ఎర్రకోట పేలుడు: ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలు ఏంటీ?

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Update: 2025-11-11 05:45 GMT
బాంబు దాడి జరిగిన ప్రాంతం

ఢిల్లీలోని ఐకానిక్ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగి కారు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సంఘటన జరిగిన చాలాసేపటి తరువాత కూడా అనేక ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ సహ దేశంలోని అన్ని ఉన్నత స్థాయి దర్యాప్తు, భద్రతా సంస్థలు పేలుడు స్థలానికి చేరుకున్నాయి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు వంటి కీలక ప్రదేశాలకు భద్రతను పెంచారు.

పేలుడు ఎక్కడ జరిగింది?
ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా ప్రకారం.. పేలుడు జరిగిన కారు నెమ్మదిగా కదులుతోంది. బహుశా రెడ్ సిగ్నల్ పడినందువల్ల కారు నెమ్మదిగా కదిలి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
కారు లో ఎవరు ఉన్నారు?
కారులో కొంతమంది ఉన్నారని కమిషర్ చెప్పారు. మరో సీనియర్ అధికారి ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. ఇది హ్యూందాయ్ ఐ20 కారు. గాయపడిన వారి శరీరంలో ఎలాంటి పెల్లేట్, ఇనుప ముక్కలు కనిపించలేదు. ఇది బాంబు పేలుడులో అసాధారణం. మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము’’ అని పేర్కొంది.
కారు బ్రాండ్ ఏంటీ?
కారు తయారీ గురించి అనేక ప్రచారాలు ఉన్నాయి. ఇది మొదటి స్విప్ట్, మరికొందరు ఎకో కారు అని పేర్కొన్నారు. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకారం అది పెట్రోల్ లేదా డీజిల్ వెర్షన్ కు చెందిన హ్యుందాయ్ ఐ20 కారు అని ప్రకటించారు.
కారు ఎవరిది?
పేలిపోయిన కారు నదీమ్ ఖాన్ పేరు మీద రిజిస్టర్ చేసినట్లు తెలిసింది. కాకపోతే ఇది హర్యానా నంబర్ ప్లేట్ కలిగి ఉంది. దీనిని అతను ఓఖ్లాలోని దేవేంద్ అనే వ్యక్తికి విక్రయించాడు. తరువాత ఆ వాహానాన్ని మళ్లీ అంబాలలోని ఒకరికి విక్రయించారు. సదరు వ్యక్తి దీనిని పుల్వామాకు చెందిన తారిఖ్ కు విక్రయించాడు.
పేలుడు ఎంత పెద్దది?
అగ్నిమాపక శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఆరు కార్లు, రెండు ఈ రిక్షాలు, ఒక ఆటో రిక్షా మంటల్లో కాలిపోయాయి. పేలుడు కారణంగా చెలరేగిన మంటలు రాత్రి 7.29 నిమిషాలకు అదుపులోకి వచ్చాయి.
ఆ పేలుడు చాలాశక్తివంతంగా ఉండటం మూలానా అనేక మీటర్ల దూరంలో పార్క్ చేసిన వాహానాల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పేలుడులో ఎర్రకోట మెట్రో స్టేషన్ కూడా స్వల్ఫంగా దెబ్బతీసింది.
చాందినీ చౌక్ ట్రేడర్స్ అసోసియేషన్ షేర్ చేసిన వీడియోలు పేలుడు తీవ్రతను వెల్లడించాయి. వాహానంపై ఛిద్రమైన మృతదేహం పడి ఉండటం కనిపించింది. పేలుడు జరిగిన ప్రదేశంలో శరీరభాగాలు చెల్లాచెదురుగా కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఎంతమంది చనిపోయారు
ఇప్పటి వరకూ అధికారికంగా మరణించిన వారి సంఖ్య 9 గా ఉంది. 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ పోలీసులు ఫోరెన్సిక్ లాబోరేటరీ, నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) అన్ని కీలక సంస్థలు సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నాయి.
పేలుడు సంభవించడానికి ముందు వాహానం వెళ్లిన మార్గాన్ని గుర్తించడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లను స్కాన్ చేస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారాన్ని పంచుకోవాలని ప్రత్యక్ష సాక్షులను పోలీసులు తెలిపారు.
ఉగ్రవాద కోణం ఉందా?
ప్రత్యేకంగా ఏదైనా చెప్పడం కష్టమని అయితే అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.
ఢిల్లీ సరిహద్దులోని ఫరీదాబాద్ లో ఒక కశ్మీర్ వైద్యుడు అద్దెకు తీసుకున్న గది నుంచి దాదాపు 360 కిలోల అనుమానిత అమ్మోనియం నైట్రేట్, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తరువాత ఢిల్లీలో పేలుడు సంభవించింది. హర్యానా, జేకే పోలీసులతో కలిసి, ఫరీదాబాద్ లోని ధౌజ్ ప్రాంతం నుంచి డాక్టర్ ముజమ్మిల్ గనైని అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News