బెయిల్ రావడం కోసం మామిడిపండ్లు, స్వీట్స్ తింటున్నారు.. ఈడీ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మెడికల్ కారణాలు చూపి బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఈడీ ఆరోపించింది.

Update: 2024-04-18 11:35 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం మెడికల్ కారణాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారని, ఎలాగైన బయటకు రావాలనే లక్ష్యంతో ఉన్నారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ వైద్యుడిని సంప్రదించడానికి అనుమతించాలని చేసిన విజ్ఞప్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించింది.

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నప్పటికీ చక్కెర అధికంగా ఉన్న ఆహారాన్ని తింటున్నారని పేర్కొంది. మెడికల్ బెయిల్ కోసం కారణాలను సృష్టించండానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది.

ఈడీ, కేజ్రీవాల్ ను ఎక్సైజ్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. న్యాయస్థానం ఢిల్లీ సీఎం కు వ్యక్తిగత వస్తువులను అనుమతించడమే కాకుండా, మధుమేహం కారణంగా ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ కారణాన్ని అడ్డుపెట్టుకుని బయటకు రావడానికి కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నాడని ఈ డీ అభియోగాలు మోపింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సిబిఐ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు వీటికి సంబంధించిన విషయాలను ప్రస్తావించింది. న్యాయమూర్తి వెంటనే కేజ్రీవాల్ రోజూ వారి ఆహర విషయాలతో కూడిన నివేదికను తనముందు పెట్టాలని తీహర్ జైలు అధికారులను ఆదేశించింది.
షుగర్ లెవల్స్‌లో హెచ్చుతగ్గులు ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ వైద్యుడిని సంప్రదించడానికి అనుమతి కోరుతూ కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు. రేపటిలోగా రిపోర్టు దాఖలు చేయాలని సంబంధిత అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు, ఈ కేసును కోర్టు మరోసారి విచారించే అవకాశం ఉంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి మధుమేహంతో బాధపడుతున్నారని వాదిస్తున్నప్పటికీ, మామిడిపండ్లు, బంగాళదుంపలు, స్వీట్లను తింటున్నారని ED వాదించింది - ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు తినకూడదని వైద్యులు సూచిస్తుంటారు. “అరవింద్ కేజ్రీవాల్ టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నప్పటికీ చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నారు. రోజూ 'ఆలూ పూరీ', మామిడిపండు, స్వీట్లు తినేవాడు. మెడికల్‌ బెయిల్‌ కోసం ఆధారాలు కల్పించేందుకు ఇలా చేస్తున్నారు’’ అని ఈడీ కోర్టుకు తెలిపింది.
అయితే వైద్యులు సూచించిన విధంగానే ముఖ్యమంత్రి భోజనం చేస్తున్నారని ఈడీ చేసిన ఆరోపణలకు కేజ్రీవాల్ లీగల్ టీమ్ కౌంటర్ ఇచ్చింది. ఆప్ అధినేతకు ఇంట్లో వండిన ఆహారాన్ని సరఫరా చేయకుండా ED కేవలం సాకులు చెబుతోందని కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఆరోపించారు.


Tags:    

Similar News