ఖలిస్తాన్ ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు

ఉగ్రవాదులు ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ (కేజేడ్ఎఫ్) గ్రూపు సభ్యులు

By :  491
Update: 2024-12-23 10:02 GMT

దేశంలో కొన్ని రోజులుగా అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్న పాక్ ప్రేరిపిత ఖలిస్తాన్ ఉగ్రవాదులకు భారీ షాక్ తగిలింది. ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ టెర్రర్ మాడ్యుల్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను పంజాబ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ లో మరణించారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున పంజాబ్ లోని ఫిలిబిత్ లో చోటుచేసుకున్నట్లు జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.

మొన్న గురుదాస్‌పూర్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు తీవ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. నిందితులను గురుదాస్‌పూర్‌కు చెందిన గుర్విందర్ సింగ్ (25), వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), జస్‌ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్ (18)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
వీరి వద్ద నుంచి ఏకే సిరీస్ కు చెందిన రెండు రైఫిళ్లు, అనేక గ్లాక్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. పిలిభిత్‌లోని పురాన్‌పూర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని పోలీసు చెక్‌పాయింట్‌పై ఈ ముగ్గురూ గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారని ఉత్తరప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) అమితాబ్ యష్ తెలిపారు. "ఎన్‌కౌంటర్‌లో ముగ్గురికి తీవ్ర గాయాలు తగిలాయి. వెంటనే చికిత్స కోసం సిహెచ్‌సి పురాన్‌పూర్‌కు తరలించారు" అని అతను అంతకుముందుగా చెప్పారు.
కానీ తరువాత కాసేపటికే వీరు మరణించారు. వారి నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లాక్ పిస్టల్స్, భారీ మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. "మొత్తం టెర్రర్ మాడ్యూల్‌ను బహిర్గతం చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి" అని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అదుపులో ఉందని, చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని యష్ తెలిపారు.
పోలీస్ స్టేషన్లలో పేలుళ్లు
వారంలోపే పంజాబ్ లోని మూడు పోలీస్ స్టేషన్ లను ఖలిస్తాన్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. గురుదాస్‌పూర్‌లోని బంగర్ పోలీస్ పోస్ట్‌ను శుక్రవారం లక్ష్యంగా చేసుకోగా, మంగళవారం అమృత్‌సర్‌లోని ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు సంభవించింది.
బక్షివాల్ పోలీస్ పోస్ట్ వెలుపల కూడా పేలుడు సంభవించింది. తరువాత గురుదాస్‌పూర్‌లో కూడా పేలుళ్లు జరిగాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ పేలుళ్లలో ఎవరికీ గాయాలు కాలేదు.ఈ పేలుళ్లకు ఉగ్రవాద సంస్థ ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ బాధ్యత వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో ధృవీకరించినట్లు పోస్ట్ ప్రచారంలో ఉంది.


Tags:    

Similar News