‘వన్ నేషన్, వన్ ఎలక్షన్‘ ఆమోదంలో ప్రాంతీయ పార్టీలే కీలకమా?
బీజేడీ, బీఆర్ఎస్, వైసీపీ, అన్నాడీఎంకే ల మద్దతు కోసం కమల దళం తెరవెనక ప్రయత్నాలు
By : 491
Update: 2024-12-18 10:13 GMT
(జ్ఞాన్ వర్మ)
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తాను ఇచ్చిన హమీని నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ‘ వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లును ప్రవేశపెట్టింది. ఇంతకుముందు బీజేపీ అధికరణ 370 తొలగింపు, రామమందిర నిర్మాణం తమ ప్రాధాన్య లక్ష్యాలుగా పేర్కొని వాటిని పూర్తి చేసింది. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అవసరమైన మెజారిటీ రాలేదు. ఇప్పుడు బీజేపీ, ఎన్‌డిఎ నాయకత్వానికి నిజమైన పని పడింది.
లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లులకు పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం, ప్రస్తుతం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లోని బిజెపి, దాని మిత్రపక్షాలకు అంత బలం లేదు. అధికార కూటమి అవసరమైన సంఖ్యలను పొందడానికి BJP నాయకత్వం YSRCP, BJD, AIADMK, BRS వంటి ప్రాంతీయ పార్టీల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటి బలం తోడైన ఇంకా మెజారిటీ మార్కుకు అవసరమైన బలం చేకూరదు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఒకేదేశం, ఒకే ఎన్నిక బిల్లులు ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. అది లోక్‌సభ ముందు తన సిఫార్సులను సమర్పించనుంది.
ప్రధాన సవాలు
ONOE అమలును అనుమతించడానికి రాజ్యాంగ (నూట ఇరవై తొమ్మిదవ సవరణ) బిల్లు, 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2024కి కనీసం మూడింట రెండు వంతుల మద్దతు అవసరం అనేది BJP ముందున్న అతిపెద్ద సవాల్.
NDAకి లోక్‌సభలో 300 మందికి పైగా ఎంపీలు, రాజ్యసభలో దాదాపు 135 మంది ఎంపీలు ఉన్నప్పటికీ, రెండు బిల్లులను ఆమోదించడానికి అవసరమైన సంఖ్య రెండు సభల్లోనూ లేదు. "బీజేపీ, ఎన్‌డీఏలకు ఇప్పటికే లోక్‌సభలో 300 మందికి పైగా ఎంపీలు ఉన్నారు. ఎన్‌డీఏ రాజ్యసభలో సంఖ్య కూడా గణనీయంగా ఉంది, అయితే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేలా ఇతర రాజకీయ పార్టీలతో మాట్లాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
బిల్లు జేపీసీ వద్దే ఉంటుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి బిల్లు ఆమోదానికి మరిన్ని పార్టీలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. బిల్లు దేశానికి అనుకూలంగా ఉన్నందున ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావాలి, ” అని లోక్‌సభ బిజెపి సీనియర్ నాయకుడు ఒకరు ‘ఫెడరల్’తో అన్నారు.
తీవ్రమైన వ్యతిరేకత ఉందా..
ఎన్డీయేతర పార్టీలు, భావసారూప్యత కలిగిన పార్టీలు బిల్లుకు మద్దతుగా ముందుకు వస్తాయని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందుతుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు బిల్లులను అంగీకరించడం లేదని ఎన్డీయే నాయకులు అభిప్రాయపడుతున్నారు. బిల్లులను ఇండి కూటమిలోని పార్టీలు వ్యతిరేకిస్తున్నందున ప్రభుత్వం ఎలాంటి వ్యూహ రచన చేస్తుందో చూడాలని వారి భావనగా ఉంది.
'కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ఎన్డీఏలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు ఎజెండా లేదు. ఈ రోజు కూడా పరిస్థితి అదే. లోక్‌సభలో ONOEని అనుమతించే బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సభలో లేరు. ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలు, ఎంపీలు, ఇండి కూటమి నేతలు కూడా సభలో లేరు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే ఆలోచనను వారు అంతగా వ్యతిరేకిస్తున్నట్లయితే, వారు చేయగలిగేది కనీసం సభలో ఉండి చర్చ సమయంలో తమ అభిప్రాయాలను తెలియజేయడమే” అని లోక్‌సభకు చెందిన ఒక బిజెపి నాయకుడు ఫెడరల్‌తో అన్నారు.
పార్టీల ఇష్టం..
ONOE కోసం ప్రయాణం అనుకున్నంత సులభం కాదు. ప్రతిష్టాత్మక బిల్లులకు కాంగ్రెస్‌తో పొత్తులేని పార్టీల మద్దతు పొందడానికి BJP, NDA నాయకత్వానికి ఒప్పించే నైపుణ్యాలు అవసరం.
అధికార కూటమికి కావాల్సిన సంఖ్యను సులభతరం చేసేందుకు బీజేపీ నాయకత్వం వైఎస్సార్‌సీపీ, బిజూ జనతాదళ్, ఏఐఏడీఎంకే, బీఆర్‌ఎస్ మద్దతు కోసం ఎదురు చూస్తోంది. YSRCP ఈ నిర్ణయానికి బహిరంగంగా మద్దతు ఇచ్చినప్పటికీ, మిగిలిన వారి మద్దతు పొందడానికి బిజెపి నాయకత్వం BJD, BRS, అన్నాడిఎంకె అధినేతలతో మాట్లాడవలసి ఉంటుంది.
“బిల్లు ఇప్పుడే లోక్‌సభలో ప్రవేశపెట్టాం. లోక్‌సభలో బిజెడికి ఎంపి ఎవరూ లేరు. ఇప్పుడు బిల్లు జేపీసీకి వెళ్లి, ఆ తర్వాత ప్రభుత్వం మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బిల్లును రాజ్యసభకు తీసుకురానున్నారు. BJD నాయకులకి ఈ మొత్తం విషయం తెలుసు. బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చినప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాము” అని రాజ్యసభలో BJD నాయకుడు సస్మిత్ పాత్రా ‘ది ఫెడరల్’తో అన్నారు.
షరతులతో కూడిన మద్దతు..
లోక్‌సభలో నలుగురు, రాజ్యసభలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నందున ఓనోలో బీజేపీకి మద్దతు ఇవ్వడానికి వైఎస్సార్సీపీ, సిద్ధంగా ఉంది. కొన్ని కీలక అంశాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ అగ్రనాయకత్వం ఒప్పించాల్సి ఉంటుంది.
YSRCP సీనియర్ నాయకులు ONOEపై నిర్ణయానికి మద్దతు ఇస్తూనే, EVMలను కాకుండా బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
“YSRCP ONOEకి మద్దతుగా ఉంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు సాధారణ ఎన్నికలతో పాటు జరుగుతాయి కాబట్టి మేము ఇప్పటికే మన రాష్ట్రాల్లో ONOEని చూస్తున్నాము. అయితే ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు జరుగుతాయని వైఎస్సార్సీపీ డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ అవసరం.
ఎన్నికల సంఘం విశ్వసనీయతను YSRCP అనుమానించనప్పటికీ, ఎన్నికల ప్రక్రియపై పదేపదే లేవనెత్తుతున్న అనేక ప్రశ్నలు, సందేహాలు దాని మదిలో ఉన్నాయి. ఈ సందేహాలు ఒక్కసారి తొలగిపోవాలని మేము కోరుకుంటున్నాము. ఎన్నికల తర్వాత ప్రజల మనస్సులలో ఎటువంటి సందేహాలు ఉండకూడదని మేము కోరుకుంటున్నాము” అని YSRCP సీనియర్ MP పీవీ మిధున్ రెడ్డి ఫెడరల్‌తో అన్నారు.