బీహార్ ఏఐ వీడియో కాంగ్రెస్ లో గుబులు రేపుతుందా?
మోదీ, ఆయన తల్లిపై ఏఐ వీడియో జనరేట్ చేసిన ఎక్స్ లో పోస్ట్ చేసిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ;
By : The Federal
Update: 2025-09-15 08:24 GMT
ఉబెర్ నకుష్భంది
ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన దివంగత తల్లి హీరాబెన్ మోదీ చనిపోయిన ఉదంతంపై కాంగ్రెస్ విడుదల చేసిన ఏఐ వీడియోపై రాజకీయ తుఫాన్ చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను ఖండించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో ఎలా, ఎవరూ పోస్ట్ చేశారో పరిశీలిస్తోంది.
ఈ వీడియోను అప్ లోడ్ చేయడం ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ఏదైన లోపం వల్ల జరిగిందా అనే దానిపై ఆరుగురు సభ్యుల నిజ నిర్ధారణ బృందం దర్యాప్తు చేస్తోందని కాంగ్రెస్ బీహార్ యూనిట్ వర్గాలు ‘ది ఫెడరల్’ కు చెప్పాయి.
దర్యాప్తుకు ఆదేశం..
బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వీడియో కంటెంట్ రూపొందించడానికి ఉన్న టీమ్ ను తదుపరి ఆదేశాలు వచ్చేే వరకూ ఎలాంటి వీడియోలు రూపొందించకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే రాజకీయంగా ఈ వీడియో దుమారం రేపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిని తన ఖాతా నుంచి తొలగించలేదు. దానిని అలాగే కొనసాగించింది.
ఈ నిజ నిర్ధారణ కమిటీలో బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(బీపీసీసీ) అధ్యక్షుడు రాజేష్ రామ్, ఏఐసీసీ బీహార్ ఇన్ చార్జీ కృష్ణ అల్లవారు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చీఫ్ షకీల్ అహ్మద్ ఖాన్, రాష్ట్ర యూనిట్ మీడియా విభాగం చీఫ్ రాజేశ్ రాథోడ్, ఏఐసీసీ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫాం జాతీయ కన్వీనర్ ప్రణవ్ వచ్చరాజని, బీహార్ వార్ రూమ్ ఇన్ చార్జీ గౌరవ్ కుమార్ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ మీడియా ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా కూడా దర్యాప్తును పర్యవేక్షిస్తారని వర్గాలు తెలిపాయి.
రాహుల్ గాంధీని ఆయన కుటుంబాన్ని బీజేపీ, మోదీ తీవ్రంగా విమర్శించినందుకే ఈ వీడియోను కాంగ్రెస్ రూపొందించిందని పవన్ ఖేరా సమర్థించుకున్నారు.
నిద్రలో కల వీడియో..
సెప్టెంబర్ 10న సాయంత్రం బీహార్ కాంగ్రెస్ ఎక్స్ హ్యాండిల్ లో ఓ ఏఐ జనరేటెడ్ వీడియలో హీరాబెన్ మోదీని మందలిస్తున్నట్లు డ్రీమ్ సీక్వెన్స్ తీశారు. ‘‘మీరు నన్ను నోట్ల రద్దులో క్యూలలో నిలబెట్టారు. నా పాదాలను కడిగిన రీల్స్ తయారు చేశారు.
ఇప్పుడు బీహార్ లో నా పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. నా అవమానాన్ని పోస్టర్లు, బ్యానర్లలో ముదించారు. మీరు మరోసారి బీహార్ లో నౌతంకి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలకు కోసం మరింత దిగజారిపోయారు’’ అని అందులో కాంగ్రెస్ జత చేసింది.
ఒకరోజు తరువాత బీజేపీ దాని భాగస్వాములు ఈ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చనిపోయిన వారిని మోదీ తల్లిని మధ్యలో లాగినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ మిత్రపక్షం ఆర్జేడీ సీనియర్ నాయకుడు తేజస్వీ యాదవ్ దీనిపై మాట్లాడిన తరువాత ఈ వివాదం మరింత తీవ్రంగా మారింది.
వీడియోను సమర్థించిన కాంగ్రెస్..
బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ మొదట్లో ఎదురుదాడి చేసింది. కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని పదేపదే విమర్శించినందుకు ఈ వీడియో రూపొందించామని చెప్పుకుంది. పవన్ ఖేరాతో పాటు, బీపీసీసీ నాయకుడు రాజేష్ రాథోడ్ ఇద్దరు కూడా ఈ చర్యను సమర్థించుకున్నారు.
‘‘మోదీ తన తల్లిని ఎప్పుడు గౌరవించారు. నాకు కనీసం ఒక్క అంశం చూపించు. తల్లిదండ్రుల విధి వారి పిల్లలకు విద్యను అందించడం, ఆమె తన బిడ్డకు విద్యను మాత్రమే అందిస్తోంది. ఆ బిడ్డ దానిని తన పట్ల అగౌరవంగా భావిస్తే అది అతని తలనొప్పి.
అది మాది(కాంగ్రెస్) కాదు. ప్రతిదాన్నుంచి సమస్యనను సృష్టించి దాని నుంచి సానుభూతిని సృష్టించడానికి బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయాలకు ఇకపై నకిలీ సానుభూతి లేదు. మోదీ రాజకీయాల్లో ఉన్నాడు.
ప్రతిపక్షాలు హాస్యాన్ని చేశాయి. దాన్ని సరిగ్గా తీసుకోవాలి. వాస్తవానికి అందులో హస్యం లేదు. సలహ మాత్రమే ఉంది’’ అని వారు సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
ఆ వీడియో హీరాబెన్ మోదీని గౌరవప్రదంగా చూపించిందని రాథోడ్ ది ఫెడరల్ తో అన్నారు. ‘‘ప్రతి మంచి తల్లి తన పనికిరాని కొడుకు తప్పులు చేస్తే అతన్ని తిడుతుంది. ఒక బిడ్డ పనికిరానివాడు అయితే అది తల్లి తప్పు కాదు’’ అని రాథోడ్ అన్నారు.
లోపం..
ఆ వీడియో పై ఖేరా నిజనిర్థారణ బృందం దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. రాథోడ్ పార్టీ దర్యాప్తు బృందంలో భాగం అవుతారు. ‘‘ఇది ఎలా జరుగుతుందో మేము పరిశీలిస్తున్నాము. ఇది తీర్పులో లోపమా లేదా ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తనా’’ అని కొనసాగుతున్న అంతర్గత పార్టీ విచారణ గురించి తెలిసిన ఒక సోర్స్ ‘ది ఫెడరల్’ తో అన్నారు.
అయితే ఈ వీడియో దానిపై బీజేపీ చేస్తున్న ప్రచారం.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందని భావించిన పార్టీ ఓ కమిటీని నియమించింది. పార్టీ భాగస్వామి ఆర్జేడీ నిర్ణయం ఈ కమిటీని నియమించడానికి బలవంతం చేసిందా అనేది స్పష్టంగా తెలియదు.
‘ది ఫెడరల్’ గతంలో చెప్పినట్లుగా ఇలాంటి వీడియోలు అప్ లోడ్ చేయవద్దని కాంగ్రెస్ తన నాయకత్వాన్ని హెచ్చరించింది.
బీహార్ కాంగ్రెస్ నాయకులు, ఏఐసీసీ సోషల్ మీడియా విభాగం నుంచి తప్పనిసరి అనుమతి లేకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని నిజ నిర్థారణ బృందంలోని ప్రాథమిక చర్చలతో పరిచయం ఉన్న వర్గాలు తెలిపాయి.
అనుమతి లేదు..
ఈ వీడియోను అంతర్గతంగా సృష్టించలేదని, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఉపయోగించ గల సోషల్ మీడియా కంటెంట్ ను ముఖ్యంగా వీడియోలను రూపొందించడానికి బీహార్ కాంగ్రెస్ లో ఉన్న కొన్ని బయట ఏజెన్సీలు సృష్టించి పోస్ట్ చేశాయని తెలిసింది.
పార్టీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఏదైన కంటెంట్ ప్రసారం చేయడానికి రూపొందించిన వ్యవస్థ ప్రకారం.. బాహ్య ఏజెన్సీ సృష్టించిన కంటెంట్ ను ముందుగా రాష్ట్ర యూనిట్ సోషల్ మీడియా అధిపతి, సంబంధిత రాష్ట్రానికి సంబంధించిన జాతీయ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఇన్ చార్జ్ తో సహా సీనియర్ నాయకులు వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాలి. వారికి అటువంటి కంటెంట్ ను పబ్లిక్ ప్లాట్ ఫాం లలో సర్క్యూలేషన్ కోసం క్లియర్ చేసే అధికారం ఉంది.
వివాదాస్పద వీడియోను బీహార్ కాంగ్రెస్ సంబంధిత వాట్సాప్ గ్రూప్ లో అవసరమైన ఆమోదం కోసం షేర్ చేసినప్పటికీ అది అనుమతి లేకుండా రాష్ట్ర యూనిట్ ఎక్స్ హ్యాండిల్ కు చేరుకుందని కొన్ని వర్గాలు తెలిపాయి.
‘‘ఇది గ్రూప్ లో పోస్ట్ చేయబడింది. కానీ ఎవరూ దానిని క్లియర్ చేయలేదు. ’’ అని బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియా బృందం సభ్యుడు ది ఫెడరల్ తో అన్నారు. రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర సమయంలో కూడా ఇటువంటి లోపాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
‘‘పార్టీ రాష్ట్ర మీడియా హ్యాండిల్స్ లో అనుమతి లేకుండా అనేక వీడియోలు పోస్ట్ చేయబడ్డాయి. ఎందుకంటే పబ్లిక్ గా ఏమి జరుగుతుందో పరిశీలించడానికి ఎవరూ అందుబాటులో లేరు’’
ఈ వీడియోలు ఏవీ రాజకీయంగా సున్నితమైనవి కావు. ఎటువంటి హెచ్చరికను కలిగించలేదు. కాబట్టి మోదీ, హీరాబెన్ మోదీ ఏఐ వీడియో తీవ్ర వివాదంగా మారే వరకూ లోపాలు కొనసాగాయని పార్టీ విభాగాలు తెలిపాయి.
బీహార్ ఎన్నికలపై ప్రభావం..
బీజేపీ చేసిన గందరగోళం తరువాత పార్టీ చివరకూ తన స్తబ్దత నుంచి మేల్కొన్నప్పటికీ ఖేరాతో సహా పార్టీ సీనియర్ నాయకులు ఇప్పటికే దానిని గట్టిగా సమర్థించుకున్నందున వీడియో నుంచి ఇప్పటికే జరిగిన నష్టాన్ని నియంత్రించడం ఇప్పటికే చాలా ఆలస్యం అయి ఉండవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంగీకరిస్తున్నాయి. బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ చర్యలు తీసుకోగలదు.
2024 లోక్ సభ ఎన్నికల షాక్ తరువాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ అధికారం కైవసం చేసుకోగలిగింది. ఇప్పుడు ఇటువంటి తప్పిదాల ద్వారా కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ బృందం ఈ విషయం పై దృష్టి సారించింది.