ఎఎఫ్ఎంఎస్ డీజీగా ఆర్తీ సరిన్..తొలిసారి మహిళకు అవకాశం.

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌ (DG-AFMS)గా సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తీ సరిన్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు.

Update: 2024-10-01 12:28 GMT

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌ (DG-AFMS)గా సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తీ సరిన్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారి ఈమె. సరిన్ పూణేలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (AFMC) పూర్వ విద్యార్థి. డిసెంబర్ 1985లో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లోకి ప్రవేశించారు. రేడియో డయాగ్నోసిస్, రేడియేషన్ ఆంకాలజీలో రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను పూర్తి చేసిన సరిన్..గామ నైఫ్ సర్జరీలో కూడా శిక్షణ పొందారు.

తన కెరీర్‌లో అనేక కీలక పదవులను నిర్వహించారు. ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండింటికీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. వైస్ అడ్మిరల్‌గా ఉన్న సారిన్ రెండు ప్రధాన విభాగాలు INHS అశ్విని AFMCలకు నాయకత్వం వహించారు. సదరన్ నావల్ కమాండ్ (SNC), వెస్ట్రన్ నావల్ కమాండ్ (WNC) కమాండ్ మెడికల్ ఆఫీసర్‌గా కూడా విధులు నిర్వహించారు.

38 ఏళ్ల కెరీర్‌లో విశిష్ట సేవలకు గాను ఆమెకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ (2017), చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ కమెండేషన్ (2001), జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ కమెండేషన్ (2013) కూడా లభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Tags:    

Similar News