‘అధికారంలోకి వస్తే.. బీహార్‌లో మద్య నిషేధం తొలగింపు’

‘మహిళల ఓట్లు కోల్పోతానని ఆందోళన ఉన్నా.. నిషేధాన్ని వ్యతిరేకించడానికి ఏ మాత్రం వెనుకాడను’ - రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.

Update: 2024-09-15 09:09 GMT

వ‌చ్చే ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జరగనున్నాయి. ఇక పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలుపెట్టాయి. అందులో భాగంగానే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన గంటలోపే బీహార్ రాష్ట్రంలో మద్యనిషేధం రద్దును తొలగిస్తామని ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న తన పార్టీ ‘‘జన్ సురాజ్’’ ఆవిర్భావ ఏర్పాట్ల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

2016 నుంచి నిషేధం..

బీహార్‌లో మద్యం వినియోగం, విక్రయాలపై 2016 ఏప్రిల్‌లోనే పూర్తిగా నిషేధం విధించారు. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో కల్తీ మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.

వేల కోట్ల నష్టం..

నిషేధం వల్ల ఉపయోగం లేదని, అక్రమ మద్యం వ్యాపారంతో రాజకీయ నాయకులు, అధికారులు లబ్ధి పొందుతున్నారని కిశోర్ ఆరోపించారు. రాష్ట్రానికి రూ.20,000 కోట్ల ఎక్సైజ్ ఆదాయానికి గండి పడుతుందన్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం కావడంతో మద్యపాన నిషేధాన్ని ఎత్తేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఏ చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.

ఏ మాత్రం వెనకాడను..

ఇతర పార్టీల మాదిరిగా కాకుండా..మహిళల ఓట్లను కోల్పోతానని ఆందోళన ఉన్నా.. నిషేధాన్ని వ్యతిరేకించడానికి వెనుకాడనని తెలిపారు.2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సూరాజ్ మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రానికి ఎంత నష్టం?

బీహార్‌లో మద్యం నిషేధం గురించి పార్టీల నేతలు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మద్య నిషేదం అమలు మంచిదని కొందరంటే..దాన్ని వల్ల కల్తీ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయని మరికొందరి వాదన. ప్రభుత్వం నడపడానికి ముఖ్యమైన ఆదాయ వనరుల్లో మద్యం విక్రయాలు ఒకటి. 2016 ఏప్రిల్‌ నుంచి బీహార్ రాష్ట్రంలో మద్య నిషేధం విధించారు. ఫలితంగా బీహార్ కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయి ఇంకా నష్టపోతోంది. 2015లో మద్యంపై ఎక్సైజ్ సుంకం ద్వారా రాష్ట్రం రూ.4,000 కోట్లు ఆర్జించినట్లు లెక్కలు చెబుతున్నాయి. మద్య నిషేధం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి దాదాపు 40 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

Tags:    

Similar News