ఏయే దేశాలలలో ఏ ఏ ఎంపీలు పర్యటించబోతున్నారంటే..
ఏడు బృందాల నాయకులు, సభ్యుల పేర్లను విడుదల చేసిన కేంద్రం, పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని చెక్ పెట్టడమే లక్ష్యం;
Translated by : Praveen Chepyala
Update: 2025-05-19 11:37 GMT
ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్ వ్యూహాత్మక దౌత్యపరమైన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం భారత్ ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను పంపుతోంది.
వీరిలో రాజకీయ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటేరియన్లు, మాజీ మంత్రులు, మాజీ రాయబారులు ఉన్నారు. వీరంతా కలిసి ప్రపంచంలోని వివిధ దేశాలకు రాజధానులకు వెళ్లబోతున్నారు.
మే 23 నుంచి ప్రతినిధి బృందాలు ఉగ్రవాదం పట్ల ముఖ్యంగా పాకిస్తాన్ చేస్తున్నక్రాస్ బోర్డర్ టెర్రరిజం గురించి ప్రపంచ దేశాలకు వివరించబోతున్నాయి. ఇంతవరకూ భారత్ లో ఇలాంటి ఏకీకృత రాజకీయ ఫ్రంట్ ను చూడలేదు. వీటిని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు సమన్వయం చేస్తున్నారు.
లక్ష్యాలు..
ఉగ్రవాదంపై భారత సమష్టి సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ ఏడు అఖిలపక్ష బృందాలు కీలక దేశాలను సందర్శిస్తారు. వారు 32 దేశాలతో పాటు బెల్జియంలోని బ్రస్సెల్స్ లోని యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించబోతున్నారు.
‘‘అన్ని రూపాల్లో, వ్యక్తీకరణలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ప్రదర్శిస్తున్న జాతీయ ఏకాభిప్రాయం, దృఢమైన విధానాన్ని అఖిలపక్ష ప్రతినిధులు ప్రదర్శిస్తారు.
ఇక ముందు ఉగ్రవాదం ఎలాంటి సహనం ప్రదర్శించమనే బలమైన సందేశాన్ని ఈ అఖిలపక్ష ప్రతినిధులు ప్రపంచానికి తీసుకువెళతారు’’ అని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రిత్వశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
కేంద్రమంత్రి కిరణ్ రిజుజు అఖిలపక్ష ప్రతనిధుల సభ్యుల పూర్తి జాబితా, వారు సందర్శించే దేశాల వివరాలను ప్రదర్శించారు.
ప్రతినిధి బృందం వివరాలు..
పార్టీలకు అతీతంగా ఎంపీలు, ప్రఖ్యాత దౌత్యవేత్తలు, మాజీ మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ దౌత్య వైఖరిని బలోపేతం చేసే పనిని కలిగి భుజాలకు ఎత్తుకుంది.
ఇందులో మొత్తం 51 మంది రాజకీయ నాయకులలో 31 మంది అధికార ఎన్డీఏ లో భాగస్థులు కాగా, మిగిలిన 20 మంది ఎన్డీఏయేతర పార్టీలకు చెందినవారు.
ప్రతి బృందానికి ఒక నాయకుడిని నియమించారు. వారు ప్రపంచ స్థాయిలో ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. ప్రతి బృందంలో ఏడు నుంచి ఎనిమిది సభ్యులు ఉంటారు. నాలుగు నుంచి ఐదు దేశాలను సందర్శించవచ్చు.
ఈ పర్యటన మే 23న ప్రారంభమై 10 రోజుల పాటు కొనసాగుతోందని భావిస్తున్నారు. పార్లమెంటేరియన్ల బృందాలు యునైటేడ్ స్టేట్స్, యునైటేడ్ కింగ్ డమ్, యూఏఈ, దక్షిణాఫ్రికా, జపాన్ తో సహ అనేక ప్రపంచ దేశాలకు సందర్శించే అవకాశం ఉంది.
నాయకులు...
వివిధ ప్రతినిధి బృందాలను నాయకత్వం వహించే విభిన్న పార్లమెంటరీ నాయకుల బృందం భారత్ తన సందేశాన్ని వినిపిస్తుంది.
ప్రతినిధి బృందం 1..
ఈ బృందానికి బీజేపీ ఎంపీ బైజయంత్ జే పాండా నేతృత్వం వహిస్తారు. ఈ బృందం సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియాలను సందర్శిస్తారు. ఈ బృందంలోని సభ్యులు..
నిషికాంత్ దూబే, ఫంగ్నాన్ కొన్యాక్, రేఖా శర్మ(బీజేపీ), అసదుద్దీన్ ఓవైసీ, సత్నాం సింగ్ సంధూ, గులాంనబీ ఆజాద్, రాయబారీ హర్ష్ శ్రింగ్లా
రెండో ప్రతినిధి బృందం..
దీనికి బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ నాయకత్వం వహిస్తారు. ఈ బృందం యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్ లను సందర్శిస్తారు. ఇందులో సభ్యులు..
దగ్గుబాటి పురంధేశ్వరి, ప్రియాంక చతుర్వేది, గులాం అలీ ఖటానా, అమర్ సింగ్, సమిక్ భట్టాచార్య, ఎంజే అక్బర్, రాయబారి పంకజ్ సరన్
మూడో ప్రతినిధి బృందం..
మూడో అఖిలపక్ష ప్రతినిధి బృందం జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాలను సందర్శిస్తుంది. ఇందులో సభ్యులు..
