కేజ్రీవాల్ వ్యతిరేకులతో చేతులు కలిపినందుకే ఆమెను కొట్టారా?

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ పై దాడెందుకు జరిగింది? ఆమె చేసిన తప్పేంటీ?

By :  Admin
Update: 2024-05-18 07:37 GMT

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ పై దాడెందుకు జరిగింది? ఆమె చేసిన తప్పేంటీ? ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ పరసనల్ అసిస్టెంట్ దాడి చేశారు? ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. ముందస్తు అనుమతి లేకుండా స్వాతీ మాలీవాల్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆమెపై అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని వార్తలు వచ్చాయి. స్వాతీ మాలీవాల్ కూడా ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇది వివాదాస్పదమైంది.

అసలేం జరిగిందీ?
అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని ఆరోపించిన పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతీ మాలివాల్ అక్రమంగా ఓ అక్రమ రిక్రూట్‌మెంట్ కేసులో అరెస్టును ఎదుర్కొంటున్నారు. ఆమెను బిజెపి "బ్లాక్‌మెయిల్" చేస్తోంది. స్వాతి తన అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో కలిసి ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసిందన్న వదంతులు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై ఆప్ నేతలు చాలా కోపంగా ఉన్నారు. ఆప్ నాయకురాలు అతిషి కూడా దాదాపు ఇదే అర్థం వచ్చేలా ఆరోపణలు చేశారు. "ముఖ్యమంత్రిపై "కుట్ర"లో ఆమె భాగం. కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్న అతిషి రాజ్యసభసభ్యురాలు మలీవాల్ తీరును ఆక్షేపించారు. అపాయింట్‌మెంట్ లేకుండా ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లారని ఆరోపించారు.

"ఆమె లోపలికి ఎందుకు దూసుకెళ్లాలి? అపాయింట్‌మెంట్ లేకుండా సీఎం నివాసానికి వెళ్లవచ్చా? సోమవారం రోజు అరవింద్ కేజ్రీవాల్ బిజీగా ఉన్నారు. స్వాతిని కలిసే అవకాశం లేదు. ఆ రోజు ఆమెను కలిసి ఉంటే ఈవేళ బిభవ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు కేజ్రీవాల్ పై వచ్చేవి" అని అతిషి చెప్పారు.
దీన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే.. కేజ్రీవాల్ వ్యతిరేక పార్టీ అయిన బీజేపీతో స్వాతి చేతులు కలిపారు. దీన్ని మనసులో పెట్టుకున్న
అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి చేశారు. స్వాతి ఆరోపణల ప్రకారం బిభవ్ ఆమె చెంపపై ఏడెనిమిసార్లు గట్టిగా కొట్టారు. కేజ్రీవాల్‌ అధికారిక నివాసానికి వెళ్లినపుడు ఈ సంఘటన జరిగింది. విచక్షణారహితంగా తనను కొట్టారని ఆరోపించారు. ఇంతజరుగుతున్నా ఆమెను కాపాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడమే.. స్వాతీకి పార్టీకి మధ్య గ్యాప్ ఉందనేదానికి సంకేతం. స్వాతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ‘‘నా జీవితంలో నేనెదుర్కొన్న అత్యంత కష్టకాలం. నొప్పి, గాయం, వేధింపులు నా మనసును బాధించాయి. దాడితో నాకు నడవటం కష్టంగా ఉంది. ఈ ఘటనతో నేను తీవ్రంగా కలత చెందాను. కేజ్రీవాల్‌ను కలిసేందుకు సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన నివాసానికి వెళ్లాను. డ్రాయింగ్‌ రూంలో నేను ఎదురు చూస్తుంటే కుమార్‌ దూసుకొచ్చు తనపై కేకలు వేశారు. దుర్భాషలాడారు. నా చెంపపై ఏడెనిమిది సార్లు గట్టిగా కొట్టారు. దీంతో దిగ్భ్రాంతికి లోనై సాయం కోసం అరిచాను. అయినా ఎవ్వరూ ముందుకు రాలేదు" అని స్వాతి ఆరోపించారు. ‘నువ్వేం చేసుకుంటావో చేసుకో. మమ్మల్నేం చేయలేవు. నీ ఎముకలు విరగ్గొడతాం. శవాన్ని మాయం చేస్తాం’ అంటూ కుమార్‌ బెదిరించారని స్వాతి చెబుతున్నారు. అక్కడ నుంచి నేరుగా సివిల్‌ లైన్స్‌ పోలీసు స్టేషన్‌కు చేరి జరిగిన విషయమంతా ఎస్‌హెచ్‌వోకు వివరించాను. తీవ్రమైన నొప్పి.. మీడియా నుంచి వస్తున్న ఫోన్లు.. ఘటనను రాజకీయం చేయకూడదని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాను’’ అని మాలీవాల్‌ పేర్కొన్నారు. ఆమె తీస్‌ హజారీ న్యాయస్థానంలో మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారు. తనపై ఆరోపణలు నిరాధారమైనవని పార్టీ పేర్కొందని, తన వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నారని మాలీవాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆప్‌ ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు.
రకరకాల కథనాలు..
స్వాతి మాలీవాల్‌పై దాడి నేపథ్యంలో రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ సంఘటన ఢిల్లీ సీఎం ఇంటిలో జరిగిందా లేక బయట జరిగిందా అనే దానిపైనా అనుమానలు నెలకొన్నాయి. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటిలో జరిగిందేనని జాతీయ మీడియా రాసింది. మాలీవాల్‌.. భద్రతా సిబ్బంది మధ్య వాదన జరుగుతున్న చిత్రాలు బయటికి వచ్చాయి. దీనిపై స్వాతి మాలివాల్ ఎక్స్ (ట్విట్టర్)‌ వేదికగా స్పందించారు. ‘‘ప్రతిసారిలాగే.. ఈసారి కూడా ఈ రాజకీయ హిట్‌మ్యాన్‌ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అసలు విషయం బయటకు రాకుండా ఏవేవో పోస్టులు పెడుతున్నారు. ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవడానికి తంటాలు పడుతున్నారు’’ అని స్వాతి ఆరోపిస్తున్నారు. ఆమె ఆరోపణలపై ఆప్ అధికారికంగా ఇంకా ఎటువంటి వ్యాఖలు చేయలేదు.
Tags:    

Similar News