ఢిల్లీ హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన తరువాత ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అల్లర్ల వెనక పెద్ద కుట్ర ఉందని కీలకమైన తొమ్మిది మందికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
పౌరుల ముసుగులో కుట్రపూరిత హింసను ప్రేరేపించిన వారికి బెయిల్ ఇవ్వడం కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. న్యాయమూర్తులు నవీన్ చావ్లా, షాలిందర్ కౌర్ లతో కూడిన ధర్మాసనం ఇమామ్, ఉమర్ ఖలీద్, మహ్మద్ సలీమ్ ఖాన్, షిఫా ఉర్ రెహమాన్, అథర్ ఖాన్, మీరాన్ హైదర్, అబ్దుల్ ఖలీద్ సైఫీ, గుల్పిషా ఫాతిమా బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.
రాజ్యాంగం పౌరులకు నిరసన తెలిపే, ఆందోళనలు చేసే హక్కును కల్పిస్తుందని, అయితే అవి క్రమబద్దంగా, శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా ఉంటే అలాంటి చర్యలు చట్టపరిధిలో ఉంటాయని పేర్కొంది.
శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు కానీ..
శాంతియుత నిరసనలలో పాల్గొనే హక్కు, బహిరంగ సమావేశాలలో ప్రసంగించే హక్కు ఆర్టికల్ 19(1)(ఏ) కింద రక్షించబడిందని, దానిని బహిరంగంగా తగ్గించడం సాధ్యం కాదని బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొంది. అయితే ఆ హక్కు ‘‘సంపూర్ణమైనది కాదు’’ అలాగే సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుందని పేర్కొనబడింది.
‘‘నిరసన తెలిపే స్వేచ్ఛా హక్కును అనుమతించినట్లయితే అది రాజ్యాంగ చట్రాన్ని దెబ్బతీస్తుంది. దేశంలోని శాంతి భద్రతల పరిస్థితిపై ప్రభావం చూపుతుంది’’ అని ధర్మాసనం పేర్కొంది.
‘‘పౌరులు నిరసనలు లేదా ప్రదర్శనల పేరుతో చేసే కుట్రపూరిత హింసను అనుమతించలేము. అలాంటి చర్యలు వాక్ స్వేచ్ఛ, వ్యక్తీకరణ సంఘం స్వేచ్ఛ పరిధిలోకి రావు కాబట్టి, వాటిని రాష్ట్ర యంత్రాంగం నియంత్రించాలి, తనిఖీ చేయాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.
విచారణలో..
విచారణలో జాప్యం నిందితుడికి బెయిల్ మంజూరు చేయడానికి ఇప్పటికే జైలులో గడిపిన సమయం వంటి కారణాలను పరిగణలోకి తీసుకుని అటువంటి కారణం అన్ని కేసులను విశ్వవ్యాప్తంగా వర్తించేది కాదని బెంచ్ తీర్పు ఇచ్చింది.
‘‘ప్రతికేసు ప్రత్యేక వాస్తవాలు, పరిస్థితులపై ఆధారపడి, బెయిల్ మంజూరు చేయడం లేదా తిరస్కరించడం అనే విచక్షణ రాజ్యాంగ న్యాయస్థానానికి ఉంటుంది’’ అని హైకోర్టు అభిప్రాయపడింది.
బెయిల్ దరఖాస్తులను విచారించే సమయంలో బాధితులు, వారి కుటుంబాలను పక్కన పెడితే సమాజం ఆసక్తి, భద్రత వంటి అంశాలను కోర్టులు పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. ప్రాసిక్యూషన్ ఇమామ్, ఖలీద్ లకు ఆపాదించిన వాటిని తేలికగా పక్కన పెట్టలేమని కోర్టు తీర్పు ఇచ్చింది.
హైకోర్టు సమన్వయ ధర్మాసనం బెయిల్ మంజూరు చేసిన సహ నిందితులు ఆసిఫ్ ఇక్భాల్ తన్హా, దేవాంగన కలిత, నటాషా నర్వాల్ లతో సమానత్వం కోసం దాఖలు చేసిన అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది.
యూఏపీఏ కింద కేసు..
ఢిల్లీ అలర్లలో 53 మంది మరణించారు. 700 మంది గాయపడ్డారు. అన్నికంటే ముఖ్యంగా అంకిత్ శర్మ అనే సీఐడీ అధికారిని ఇస్లామిక్ జిహదీ ఉన్మాదులు 40 సార్లు కత్తితో పొడిచి చంపారు. అతని దేహాన్ని డ్రైనేజీలో పడేశారు.
ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారులు ఖలీద్, ఇమామ్ అని వీరి పై చట్ట విరుద్ద కార్యకలాపాల నివారణ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ ల ప్రకారం కేసులు నమోదు చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల రిజిస్టర్ కు వ్యతిరేకం అనే ముసుగులో ఈ అల్లర్లకు పాల్పడ్డారు. నిందితులు 2020 నుంచి జైలులోనే ఉన్నారు. ట్రయల్ కోర్టు వారి పిటిషన్లు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టులో 2022 నుంచి వీరి బెయిల్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి.