అమిత్ షా పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కేసు: విచారణపై సుప్రీం స్టే
థర్డ్ పార్టీ ద్వారా కేసు నమోదు చేయడం పై న్యాయవాదీ అభ్యంతరం.. నోటీసులు జారీ;
By : Praveen Chepyala
Update: 2025-01-20 13:04 GMT
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై పరువు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాహుల్ గాంధీ పై దాఖలైన పరువునష్టం కేసులో సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు విచారణ పై స్టే విధించింది. బీజేపీ కార్యకర్త నవీన్ ఝా 2019 లో షా పై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ పై కేసు పెట్టారు. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు చైబాసాలో తన బహిరంగ ప్రసంగాలలో రాహుల్ మాట్లాడుతూ.. అమిత్ షాను హంతకుడిగా నిందించారని ఆరోపించారు.
నోటీసులు జారీ చేసిన సుప్రీం..
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహాతాతో కూడిన ధర్మాసనం జార్ఖండ్ ప్రభుత్వానికి బీజేపీ నేతకు నోటీసులు జారీ చేస్తూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందన కోరింది. ‘‘ నోటీస్ జారీ చేయండి. తదుపరి ఉత్తర్వూలు వచ్చే వరకూ విచారణలో తదుపరి చర్యలు నిలిపివేస్తున్నాం’’ అని బెంచ్ పేర్కొంది.
రాహుల్ తరుఫున సీనియర్ న్యాయవాదీ అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ.. బాధిత వ్యక్తి మాత్రమే క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదును దాఖలు చేయవచ్చని పలు తీర్పులు చెబుతున్నారు. థర్డ్ పార్టీ ద్వారా పరువునష్టం ఫిర్యాదు దాఖలు చేయలేమని ఆయన వాదించారు. నవీన్ ఝా తరపున సీనియర్ న్యాయవాదీ మహేశ్ జెఠ్మలానీ కేసు వాదించారు.
తీర్పును వ్యతిరేకించిన..
రాంఛీలోని మెజిస్ట్రేయల్ కోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకుడు వ్యతిరేకించాడు. విచారణ లో పాల్గొనడానికి కోర్టుకు వ్యక్తిగతంగా హజరుకావాలని సూచించింది. ఈ ఆర్డర్ పై రాహుల్ గాంధీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు దిగువ స్థాయి కోర్టు విచారణ పై స్టే విధించింది.
అయితే ఫిర్యాదు దారు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసిన తరువాత మేజిస్ట్రేట్ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మెరిట్ ను కనుగొని ట్రయల్ కోర్టు ముందు హజరుకావాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై కూడా తరువాత హైకోర్టు స్టే విధించింది. రాహుల్ పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.