కాంగ్రెస్ ఏనాడు గాంధీ మార్గంలో నడవలేదు
లోక్ సభలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలు
By : Praveen Chepyala
Update: 2025-12-18 11:20 GMT
లోక్ సభలో ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్(గ్రామీణ్) (వీబీ జీ రామ్ జీ) బిల్లు-2025 గురువారం ఆమోదం పొందింది. సభలో జరిగిన చర్చ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహన్ ఇచ్చిన సమాధానం సభలో గందరగోళానికి దారితీసింది.
గాంధీ పేరును మోదీ ప్రభుత్వం తొలగిస్తుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించగా చౌహన్ వాటిని గట్టిగా తిప్పికొట్టారు. గాంధీకి తాము నివాళులర్పిస్తున్నానని చౌహాన్ అన్నారు.
బీజేపీ ఆయన చూపిన మార్గంలోనే నడుస్తుందని అన్నారు. ఈ బిల్లు గ్రామాల అభివృద్ధి కోసం అని చౌహాన్ చెప్పారు. ఇది గాంధీ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. గ్రామాల అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వ ఎజెండాగా ఉందని, సంవత్సరాలుగా అనేక పథకాలు అమలు చేస్తున్నామని చౌహాన్ అన్నారు.
‘‘ఎన్ఆర్ఈజీఏ ను మహాత్మాగాంధీ అనే ప్రయత్నంతో ప్రారంభించలేదు. ఎన్నికలు, ఓటు బ్యాంకును దృష్టితో ఉంచుకుని వారు 2009 లో ఎన్నికలకు ముందు మహాత్మాగాంధీ పేరు ను చేర్చారు’’ ని చౌహాన్ ఆరోపించారు.
యూపీఏ తన పదవీకాలంలో ఎన్ఆర్ఈజీఏ కోసం కేవలం రూ. 2.13 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, కానీ మోదీ ప్రభుత్వం 2014 నుంచి దానిపై రూ. 8.53 లక్షల కోట్లు ఖర్చు చేసిందని ఆయన అన్నారు. యూపీఏ హాయాంలో ఎన్ఈఆర్జీఏ దోపిడీ అవినీతితో నిండిపోయిందని కానీ మోదీ ప్రభుత్వం దానిని అవినీతిరహితంగా చేసింది’’ అని చౌహాన్ అన్నారు.
ప్రియాంక గాంధీ మహాత్మాగాంధీ పేరును తొలగించారని మాట్లాడుతున్నారు. వారి(ప్రియాంక కుటుంబం) నిజమైన గాంధీలు కాదు. కానీ వారు గాంధీ పేరును దొంగలించారు. ప్రియాంక గాంధీ పేర్లు మార్చే ‘సనక్’ గురించి మాట్లాడారు. వారు పేర్లతో నిమగ్నమై ఉన్నారు. అందుకే వారు ప్రతిదానికీ నెహ్రూ, ఇందిరా, రాజీవ్ పేర్లు పెట్టారు. మోదీ ప్రభుత్వానికి పేర్లతో కాదు, పనిలో నిమగ్నమై ఉంది’’ అని చౌహాన్ చురకలంటించారు.
‘‘వాళ్లు ఎప్పుడూ గాంధీని అనుసరించలేదు. మేము అనుసరిస్తున్నాము. స్వాతంత్య్రం తరువాత కాంగ్రెస్ ను రద్దు చేయాలని గాంధీ కోరుకున్నారు. కానీ నెహ్రూ అధికారం అనుభవించడానికి అలా చేయనివ్వలేదు.
కాంగ్రెస్ రద్దు చేయని రోజే బాపును చంపారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇచ్చిన రోజే బాపును చంపారు. విభజనకు అంగీకరించిన రోజే బాపును చంపారు’’ అని చౌహన్ పదునైన విమర్శలు గుప్పించారు.