ఆర్జీ కర్ హాస్పిటల్ రేప్ ఘటనలో దోషి సంజయ్ రాయ్‌

ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ నెల 20న శిక్ష ఖరారు చేయనున్నారు.;

Update: 2025-01-18 11:04 GMT

కోల్‌కతా(Kolkata) ఆర్జీ కర్ (RG Kar) హాస్పిటల్‌ ట్రైనీ డాక్టర్‌(Doctor)ను అత్యాచారం చేసి ఆపై హత్య(Murder) చేసిన కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. నిందితుడు, పోలీస్ వలంటీర్ సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చింది. న్యాయమూర్తి జనవరి 20న శిక్ష ఖరారు చేయనున్నారు. ఆగస్టు 9వ తేదీ రాత్రి రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. తీవ్ర నిరసనల నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించారు. వారు సమర్పించిన ఆధారాల మేరకు సంజయ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. తీర్పు నేపథ్యంలో భారీ భద్రత మధ్య సంజయ్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదని, తనను కావాలని తప్పుడు కేసులో ఇరికించారని జడ్జికి సంజయ్ తెలిపాడు. అయితే నీకు సోమవారం మాట్లాడే అవకాశం ఇస్తామని న్యాయమూర్తి చెప్పారు. తీర్పును గౌరవిస్తున్నానని మృతురాలి తండ్రి కోర్టులో కన్నీటిపర్యంతమయ్యారు.

మాజీ ప్రిన్సిపాల్‌కు బెయిల్..

ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా సంజయ్‌(Sanjay)ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ (Sandeep) ఘోష్, తాలా పోలీస్‌ స్టేషన్‌ మాజీ ఆఫీసర్‌ ఇన్‌ ఛార్జి అభిజిత్‌ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వారిని అరెస్టు చేయగా.. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది.

భద్రత పెంపు

తీర్పు నేపథ్యంలో సీల్దా కోర్టు వద్ద పోలీసులు భద్రతను పెంచారు.కోల్‌కతా పోలీసులు అనేక బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News