బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహన్ ఎన్నికవబోతున్నారా?
నేటీ నుంచి పాదయాత్ర చేయబోతున్న కేంద్రమంత్రి;
By : 491
Update: 2025-05-25 06:52 GMT
బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పదవికి అనేక మంది పోటీదారులు ఉన్నప్పటికీ చౌహన్ పేరు మాత్రమే కాషాయ సర్కిల్ లో బలంగా ప్రచారం పొందుతోంది.
ఆయన ఈ రోజు నుంచి(మే 25) తన లోక్ సభ నియోజకవర్గమైన విదిశ నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. ఇది బీజేపీ అధ్యక్ష అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు కాబోతుందనడానికి స్పష్టమైన సూచన.
ఈ పాదయాత్రలో చౌహన్ ప్రతిరోజు కనీసం 20-25 కిలోమీటర్ల కాలినడకన పర్యవేక్షిస్తారు. ఈ పార్లమెంటరీ స్థానంలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గాన్ని సందర్శిస్తారు.
ఆయన ప్రతి వారం రెండు మూడు రోజులు ఇలా పర్యటనకు కేటాయించారు. అంతే కాకుండా ఈ పాదయాత్ర విదిషకే పరిమిత కాకుండా ఇతర నియోజకవర్గాలను సైతం సందర్శించాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రజలకు చేరువ కావడం..
రాబోయే నాలుగు సంవత్సరాలు సార్వత్రిక ఎన్నికలు లేకపోవడం, మధ్యప్రదేశ్ లో మూడు సంవత్సరాలు రాష్ట్ర ఎన్నికలు లేకపోవడంతో ఆ పాదయాత్ర బీజేపీలో రాబోయే మార్పును సూచిస్తుంది.
మార్చ్ సందర్భంగా చౌహన్ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడమే కాకుండా లబ్ధిదారులతో సంభాషించి ఈ కార్యక్రమాల ప్రభావాన్ని ఆయన స్వయంగా అంచనా వేయబోతున్నారు.
‘‘ఈ పాదయాత్ర’’ కేవలం కేంద్ర పథకాల ప్రయోజనాలు చివరి వ్యక్తికి చేరేలా చూడటం, ప్రతి గ్రామం ప్రతి రైతు, ప్రతి మహిళకు సాధికారిత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
మేము ఎటువంటి అవకాశాన్ని వదులుకోము అని ఆయన అన్నారు. చౌహన్ అంకితభావం, పునాదితో తన కొత్త పాత్రలో స్పష్టంగా అడుగుపెడుతున్నాడు.
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధి
చౌహన్ కేవలం ఒక రాజకీయ నాయకుడే కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. బీజేపీ చెప్పే విలువలు, ఆదర్శాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు.
చౌహన్ గ్రామీణ మూలాలు, మధ్యతరగతి నేపథ్యం బీజేపీకి మూల స్తంభాలుగా ఉన్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రూపొందించిన వ్యూహాత్మక రాజకీయ చదరంగంలో చౌహన్ పార్టీ, ప్రభుత్వాం రెండింటిని సమతుల్యం చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు.
ఆయన పరిధి పార్టీ సరిహద్దులకు అతీతంగా విస్తరించి, ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వివాదాస్పద సమస్యలను పరిష్కరించడంలో ఒక వారధిగా ఆయన పనిచేస్తారని విశ్వసిస్తున్నారు.
చౌహన్ ను ఏదీ..
చౌహన్ ను ఇతర కార్యకర్తల నుంచి వేరు చేసేది అతని వినయం, పరిపాలన అనుభవం. సంస్థ పట్ల సహజమైన విధేయత అతడిని ఈ పదవికి పోటీదారుడిగా మార్చాయి.
బీజేపీ మరో నాయకత్వ పరివర్తనకు సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అది ఎన్నికల ద్వారా మాత్రం కాదని సంకేతాల ద్వారా చెపుతున్నారు. మోదీ- షా వ్యూహం, రాజకీయ నిర్ణయాల కారణంగా ఏకాభిప్రాయం వస్తుంది.
చౌహన్ ఇప్పుడూ ఈ అనధికార రేసుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన ఇటీవల ప్రకటించిన పాదయాత్ర ఒక ప్రచారం కంటే ఎక్కువ, ఒక పెద్ద పాత్రకు నాందిగా అనిపిస్తుంది.
బీజేపీ ఒక సందేశాన్ని స్పష్టంగా ఇవ్వదలుచుకుంది. పార్టీ భవిష్యత్ దాని అట్టడుగు వర్గాలతో తిరిగి కనెక్ట్ అవ్వడంలోనే ఉంది. హైటేక్, డిజిటల్, మీడియా కేంద్రీకృత రాజకీయాల ఆధిపత్యంలో ఉన్న యుగంలో చౌహన్ పాదయాత్ర ఆయనను రేసులో ప్రత్యేకంగా నిలిపింది.
ప్రజల దృష్టిలో..
బీజేపీ అధ్యక్ష పదవికి చాలామంది ఆశావహులు పోటీపడుతున్నారు. కొందరు సంస్థాగత విభాగానికి చెందినవారు కాగా, మరికొందరు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే పెద్దలు.
అయితే ఈ రేసులో చౌహన్ పేరు ప్రత్యేకంగా నిలబెట్టేది ఆయన నాయకత్వం, కింది స్థాయి కార్యకర్తల మధ్య అంతరం, ఆయనకున్న లోతైన అవగాహన. మధ్యప్రదేశ్ కు ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రులలో ఆయన ఒకరు.
ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రజల్లో మామ అనే ఇమేజ్ చాలా పదిలంగా ఉంది. ఆయనపై ప్రజల్లో విశ్వసనీయత, వారికి చేరువ కావడం, సున్నితమైన కమ్యూనికేషన్, ప్రాంతీయ సున్నితత్వం, అనుభవజ్ఞులైన పార్టీ కార్యకర్తల పట్ల గౌరవంలో పాతుకుపోయిన చౌహన్ నాయకత్వ శైలి పార్టీ శైలి సంస్థాగత నిర్మాణాన్ని పునర్జువింజేస్తుందనే నమ్మకం ఉంది.
ఆధిపత్యం చెలాయిస్తారా?
2023 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో చౌహన్ మరోసారి ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని అనుకున్నారు. కానీ ఆయన భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఇవి బీజేపీ అధినాయకత్వం, ఆర్ఎస్ఎస్ కు మరో ప్రణాళికలు వేశారని అర్థం అవుతోంది.
బీజేపీ అధ్యక్ష పదవికి మరో మాజీ ముఖ్యమంత్రి, మోదీకి సన్నిహితుడిగా పేరున్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఉన్నారు. ముఖ్యంగా 2026 లో తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు కూడా తెరపైకి వచ్చింది.
మహిళా ఓటర్లను ఆకర్షించడానికి సీతారామన్ ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు. అయితే చౌహన్ మిగిలిన అభ్యర్థులందరి కంటే ముందున్నారని తెలుస్తోంది.