కలుషిత దగ్గు సిరప్‌తో ఏడుగురు చిన్నారులు మృతి?
మధ్యప్రదేశ్‌లో ఆరుగురు, రాజస్థాన్‌లో ఒకరు మృతి..
Update: 2025-10-01 14:44 GMT
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని చింద్వారా జిల్లాలో దగ్గు సిరప్ తాగి ఆరుగురు పిల్లలు, రాజస్థాన్(Rajashtan) లోని సికార్ జిల్లాలో ఒకరు మరణించారు. అప్రమత్తమయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటి పరిసరాల్లో నీళ్లను, ఇంటి పరిసరాలను పరిశీలించారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలకు దగ్గు ఉండడంతో సిరఫ్ వాడుతున్నామని బాటిల్‌ను వాళ్లకు చూయించారు. వైద్యాధికారులు దాన్ని తమ వెంట తీసుకెళ్లారు. కలుషిత దగ్గు సిరప్ (Contaminated Cough Syrup) వాడకం వల్ల పిల్లల్లో కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసి చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిరప్ బాటిళ్లను పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. నివేదిక రావాల్సి ఉంది. రిపోర్టు వచ్చే వరకు సిరప్ విక్రయాలను నిలిపేయాలని ఆసుపత్రులకు, మందుల దుకాణ యజమానులు సమాచారం ఇచ్చారు.