‌రాహుల్‌ లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు సమన్లు జారీ

‘VD సావర్కర్ తన మిత్రులతో కలిసి ఒక ముస్లిం వ్యక్తిని కొట్టి ఆనందించాడు.’ - రాహుల్ గాంధీ

Update: 2024-10-05 08:10 GMT

పూణేలోని ప్రత్యేక కోర్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్‌పై లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గతంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సావర్కర్‌ మనవడు సాత్యకి సావర్కర్ పూణెలోని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆ పిటీషన్‌ను పరిశీలించిన కోర్టు కేసును కేసును ప్రత్యేక కోర్టుకు ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు కేసు బదిలీ చేసింది. విచారించిన కోర్టు అక్టోబర్ 23న తన ఎదుట హాజరుకావాలని కోరుతూ న్యాయమూర్తి రాహుల్‌కు సమన్లు జారీ చేశారు.

రాహుల్ ఏమన్నారు?

మార్చి 2023లో లండన్‌ పర్యటనలో ఉన్న రాహుల్ తన ప్రసంగంలో.. ‘‘ఒకప్పుడు VD సావర్కర్ తన మిత్రులతో కలిసి ఒక ముస్లిం వ్యక్తి కొట్టి ఆనందించాడు. ఈ విషయం ఆయన పుస్తకంలో ఉంది’’ అని వ్యాఖ్యానించారు. అయితే ‘‘అలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. VD సావర్కర్ ఎక్కడా అలా రాయలేదు. రాహుల్ ఆరోపణలు అబ్బద్ధం. కలితం’’ అని సాత్యకి సావర్కర్ పేర్కొన్నారు.   

Tags:    

Similar News