శ్రీనగర్‌కు ప్రధాని మోదీ.. రెండురోజులు ఆయన ఏం చేస్తారంటే..

ప్రధాని మోదీ గురువారం శ్రీనగర్‌కు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో ఆయన పాల్గొనే కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.

Update: 2024-06-20 12:57 GMT

ప్రధాని మోదీ గురువారం రెండు రోజుల పర్యటన నిమిత్తం శ్రీనగర్‌కు బయల్దేరి వెళ్లారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆయన రూ. 1,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేయనున్నారు. సుందరమైన దాల్ సరస్సు ఒడ్డున శుక్రవారం నిర్వహించే యోగా డేలో 7,000 మందికి పైగా పాల్గొంటారని అధికారులు తెలిపారు.

మరో కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొంటారని అధికారులు తెలిపారు. ‘‘జూన్ 21వ తేదీ ఉదయం 6.30 గంటలకు శ్రీనగర్‌లోని SKICCలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు. అనంతరం CYP యోగా సెషన్‌లో పాల్గొంటారు" అని ఒక అధికారి తెలిపారు.

మూడోసారి కేంద్రంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

కట్టుదిట్టమైన భద్రత..

ప్రధాని పర్యటన ప్రశాంతంగా సాగేందుకు శ్రీనగర్ నగరం అంతటా భద్రతా బలగాలను భారీగా మోహరించారు. డ్రోన్లు, క్వాడ్‌కాప్టర్ల ఆపరేషన్ కోసం శ్రీనగర్ పోలీసులు నగరాన్ని 'తాత్కాలిక రెడ్ జోన్'గా ప్రకటించారు.

Tags:    

Similar News