బీహార్ లో రేపు కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

బీజేఎల్పీ నేతగా ఎన్నికైనా సామ్రాట్ చౌదరీ

Update: 2025-11-19 11:41 GMT
తారాపూర్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత సామ్రాట్ చౌదరి

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన బీజేపీ తన శాసనసభ పక్షనేతగా తారాపూర్ ఎమ్మెల్యే సామ్రాట్ చౌదరి ఎన్నికైనట్లు యూపీ డిప్యూటీ సీఎం సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు.

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ సిన్హాను బీజేపీ శాసనసభా పక్ష ఉప నాయకుడిగా ఎన్నుకున్నారని ఆయన అన్నారు. కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. ‘‘సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా వరుసగా బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు, ఉప నాయకుడిగా ఎన్నికయ్యారు’’ అని అన్నారు.

బీహార్ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికకు మౌర్యను కేంద్ర పరిశీలకుడిగా నియమించారు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడి ఎన్నికకు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, మాజీ కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతిలను కూడా సహ పరిశీలకులుగా నియమించారు.

ఇద్దరు కూడా సమావేశంలో పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నాయకుడు, ఉప నాయకుడిగా చౌదరి, సిన్హా పేర్లను ఎన్నికలకు ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదనలకు పార్టీ శాసనసభ్యులందరూ సమర్థించారని బీజేపీ నాయకుడు ఒకరు తెలిపారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో చౌదరి తారాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. సిన్హా లఖిసరై నియోజక వర్గాన్ని నిలబెట్టుకున్నారు.

బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైనా తరువాత సిన్హా విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పార్టీలోని ఇతర అగ్ర నాయకులు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞుడను. సుపరిపాలన ద్వారా అభివృద్ది(సుశాన్ సే సమృద్ది) అనే మోదీ నినాదాన్ని నేరవేర్చడానికి కృషి చేస్తున్నామన్నారు.

‘‘ప్రేమ, ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాలు ఇలాగే ఉంటాయి. మొదట ప్రజలు, ఈ ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ నాయకుడిని ఎన్నుకున్నారు’’ అని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరులతో అన్నారు.
నవంబర్ 20న అంటే రేపు బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువదీరనుంది. బీహార్ లో 243 స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఎన్డీఏ 202 స్థానాలు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ 19,హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 స్థానాలు గెలుచుకున్నాయి.


Tags:    

Similar News