అపరాజిత సారంగి(బీజేపీ), యూసుఫ్ పఠాన్, బ్రిజ్ లాల్(బీజేపీ), జాన్ బ్రిట్టాస్(సీపీఎం), ప్రధాన్ బారువా(బీజేపీ), హేమాంగ్ జోషీ(బీజేపీ) సల్మాన్ ఖుర్షీద్(కాంగ్రెస్), రాయబారి మోహన్ కుమార్
నాలుగో ప్రతినిధి బృందం..
నాల్గవ అఖిలపక్ష బృందానికి శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నాయకత్వం వహిస్తారు. ఈ బృందం యూఏఈ, లైబీరియా, కాంగో, సియోర్రా లియోన్ లను సందర్శిస్తారు. ఈ బృందంలో సభ్యులు..
బన్సూరీ స్వరాజ్(బీజేపీ), మహ్మద్ బషీర్(ఐయూఎంఎల్), అతుల్ గార్గ్(బీజేపీ), సస్మిత్ పాత్ర(బీజేపీ), మనన్ కుమార్ మిశ్రా(బీజేపీ), ఎస్ఎస్ అహ్లావాలియా, సుజన్ చినోయ్(రాయబారీ)
ఐదో ప్రతినిధి బృందం..
ఈ ప్రతినిధి బృందానికి కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ నాయకత్వం వహిస్తారు. వీరు యూఎస్, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియాలను సందర్శించబోతున్నారు. ఈ బృందంలో సభ్యులు..
సర్ఫరాజ్ అహ్మద్(జేఎంఎం), జీఎం హరీష్ బాలయోగి(టీడీపీ), శశాంక్ మణి త్రిపాఠి, భువనేశ్వర్ కలిత, తేజస్వీ సూర్య(బీజేపీ), మిలింద్ మురళీ దేవర(శివసేన), తరంజిత్ సింగ్ సంధూ(రాయబారీ)
ఆరో ప్రతినిధి బృందం..
ఆరవ అఖిలపక్ష ప్రతినిధి బృందానికి డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి నాయకత్వం వహిస్తారు. వీరు స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాలను సందర్శిస్తారు. ఇందులో
రాజీవ్ రాయ్(ఎస్పీ), మియాన్ అల్తాఫ్ అహ్మద్(నేషనల్ కాన్ఫరెన్స్), బ్రిజేశ్ చౌతా(బీజేపీ), ప్రేమ్ చంద్ గుప్తా(జేడీయూ), అశోక్ కుమార్ మిట్టల్(ఆప్), మంజీవ్ ఎస్ పూరి( రాయబారీ), జావేద్ అష్రఫ్( రాయబారీ)
ఏడో ప్రతినిధి బృందం..
ఈ ప్రతినిధి బృందానికి ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని ఏడవ అఖిలపక్ష ప్రతినిధి బృందం ఈజిప్ట్,ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా లను సందర్శిస్తుంది. ఇందులో..
రాజీవ్ ప్రతాప్ రూడీ(బీజేపీ), విక్రమజీత్ సింగ్ సాహ్నీ(ఆప్), మనీష్ తివారీ(కాంగ్రెస్), అనురాగ్ ఠాకూర్(బీజేపీ), లావు శ్రీ కృష్ణ దేవరాయలు(టీడీపీ), ఆనంద్ శర్మ(కాంగ్రెస్), వి. మురళీధరన్(బీజేపీ), సయ్యద్ అక్భరుద్దీన్(రాయబారీ)
జాతీయ ఐక్యత..
ఈ ప్రతినిధి బృందాలలో విభిన్న రాజకీయ పార్టీల సభ్యులు ఉన్నారు. వీరి నుంచి అరుదైన సహకారం ప్రదర్శించబోతున్నారు. పాకిస్తాన్ లో ప్రేరేపిస్తున్న సీమాంతర ఉగ్రవాదంపై భారత్ వైఖరిని స్పష్టం చేయడానికి ఈ బృందాలు పనిచేయబోతున్నాయి.
పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కిరణ్ రిజుజు శనివారం మాట్లాడుతూ.. జాతీయ ఐక్యతకు ఈ శక్తివంతమైన బృందాలు భారత్ ఐక్యతను చాటుతాయని అన్నారు.
‘‘అత్యంత ముఖ్యమైన క్షణాల్లో భారత్ ఐక్యంగా ఉంటుంది. ఉగ్రవాదం పట్ల ఎలాంటి టాలరెన్స్ భరించకపోవడమనే మా భాగస్వామ్య సందేశాన్ని మోసుకెళ్లే ఏడు అఖిలపక్ష ప్రతినిధులు త్వరలో కీలక భాగస్వామి దేశాలను సందర్శిస్తారు.
రాజకీయాలకు, విభేదాలను అతీతంగా జాతీయ ఐక్యతకు ఇది శక్తివంతమైన ప్రతిబింబం’’ అని రిజుజు ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆపరేషన్ సిందూర్..
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులను మతం అడిగి పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీనికి బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్, పీఓజేకే లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిపణలుతో విరుచుకుపడి వందమంది ఉగ్రవాదులను హతం చేసింది.
తరువాత పాకిస్తాన్, భారత సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించడంతో ఐఏఎఫ్ ప్రతిగా పాక్ లోని 12 వైమానిక స్థావరాలను పేల్చివేసి, భారీ నష్టం కలుగ జేసింది.