువకుడు ఆమె ఇంటిముందే జిలెటిన్ స్టిక్ తో తనను పేల్చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్న సంఘటన కర్నాటకలోని మాండ్య జిల్లాలనోని కాలేనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆదివారం ఉదయం తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్య కు పాల్పడిన రామచంద్రకు మైనర్ బాలికతో సంబంధం ఉంది. గత సంవత్సరం అతను మైనర్ బాలికతో పారిపోయాడు. అయితే తరువాత దొరకడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతడు అరెస్ట్ అయి మూడు నెలలు జైళ్లో ఉన్నాడు.
జైలు నుంచి విడుదల..
జైలు నుంచి విడుదలయ్యాక బాలిక కుటుంబంతో వారి కుటుంబ సభ్యులు రాజీకుదుర్చుకోవడంతో కేసు కొట్టివేశారు. అయితే కొన్ని వారాల తరువాత మళ్లీ బాలికకు ఫోన్ కాల్స్ చేయడం ప్రారంభించి, బాలికతో సంబంధం కొనసాగించాడని పోలీసులు తెలిపారు. చట్టబద్ధమైన వయస్సు వచ్చిన తర్వాత బాలికకు వేరొకరితో వివాహం జరిపించాలని బాలిక కుటుంబం యోచిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
దీనితో నాగమంగళ తాలుకాలోని రామచంద్రకు విషయం తెలిసింది. తిరిగి బాలిక కుటుంబంతో మాట్లాడానికి ప్రయత్నించగా వారు తిరస్కరించారు. ఈ సంఘటనతో మనస్థాపం చెందిన రామచంద్రుడు ఆదివారం తన వెంట తెచ్చుకున్న జిలెటిన్ స్టిక్ ను పేల్చుకున్నాడు. పేలుడు ధాటికి శరీరం ఛిద్రం కావడంతో రామచంద్రు అక్కడికక్కడే మరణించాడు.
మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని కుటుంబం క్వారీ వ్యాపారంలో ఉందని, ఆ విధంగా అతనికి జిలెటిన్ స్టిక్ లభించిందని పోలీసులు తెలిపారు.
(ఆత్మహత్యలను నివారించవచ్చు. సహాయం కోసం దయచేసి ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయండి: నేహా ఆత్మహత్య నివారణ కేంద్రం - 044-24640050; ఆత్మహత్య నివారణ, భావోద్వేగ మద్దతు & గాయం సహాయం కోసం ఆసరా హెల్ప్‌లైన్ - +91-9820466726; కిరణ్, మానసిక ఆరోగ్య పునరావాసం - 590000 0019, దిశ 0471- 2552056, మైత్రి 0484 2540530, మరియు స్నేహ ఆత్మహత్యల నివారణ హెల్ప్‌లైన్ 044-24640050 )